Anthropic | క్లాడ్ డుయెట్.. పనులు గుర్తించి పూర్తి చేసే ఏఐ ఏజెంట్..
Anthropic | ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ డుయెట్ పేరుతో సరికొత్త ఏఐ ఏజెంట్‌ను పరిచయం చేసింది. వృత్తి నిపుణులు, చిన్న వ్యాపార యజమానుల కోసం రూపొందించిన ఈ ఏఐ ఏజెంట్ అప్పగించిన పనులను పూర్తి చేయడంతోపాటు, వినియోగదారుల దృష్టికి రావాల్సిన ముఖ్యమైన అంశాలను గుర్తించి తెలియజేస్తుంది.
Technology | Published On Oct 22, 2026, 1.52 pm IST
Anthropic | ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ డుయెట్ పేరుతో సరికొత్త ఏఐ ఏజెంట్‌ను పరిచయం చేసింది. వృత్తి నిపుణులు, చిన్న వ్యాపార యజమానుల కోసం రూపొందించిన ఈ ఏఐ ఏజెంట్ అప్పగించిన పనులను పూర్తి చేయడంతోపాటు, వినియోగదారుల దృష్టికి రావాల్సిన ముఖ్యమైన అంశాలను గుర్తించి తెలియజేస్తుంది. నిరంతర ప్రాజెక్టుల నిర్వహణ, రోజువారీ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణలో ఇది సహాయపడుతుంది. క్లాడ్ ఓపస్ 5.5 ఆధారంగా రూపొందించిన క్లాడ్ డుయెట్, వినియోగదారులు ఇప్పటికే క్లాడ్ ఖాతాలో ఏర్పాటు చేసుకున్న మెమరీ, నైపుణ్యాలు, అనుసంధానించిన యాప్‌ల సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. వినియోగదారులు దీనితో టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా ఒకే సంభాషణలో మాట్లాడవచ్చు. చిన్న పనుల నుంచి దీర్ఘకాలిక ప్రాజెక్టుల వరకు ప్రతి పనికీ కొత్త సంభాషణ ప్రారంభించాల్సిన అవసరం ఉండదు.
డివైస్ ఆఫ్‌లో ఉన్నా పని..
సాధారణ క్లాడ్ యాప్‌లో వినియోగదారులు ముందుగా ప్రశ్న అడిగితేనే స్పందన వస్తుంది. అయితే క్లాడ్ డుయెట్ ఉదయం స్వయంగా నివేదిక పంపించి, అనుసంధానించిన యాప్‌లలోని ముఖ్యమైన అంశాలను తెలియజేస్తుంది. వినియోగదారుల ఫోన్ లేదా కంప్యూటర్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక బ్రౌజర్ ఉన్న వర్చువల్ మెషీన్‌లో ఇది పనులను కొనసాగిస్తుంది. ప్రతి కొన్ని గంటలకు అనుసంధానించిన ఖాతాలను పరిశీలించి, వినియోగదారుల దృష్టికి రావాల్సిన అంశాలు ఉంటే నోటిఫికేషన్లు పంపిస్తుంది. ఎంత తరచూ పరిశీలించాలి, ఎప్పుడు అప్‌డేట్‌లు పంపాలి అనే విషయాలను వినియోగదారులు నిర్ణయించవచ్చు. ఏ పనులు పూర్తయ్యాయి, ప్రస్తుతం ఏ పనులు జరుగుతున్నాయి అనే వివరాలను కూడా పరిశీలించి, అవసరమైన సూచనలు ఇవ్వవచ్చు.
ఏయే పనులు చేయవచ్చు..
క్లాడ్ డుయెట్‌తో సమావేశాలను షెడ్యూల్ చేయడం, వివిధ టూల్స్ ఉపయోగించి డ్యాష్‌బోర్డులను రూపొందించడం, ఆర్థిక, విక్రయాల అంచనాలను సిద్ధం చేయడం, వెబ్ యాప్‌ల నమూనాలను రూపొందించడం, వాటిని అభివృద్ధి చేయడం వంటి పనులు చేయవచ్చు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు, సంక్షిప్త నివేదికలు, డ్యాష్‌బోర్డులను కూడా సిద్ధం చేస్తుంది. వినియోగదారులు చిన్న టెక్స్ట్ సందేశం లేదా వాయిస్ మెసేజ్ ద్వారా పనులను అప్పగించవచ్చు. ఆ పనిని పూర్తి చేయడానికి అవసరమైన యాప్‌లు, దశలను క్లాడ్ డుయెట్ గుర్తించి, నేపథ్యంలో పని చేస్తుంది. అనుసంధానించిన ప్రతి యాప్‌ను వినియోగదారులు విడివిడిగా తెరవాల్సిన అవసరం లేకుండా, ముఖ్యమైన సందేశాలు, పెండింగ్ పనులు, ఇతర అంశాలను గుర్తిస్తుంది. అయితే యాప్‌లను తరచూ పరిశీలించేలా సెట్టింగులు మార్చితే వినియోగ పరిమితులు వేగంగా ఖర్చవుతాయి.
https://youtu.be/Fb-68zqcSVs
ఆరు వేలకు పైగా కనెక్టర్లు, ప్లగిన్లు..
క్లాడ్ మార్కెట్‌ప్లేస్ ద్వారా ఆరు వేలకు పైగా కనెక్టర్లు, ప్లగిన్లకు క్లాడ్ డుయెట్ మద్దతు ఇస్తుంది. కమ్యూనికేషన్, ఫైనాన్స్, నియామకాలు, డాక్యుమెంట్ నిర్వహణ, మార్కెటింగ్, ఈ-కామర్స్ వంటి విభాగాలకు చెందిన యాప్‌లను అనుసంధానించుకోవచ్చు. జీమెయిల్, స్లాక్ ద్వారా మిస్ అయిన సందేశాలను గుర్తించి, సమాధానాల ముసాయిదాలను సిద్ధం చేయవచ్చు. క్విక్‌బుక్స్, స్ట్రైప్ ద్వారా చెల్లించని ఇన్‌వాయిస్‌లను పరిశీలించి, చెల్లింపుల కోసం రిమైండర్లను రూపొందించవచ్చు. గస్టో ద్వారా పని గంటలు, బోనస్‌లు, రీయింబర్స్‌మెంట్లతో సహా పేరోల్ ప్రక్రియను సిద్ధం చేసి నిర్వహించవచ్చు.
ప్రొ, మ్యాక్స్ వినియోగదారులకు అందుబాటులోకి..
క్లాడ్ డుయెట్‌ను ప్రస్తుతం అమెరికాలోని క్లాడ్ ప్రొ, మ్యాక్స్ చందాదారులకు పరిశోధన ప్రివ్యూగా దశలవారీగా అందిస్తున్నారు. అర్హత ఉన్న వినియోగదారులు వెయిట్‌లిస్ట్‌లో చేరవచ్చు. వారికి యాక్సెస్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ కోసం ప్రత్యేక యాప్‌లతోపాటు, కంప్యూటర్‌లో క్లాడ్.ఏఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం క్లాడ్ ప్రొ, మ్యాక్స్ ప్లాన్‌లతో అమెరికాలో ఉన్న వినియోగదారులకే ఈ ప్రివ్యూ అందుబాటులో ఉంది. టీమ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌లకు ప్రస్తుతం ఈ సదుపాయం లేదు.
తాజావార్తలు
- ●Revanth Reddy | ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలు పెడతాం
- ●Gold Rivers In India | గనుల్లోనే కాదు.. భారత్‌లోని ఈ 3 నదుల్లో ఇప్పటికీ బంగారం దొరుకుతుంది!
- ●Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా
- ●UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్
- ●KTR | విప్లవ సూర్యుడు కుమ్రం భీం : కేటీఆర్
- ●RS Praveen Kumar | మేడిగడ్డది సిట్ వేయాల్సిన కేసు.. డీజీపీకి లేఖ రాస్తం

Revanth Reddy | ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలు పెడతాం

Gold Rivers In India | గనుల్లోనే కాదు.. భారత్‌లోని ఈ 3 నదుల్లో ఇప్పటికీ బంగారం దొరుకుతుంది!

Dasyam Vinay Bhasker | వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటా

UN | దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాసలో భారత్






