Croma | క్రోమాలో ఐఫోన్ 16, 17పై భారీ తగ్గింపు.. సేల్ ఎప్పటి వరకు అంటే..?
Croma | ప్రముఖ రిటెయిల్ సంస్థ క్రోమా ఐఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది. ఈ మేరకు Everything Apple Sale పేరిట ఓ ప్రత్యేక సేల్ ను తమ స్టోర్‌లలో ఆ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 17 ను రూ.45వేల లోపు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఐఫోన్ 16ను కూడా రూ.35వేలకు కొనుగోలు చేయవచ్చు.
Technology | Published On Feb 21, 2026, 12.37 pm IST
Croma | ప్రముఖ రిటెయిల్ సంస్థ క్రోమా ఐఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది. ఈ మేరకు Everything Apple Sale పేరిట ఓ ప్రత్యేక సేల్ ను తమ స్టోర్‌లలో ఆ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 17 ను రూ.45వేల లోపు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఐఫోన్ 16ను కూడా రూ.35వేలకు కొనుగోలు చేయవచ్చు. పలు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, రివార్డులను కలిపితే ఆయా భారీ తగ్గింపు ధరకు ఆ ఫోన్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 17 లాంచింగ్ ధర రూ.82,900 ఉండగా ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.44,768కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 ధర ప్రస్తుతం తగ్గింపు అనంతరం రూ.35,991గా ఉంది.
ఐఫోన్ 17 విషయానికి వస్తే.. ఈ ఫోన్ ను కొన్నవారికి రూ.2వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. మరో 2 శాతం (రూ.1658) కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23,500 వరకు విలువ వస్తుంది. ఇది ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. గరిష్ట ధరగా ఆ మొత్తాన్ని ఇస్తారు. ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.8వేల వరకు అదనపు బోనస్‌ను కూడా ఇస్తున్నారు. వినియోగదారుల వద్ద టాటా న్యూ కాయిన్స్ ఉంటే వాటితో రూ.4,974 వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఇలా అన్ని ఆఫర్లను కలిపితే ఫోన్ ధర భారీగా తగ్గుతుంది. ఈ ఫోన్‌పై ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.4,145కు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 విషయానికి వస్తే ఈ ఫోన్ అసలు ధర రూ.69,900 ఉండగా, ప్రస్తుతం తగ్గింపు అనంతరం రూ.63,490కి లిస్ట్ అయింది. ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 కూపన్ డిస్కౌంట్ ఇస్తారు. రూ.6వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై గరిష్టంగా రూ.16వేలు ఇస్తారు. టాటా న్యూ కాయిన్స్ కూడా ఉంటే మరో రూ.3,999 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.35,991 అవుతుంది.
క్రోమా స్టోర్‌లలో ఈ సేల్‌ను మార్చి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని స్టోర్‌లలో ఈ ఆఫర్‌ను పొందవచ్చని తెలియజేసింది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



