Windows Laptop | మీ పాత ల్యాప్‌టాప్ నెమ్మదిగా పనిచేస్తుందా..? ఈ చిట్కాలను పాటిస్తే వేగం పెరుగుతుంది..!
Windows Laptop | మీ ల్యాప్‌టాప్ నెమ్మదిగా పనిచేస్తోందా? దాని వేగం మీకు విసుగు తెప్పిస్తోందా? గేమింగ్ కోసం అయినా, ఆఫీస్ పనుల కోసం అయినా, లేదా సాధారణ వినియోగంలోనైనా మీ కంప్యూటర్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారా? అయితే దిగులు చెందాల్సిన పనిలేదు.
Technology | Published On Feb 6, 2026, 12.00 pm IST
Windows Laptop | మీ ల్యాప్‌టాప్ నెమ్మదిగా పనిచేస్తోందా? దాని వేగం మీకు విసుగు తెప్పిస్తోందా? గేమింగ్ కోసం అయినా, ఆఫీస్ పనుల కోసం అయినా, లేదా సాధారణ వినియోగంలోనైనా మీ కంప్యూటర్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారా? అయితే దిగులు చెందాల్సిన పనిలేదు. గేమర్ల నుంచి కార్యాలయ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే ఇది. అయితే ఎక్కువ ఖర్చు చేయకుండానే మీ ల్యాప్‌టాప్ పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, ల్యాప్‌టాప్‌లు కూడా కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా మారుయి. అయితే కొన్ని చిన్న అప్‌గ్రేడ్లు, సరైన ఆప్టిమైజేషన్ పద్ధతులు పాటిస్తే మీ పాత ల్యాప్‌టాప్‌ను మళ్లీ కొత్తదిలా వేగంగా మార్చుకోవచ్చు. అందుకోసం నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన మార్గాలు ఇలా ఉన్నాయి.
హార్డ్‌డిస్క్ స్థానంలో SSD: మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న సంప్రదాయ హార్డ్‌డిస్క్‌ను SSD (Solid State Drive)తో మార్చితే బూట్ టైమ్ నుంచి సాఫ్ట్‌వేర్ ఓపెన్ అయ్యే వేగం వరకు అన్నీ గణనీయంగా మెరుగవుతాయి. SSDలు హార్డ్‌డిస్క్‌లకంటే చాలా వేగంగా పనిచేస్తాయి. పాత ల్యాప్ టాప్‌లకు SSDలను అమర్చుకునేందుకు ప్రత్యేకమైన స్లాట్లు కూడా ఉంటాయి. అయితే మీకు ఈ విషయం తెలియకపోతే పీసీ హార్డ్ వేర్ టెక్నిషియన్‌ను సంప్రదించడం మేలు.
RAM అప్‌గ్రేడ్: మీ ల్యాప్‌టాప్‌లో 4GB RAM ఉంటే, దాన్ని 8GB లేదా 16GBకి పెంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ సాఫ్ట్‌వేర్లను రన్ చేయగల సామర్థ్యం పెరుగుతుంది, మల్టీటాస్కింగ్ మరింత సాఫీగా సాగుతుంది. సాధారణంగా పాత ల్యాప్ టాప్‌లకు చాలా తక్కువగా RAM ఉంటుంది. కనుక దాన్ని పెంచితే మీ సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. మీ ల్యాప్ టాప్ వేగంగా పనిచేస్తుంది.
అవసరం లేని ఫైల్స్, ప్రోగ్రామ్‌లు: వాడని సాఫ్ట్‌వేర్‌లు, పాత ఫైల్స్ ల్యాప్‌టాప్ స్టోరేజ్‌ను నింపి పనితీరును తగ్గిస్తాయి. వాటిని డిలీట్ చేయడం ద్వారా స్పీడ్ మెరుగవుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: కొత్త అప్‌డేట్స్‌లో బగ్ ఫిక్స్‌లు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ చేయడం అవసరం. మీ పీసీ లేదా ల్యాప్ టాప్ ఓఎస్, సాఫ్ట్ వేర్‌లను తరచూ అప్‌డేట్ చేయడం మంచిది.
యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్: వైరస్‌లు, మాల్వేర్‌లు ల్యాప్‌టాప్‌ను నెమ్మదింపజేస్తాయి. కనుక యాంటీవైరస్‌తో తరచూ స్కాన్ చేయండి.
స్టార్ట్‌అప్ ప్రోగ్రామ్‌లు: ల్యాప్‌టాప్ ఆన్ చేసిన వెంటనే అనవసరమైన సాఫ్ట్‌వేర్లు ఆటోమేటిగ్గా ఓపెన్ అవుతుంటే స్పీడ్ తగ్గుతుంది. Task Manager > Startup ట్యాబ్‌లోకి వెళ్లి అవసరం లేని వాటిని ఆఫ్ చేయండి.
టెంపరరీ, క్యాష్ ఫైల్స్: మీ ల్యాప్ టాప్ కమాండ్ ప్రాంప్ట్‌లో %temp% అనే కమాండ్‌ను రన్ చేసి ల్యాప్ టాప్‌లోని టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేయడం ద్వారా సిస్టమ్ వేగం కొంత పెరుగుతుంది. ఇలా ఈ టిప్స్ పాటిస్తే మీ ల్యాప్ టాప్ వేగం ఎప్పటిలాగే ఉంటుంది. చాలా సులభంగా పనులు చేసుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు




