Claude | క్లాడ్ ఫేబుల్ 5, మైథోస్ 5 వచ్చేశాయ్.. కొత్త ఏఐ మోడల్స్‌ను లాంచ్ చేసిన ఆంథ్రోపిక్..
Claude | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఆంథ్రోపిక్ తన అత్యంత శక్తివంతమైన కొత్త మైథోస్-క్లాస్ మోడళ్లను ప్రకటించింది. ఇందులో సాధారణ వినియోగదారుల కోసం భద్రతా పరిమితులతో రూపొందించిన క్లాడ్ ఫేబుల్ 5, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, శాస్త్రీయ పరిశోధనా భాగస్వాముల కోసం పరిమిత యాక్సెస్‌తో అందుబాటులో ఉన్న క్లాడ్ మైథోస్ 5 ఉన్నాయి.
Technology | Published On Jun 10, 2026, 11.55 am IST
Claude | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ఆంథ్రోపిక్ తన అత్యంత శక్తివంతమైన కొత్త మైథోస్-క్లాస్ మోడళ్లను ప్రకటించింది. ఇందులో సాధారణ వినియోగదారుల కోసం భద్రతా పరిమితులతో రూపొందించిన క్లాడ్ ఫేబుల్ 5, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, శాస్త్రీయ పరిశోధనా భాగస్వాముల కోసం పరిమిత యాక్సెస్‌తో అందుబాటులో ఉన్న క్లాడ్ మైథోస్ 5 ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు ఒకే కోర్ సిస్టమ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, మైథోస్ 5 నియంత్రిత వాతావరణంలో తక్కువ భద్రతా పరిమితులతో పనిచేస్తుంది. మైథోస్-క్లాస్ మోడళ్లు గతంలో ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ ద్వారా పరిచయం చేసిన ఓపస్-క్లాస్ మోడళ్ల కంటే మరింత అధిక సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఈ విభాగంలో తొలి మోడల్ అయిన క్లాడ్ మైథోస్ ప్రివ్యూ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. క్లాడ్ ఫేబుల్ 5ను ఆంథ్రోపిక్ ఇప్పటివరకు సాధారణ వినియోగానికి అందుబాటులో ఉంచిన అత్యంత శక్తివంతమైన మోడల్‌గా పేర్కొంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, నాలెడ్జ్ వర్క్, విజన్ టాస్కులు, శాస్త్రీయ పరిశోధన వంటి విభాగాల్లో ఇది అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక, బహుళ దశల పనుల్లో టాస్క్ క్లిష్టత పెరిగే కొద్దీ పనితీరు మరింత మెరుగుపడుతుందని తెలిపింది.
ఫేబుల్ 5 గణనీయమైన పురోగతి..
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో ఫేబుల్ 5 గణనీయమైన పురోగతి చూపింది. భారీ కోడ్‌బేస్‌ల మైగ్రేషన్‌లు, మొత్తం సిస్టమ్‌లో మార్పులు చేయడం వంటి క్లిష్ట పనులను ఇది సమర్థవంతంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ప్రారంభ పరీక్షల్లో నెలల తరబడి పట్టే ఇంజినీరింగ్ పనులను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసినట్లు సమాచారం. ఫిన్‌టెక్ సంస్థ స్ట్రైప్ నిర్వహించిన పరీక్షల్లో, 50 మిలియన్ లైన్ల రూబీ కోడ్‌బేస్ మైగ్రేషన్ వంటి పనులను ఫేబుల్ 5 రోజుల్లోనే పూర్తి చేసి నెలల సమయాన్ని ఆదా చేసినట్లు వెల్లడైంది. నాలెడ్జ్ వర్క్ , రీజనింగ్ రంగంలో కూడా ఈ మోడల్ బలమైన పనితీరు కనబరిచింది. ఫైనాన్షియల్ అనాలిసిస్, డాక్యుమెంట్ ఇంటర్‌ప్రిటేషన్, చార్టులు, టేబుళ్ల విశ్లేషణ, బహుళ దశల సమస్య పరిష్కారం వంటి అంశాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. హెబ్బియా ఫైనాన్స్ బెంచ్‌మార్క్‌లో సీనియర్ స్థాయి రీజనింగ్ టాస్కుల్లో అగ్రస్థాన పనితీరును నమోదు చేసింది. విజన్ సామర్థ్యాల పరంగా కూడా ఫేబుల్ 5 గణనీయమైన మెరుగుదల సాధించింది. శాస్త్రీయ ఫిగర్‌ల నుంచి కచ్చితమైన విలువలను గుర్తించడం, సంక్లిష్ట చార్టులను అర్థం చేసుకోవడం, స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా అప్లికేషన్ కోడ్‌ను తిరిగి నిర్మించడం వంటి పనులను సమర్థంగా నిర్వహిస్తుంది.
దీర్ఘకాలిక టాస్క్‌లలోనూ వినియోగం..
గత మోడళ్లతో పోలిస్తే అదనపు టూల్స్ అవసరం కూడా తగ్గింది. పరీక్షల సమయంలో కేవలం విజన్ ఆధారిత సెటప్‌తోనే పోకీమాన్ ఫైర్‌రెడ్ గేమ్‌ను విజయవంతంగా ఆడగలిగినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఫేబుల్ 5 మల్టీ-మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్‌ను ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీర్ఘకాలిక టాస్క్‌లలో కూడా సమన్వయాన్ని కొనసాగిస్తూ, పర్సిస్టెంట్ మెమరీ, స్వయంగా రూపొందించుకున్న నోట్స్ సహాయంతో మెరుగైన ఫలితాలను అందిస్తుంది. గేమింగ్ ప్రయోగాల్లో, ముఖ్యంగా స్లే ది స్పైర్ వంటి సందర్భాల్లో, పర్సిస్టెంట్ ఫైల్-బేస్డ్ మెమరీని ఉపయోగించడం వల్ల గత మోడళ్లతో పోలిస్తే మూడు రెట్లు మెరుగైన పనితీరు నమోదైనట్లు వెల్లడించారు. ఇక క్లాడ్ మైథోస్ 5ను నియంత్రిత శాస్త్రీయ పరిశోధన వాతావరణాల్లో వినియోగిస్తున్నారు. ప్రోటీన్, డ్రగ్ డిజైన్, బయోఇన్ఫర్మాటిక్స్ టూల్‌ల వినియోగం, ఎండ్-టు-ఎండ్ ఆటోనమస్ రీసెర్చ్, మిలియన్ల కణాలు, 138 జంతు జాతులపై జీనోమిక్స్ విశ్లేషణ, కొత్త జీవశాస్త్ర హైపోథెసిస్‌ల సృష్టి వంటి అంశాల్లో ఇది అధునాతన సామర్థ్యాలను ప్రదర్శించింది.

సున్నితమైన చర్యలను గుర్తిస్తాయి..
మైథోస్ 5 అనేక శాస్త్రీయ ఆవిష్కరణల్లో కూడా భాగస్వామ్యమైంది. కొన్ని మాలిక్యులర్ బయాలజీ హైపోథెసిస్‌లు ప్రయోగాత్మక పరీక్షల దశకు చేరుకోగా, ఈ.కోలి ప్రోటీన్‌లో కొత్త మెకానిజాన్ని గుర్తించిన హైపోథెసిస్ ను ధ్రువీకరించారు. 138 జంతు జాతుల సింగిల్-సెల్ డేటాసెట్‌లపై జీనోమిక్స్ పరిశోధనలను నిర్వహించడంతోపాటు, దూర సంబంధం ఉన్న జీవుల్లో సమాన కణ రకాల్ని గుర్తించే మెషిన్ లెర్నింగ్ మోడళ్లను కూడా రూపొందించింది. ఆంథ్రోపిక్ అంతర్గత అంచనాల ప్రకారం మైథోస్ 5లో తప్పుదారి పట్టించే ప్రవర్తన, దుర్వినియోగ సహకారం వంటి అంశాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని గుర్తించారు. ఫేబుల్ 5 కూడా అదే కోర్ సిస్టమ్‌పై ఆధారపడినందున దాని అలైన్‌మెంట్ లక్షణాలు కూడా సమానంగా ఉంటాయని పేర్కొన్నారు. భద్రతా పరంగా ఫేబుల్ 5లో విస్తృతమైన సేఫ్టీ సిస్టమ్‌లు అమలు చేశారు. సున్నితమైన లేదా హానికరమైన అభ్యర్థనలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత క్లాసిఫయర్‌లను ఉపయోగిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో స్పందనలను క్లాడ్ ఓపస్ 4.8కు మళ్లించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
జీవ, రసాయన శాస్త్రాల వినియోగంలో..
సైబర్ సెక్యూరిటీ దుర్వినియోగం, బయాలజీ , కెమిస్ట్రీ సంబంధిత ప్రమాదాలు, మోడల్ డిస్టిలేషన్ వంటి అంశాలపై ప్రత్యేక రక్షణలు అమలు చేశారు. వల్నరబిలిటీ ఎక్స్‌ప్లాయిటేషన్, రీకానైసెన్స్, లాటరల్ మూవ్‌మెంట్ వంటి దాడి విధానాలపై కూడా కట్టుదిట్టమైన నియంత్రణలు ఉన్నాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సున్నితమైన పరిశోధన అంశాలపై మరింత కఠినమైన ఫిల్టరింగ్ అమలు చేస్తున్నారు. అడెనో-అసోసియేటెడ్ వైరస్ (ఏఏవీ) డిజైన్ వంటి పరీక్షల్లో జన్యు మార్పుల ప్రభావాలను అంచనా వేయడంలో ఈ మోడల్ బలమైన సామర్థ్యాన్ని చూపినట్లు వెల్లడించారు. మోడల్ ప్రవర్తనను కాపీ చేసి పోటీ మోడళ్ల శిక్షణకు వినియోగించే ప్రయత్నాలను గుర్తించే డిస్టిలేషన్ రక్షణ వ్యవస్థలు కూడా అమలులో ఉన్నాయి. అనుమానాస్పద అభ్యర్థనలు గుర్తిస్తే వాటిని మరింత సురక్షితమైన స్పందనలకు మళ్లిస్తారు. మైథోస్-క్లాస్ మోడళ్ల కోసం ఆంథ్రోపిక్ 30 రోజుల డేటా రిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ డేటాను కొత్త మోడళ్ల శిక్షణకు ఉపయోగించరు. యాక్సెస్ మొత్తాన్ని లాగ్ చేస్తారు, పర్యవేక్షిస్తారు, ఎక్కువ సందర్భాల్లో 30 రోజుల తర్వాత తొలగిస్తారు. దీనిని కేవలం భద్రతా పర్యవేక్షణ, దుర్వినియోగ నిరోధక చర్యల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.
ధర ఎంతంటే..
క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం ఏపీఐ ద్వారా, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ద్వారా దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ప్రారంభ దశలో ప్రో, మ్యాక్స్, టీమ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్‌ల వినియోగదారులకు అదనపు చార్జీలను లేకుండా అందిస్తున్నారు. అనంతరం ఇది యూసేజ్ క్రెడిట్ ఆధారిత మోడల్‌కు మారనుంది. ఇక క్లాడ్ మైథోస్ 5 ను మాత్రం ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ భాగస్వాములు, ఎంపిక చేసిన పరిశోధనా సంస్థలకు మాత్రమే పరిమితం చేశారు. భవిష్యత్తులో నిర్మిత యాక్సెస్ ప్రోగ్రామ్‌ల ద్వారా మరింత విస్తరించే ప్రణాళిక ఉంది. ధరల విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లకు ఒక మిలియన్ ఇన్‌పుట్ టోకెన్లకు 10 డాలర్లు, ఒక మిలియన్ అవుట్‌పుట్ టోకెన్లకు 50 డాలర్లు వసూలు చేయనున్నారు.
సంబంధిత వార్తలు

Gemma 4 12B | ల్యాప్‌టాప్‌ల కోసం గూగుల్ కొత్త ఏఐ టూల్.. కంప్యూటర్ లోపల ఉండి పనిచేస్తుంది..
జూన్ 4, 2026

Claude Opus 4.8 | క్లాడ్ ఒపస్ 4.8 వచ్చేసింది.. కోడింగ్‌లో భారీ అప్‌గ్రేడ్..
మే 29, 2026

Daybreak | ఆంథ్రోపిక్ కు పోటీగా ఓపెన్ఏఐ డే బ్రేక్.. సైబర్ సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఏఐ మోడల్..
మే 12, 2026
తాజావార్తలు
- ●NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్రబాబు అవసరం లేనట్లేనా?
- ●realme P4R 5G | 8000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త ఫోన్.. అదిరిపోయే డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●President Droupadi Murmu | ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్
- ●Google | ఢిల్లీ డేటా సెంటర్ లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..
- ●PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్రధాని మోదీ
- ●CM Revanth Reddy | ఆ వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్

NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్రబాబు అవసరం లేనట్లేనా?

realme P4R 5G | 8000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త ఫోన్.. అదిరిపోయే డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..

President Droupadi Murmu | ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్

Google | ఢిల్లీ డేటా సెంటర్ లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..



