త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Claude AI | పెంట‌గాన్ ఘ‌ట‌న అనంత‌రం అమెరికాలో క్లాడ్ ఏఐకి ఒక్క‌సారిగా పెరిగిన డౌన్ లోడ్స్

Claude AI | అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ ఫ్రీ యాప్ చార్ట్‌లో ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ నంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకుంది. అమెరికాలోని ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్‌ను వాడొద్ద‌ని, 6 నెలల్లోగా పూర్తిగా వాడ‌కాన్ని నిలిపివేయాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే క్లాడ్ ఏఐ యాప్ అత్య‌ధిక డౌన్‌లోడ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

S

Technology | Published On Mar 1, 2026, 10.39 am IST

Claude AI | పెంట‌గాన్ ఘ‌ట‌న అనంత‌రం అమెరికాలో క్లాడ్ ఏఐకి ఒక్క‌సారిగా పెరిగిన డౌన్ లోడ్స్
Advertisement

Claude AI | అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ ఫ్రీ యాప్ చార్ట్‌లో ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ నంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకుంది. అమెరికాలోని ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఆంథ్రోపిక్ ఏఐ టూల్స్‌ను వాడొద్ద‌ని, 6 నెలల్లోగా పూర్తిగా వాడ‌కాన్ని నిలిపివేయాల‌ని ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే క్లాడ్ ఏఐ యాప్ అత్య‌ధిక డౌన్‌లోడ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆంథ్రోపిక్‌ను పెంట‌గాన్ తిర‌స్క‌రించిన‌ప్ప‌టికీ అమెరికా ప్ర‌జ‌లు మాత్రం ఆ సంస్థ సేవ‌ల‌ను కోరుకుంటున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆంథ్రోపిక్ ఏఐ మోడ‌ల్స్‌కు పూర్తి స్థాయిలో ప‌రిమితులు లేని యాక్సెస్ కావాల‌ని అమెరికా కోర‌గా దాన్ని ఆంథ్రోపిక్ తిర‌స్క‌రించింది. దీంతో ఆ సంస్థ‌పై ట్రంప్ నిషేధం విధించారు. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో ఆంథ్రోపిక్ టూల్స్‌ను వాడొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ట్రూత్ సోష‌ల్ పోస్టులో ఆంథ్రోపిక్ సంస్థ‌పై విమ‌ర్శ‌లు చేశారు. ర‌క్ష‌ణ శాఖ‌పై ఆ సంస్థ నిబంధ‌న‌ల‌ను బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌యత్నం చేస్తుంద‌ని ఆరోపించారు. ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి పీట్ హెగ్‌సెత్ ఆంథ్రోపిక్‌ను జాతీయ భ‌ద్ర‌త‌కు స‌ప్లై చెయిన్ రిస్క్‌గా గుర్తిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే దీనిపై ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ స్పందిస్తూ ర‌క్ష‌ణ శాఖ‌కు త‌మ దృక్ప‌థానికి అనుగుణంగా కాంట్రాక్ట‌ర్ల‌ను ఎంచుకునే హ‌క్కు ఉంద‌ని పేర్కొన్నారు. త‌మ సాంకేతిక‌త సైనిక ద‌ళాల‌కు గ‌ణ‌నీయ‌మైన విలువ‌ను అందిస్తుంద‌ని, అధికారులు ఈ నిర్ణ‌యాన్ని పునః ప‌రిశీలిస్తార‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపారు.

అత్య‌ధిక సంఖ్య‌లో డౌన్ లోడ్స్‌..

కాగా ఆంథ్రోపిక్ పై అమెరికా ఆంక్ష‌లు విధించిన త‌రువాత ప్ర‌జ‌లు ఆ సంస్థ‌కు చెందిన క్లాడ్ ఏఐ యాప్ ను అధిక సంఖ్య‌లో డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని చార్ట్స్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంత‌కు ముందు చాట్ జీపీటీ, గూగుల్ జెమిని వంటి యాప్‌లు నంబ‌ర్ వ‌న్ స్థానంలో పోటీ ప‌డుతూ వ‌చ్చాయి. కానీ వాటిని దాటి క్లాడ్ ఏఐ యాప్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. శ‌నివారం వ‌ర‌కు అమెరికా యాపిల్ యాప్ స్టోర్ ఫ్రీ యాప్ చార్ట్‌లో చాట్ జీపీటీ 2వ స్థానంలో ఉండ‌గా, గూగుల్ జెమిని 4వ స్థానంలో నిలిచింది. అంత‌కు ముందు జ‌న‌వ‌రి 30న క్లాడ్ ఏఐ యాప్ అదే చార్ట్‌లో 131వ స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఈ యాప్ టాప్ 20లోకి వ‌చ్చింది. ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. అయితే క్లాడ్ వృద్ధి చెందేందుకు ముందు అమెరికా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చాట్ జీపీటీని ఉప‌యోగిస్తూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ రెండో స్థానానికి ప‌డిపోయింది.

3 రెట్లు పెరిగిన సైన్‌-అప్స్‌..

ఆంథ్రోపిక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అమెరికాలో జ‌న‌వ‌రి నుంచి ఫ్రీ యూజ‌ర్ల సంఖ్య 60 శాతం కంటే ఎక్కువ‌గా పెరిగింద‌ని వెల్ల‌డైంది. న‌వంబ‌ర్ నుంచి రోజువారి సైన్‌-అప్స్ 3 రెట్లు పెరిగాయ‌ని, ఈ వారం అంత‌టా రికార్డు స్థాయికి చేరుకున్నాయ‌ని తేలింది. అలాగే చెల్లింపు సబ్‌స్క్రిప్షన్లు కూడా ఈ ఏడాదిలో రెండింత‌ల‌కు పైగా పెరిగాయ‌ని కంపెనీ తెలియ‌జేసింది. ఇక ఆంథ్రోపిక్‌ను 2021లో మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు స్థాపించారు. గ‌తేడాది కోడింగ్‌, ఎంట‌ర్‌ప్రైజ్ వినియోగానికి ఏఐ మోడ‌ల్స్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఆంథ్రోపిక్ పేరుగాంచింది. అయితే తాజాగా ప్ర‌ముఖ పాప్ గాయ‌ని కేటీ పెర్రీ త‌న క్లాడ్ ప్రొ సబ్‌స్క్రిప్షన్ స్క్రీన్ షాట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో క్లాడ్ ఏఐ అమెరికాలో ఒక్క‌సారిగా చార్ట్‌లో ఎగ‌బాకింది.

Advertisement
Advertisement