Claude Opus 4.8 | క్లాడ్ ఒపస్ 4.8 వచ్చేసింది.. కోడింగ్‌లో భారీ అప్‌గ్రేడ్..
Claude Opus 4.8 | ఆంత్రోపిక్ తన ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ తాజా వెర్షన్ క్లాడ్ ఒపస్ 4.8 ని ప్రకటించింది. ఇది ఒపస్ 4.7 ఆధారంగా నిర్మాణం కాగా కోడింగ్, రీజనింగ్, ఏజెంటిక్ టాస్క్‌లలో గణనీయమైన మెరుగుదలను తీసుకొచ్చింది. అలాగే ధరల నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించింది.
Technology | Published On May 29, 2026, 11.44 am IST
Claude Opus 4.8 | ఆంత్రోపిక్ తన ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ తాజా వెర్షన్ క్లాడ్ ఒపస్ 4.8 ని ప్రకటించింది. ఇది ఒపస్ 4.7 ఆధారంగా నిర్మాణం కాగా కోడింగ్, రీజనింగ్, ఏజెంటిక్ టాస్క్‌లలో గణనీయమైన మెరుగుదలను తీసుకొచ్చింది. అలాగే ధరల నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించింది. ఈ విడుదలతోపాటు కొత్త వర్క్‌ఫ్లో కంట్రోల్స్, డెవలపర్ ఫీచర్లు, అలాగే క్లాడ్ ఉత్పత్తుల అంతటా సామర్థ్య మెరుగుదలను కూడా అప్‌డేట్ చేసింది. క్లాడ్ ఒపస్ 4.8 ఆంత్రోపిక్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు చెందిన తాజా వెర్షన్ కాగా కోడింగ్, రీసెర్చ్, సిస్టమ్-లెవల్ వర్క్‌ఫ్లోల వంటి సంక్లిష్టమైన, బహుళ దశల పనుల్లో మెరుగైన పనితీరును అందించేందుకు దీనిని రూపొందించారు. కోడింగ్, రీజనింగ్, ఏజెంటిక్ నైపుణ్యాలు, అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ వర్క్‌కు సంబంధించిన బెంచ్‌మార్క్‌లలో ఈ మోడల్ మెరుగైన ఫలితాలను చూపించింది. దీర్ఘ కాంటెక్స్ట్ టాస్క్‌లలో మరింత స్థిరత్వాన్ని ప్రదర్శించడంతోపాటు, పనుల అమలు సమయంలో అనిశ్చిత పరిస్థితులను మరింత సమర్థంగా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కచ్చితత్వం, విశ్వసనీయత..
క్లాడ్ ఒపస్ 4.8 ప్రధానంగా రీజనింగ్ కచ్చితత్వం, కోడింగ్ విశ్వసనీయత, వర్క్‌ఫ్లో సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించింది. అలాగే ఆధారంలేని లేదా అతిగా నమ్మకంతో ఇచ్చే సమాధానాలను తగ్గించి, క్లిష్టమైన పనుల్లో స్పందనల స్థిరత్వాన్ని పెంచింది. కోడింగ్, రీజనింగ్, ఏజెంటిక్ బెంచ్‌మార్క్‌లలో మరింత బలమైన పనితీరును కొత్త వెర్షన్ కనబరుస్తుంది. ఒపస్ 4.7తో పోలిస్తే ఫ్లాగ్ అవని కోడింగ్ సమస్యలు సుమారు 4 రెట్లు తగ్గినట్లు ఆంత్రోపిక్ వెల్లడించింది. దీర్ఘ కాంటెక్స్ట్, బహుళ దశల టాస్క్‌లలో మెరుగైన స్థిరత్వం ప్రదర్శిస్తుందని, అనిశ్చిత పరిస్థితుల నిర్వహణ, స్పందన పారదర్శకతలో మెరుగుదల కనబరుస్తుందని తెలిపింది. క్లాడ్ కోడ్‌లో భారీ స్థాయి ఇంజినీరింగ్ పనుల కోసం రూపొందించిన డైనమిక్ వర్క్‌ఫ్లోస్ ను ప్రవేశపెట్టారు. ఇది సంక్లిష్టమైన పనులను పద్ధతిగా విడగొట్టి, సమాంతరంగా అమలు చేసే సామర్థ్యాన్ని మోడల్‌కు అందిస్తుంది.
వందల సంఖ్యలో సబ్ ఏజెంట్లు..
ఒకే సెషన్‌లో వందల సంఖ్యలో సబ్-ఏజెంట్లను నడపడం, భారీ కోడ్‌బేస్‌లను ప్రాసెస్ చేయడం, అలాగే తుది ఫలితాలను అందించే ముందు ఇప్పటికే ఉన్న టెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌ల ద్వారా అవుట్‌పుట్‌లను ధ్రువీకరించడం వంటి పనులకు ఈ వ్యవస్థ మద్దతు ఇస్తుంది. సిస్టమ్ మైగ్రేషన్లు, భారీ రీఫ్యాక్టరింగ్ ప్రాజెక్టులు వంటి ఎంటర్‌ప్రైజ్ స్థాయి పనుల కోసం దీనిని రూపొందించారు. క్లాడ్ ఒపస్ 4.8లో క్లాడ్ ఏఐ, కోవర్క్ ప్లాట్‌ఫామ్‌లలో ఎఫర్ట్ కంట్రోల్స్‌ను జోడించారు. దీంతో టాస్క్ సంక్లిష్టతను బట్టి కంప్యూట్ వినియోగాన్ని వినియోగదారులు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వేగం, ఖర్చు, అవుట్‌పుట్ నాణ్యత మధ్య సౌలభ్యాన్ని అందిస్తుంది.
ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి..
లో ఎఫర్ట్‌తోనే వేగవంతమైన స్పందనలు ఇవ్వడంతోపాటు తక్కువ టోకెన్లు వినియోగం అయ్యేలా చేస్తుంది. హై ఎఫర్ట్‌ను డిఫాల్ట్‌గా ఇచ్చారు. దీంతో పనితీరు, నాణ్యత మధ్య సమతుల్యత ఉంటుంది. అలాగే ఎక్స్‌ట్రా లేదా ఎక్స్ హై ఎఫర్ట్‌ను కూడా ఇచ్చారు. దీంతో క్లిష్టమైన పనుల కోసం లోతైన రీజనింగ్ చేస్తుంది. అలాగే మ్యాక్స్ ద్వారా అత్యంత క్లిష్టమైన వర్క్ ఫ్లోల కోసం గరిష్ట కంప్యూట్ వినియోగం జరిగేలా చేస్తుంది. దీంతో వేగవంతమైన రిప్లైలు, నాణ్యమైన పనితీరు లభిస్తాయి. అయితే ఇప్పటికే ఉన్న ఓపస్ 4.7కు దీనికి టోకెన్ల వినియోగం, ధరల్లో మార్పు లేదని, కొత్త వెర్షన్‌ను ఇప్పటికే తమ పెయిడ్ యూజర్లకు అందిస్తున్నామని ఆంత్రోపిక్ తెలిపింది.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!

Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!






