ChatGPT | లాక్‌డౌన్ మోడ్ సహా.. చాట్ జీపీటీలో రెండు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు..
ChatGPT | ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ తన జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీలో రెండు నూతన సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. లాక్ డౌన్ మోడ్, ఎలివేటెడ్ రిస్క్ లేబుల్స్ పేరిట ఈ ఫీచర్లను ప్రవేశపెట్టారు.
Technology | Published On Feb 23, 2026, 12.18 pm IST
ChatGPT | ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ తన జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీలో రెండు నూతన సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. లాక్ డౌన్ మోడ్, ఎలివేటెడ్ రిస్క్ లేబుల్స్ పేరిట ఈ ఫీచర్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం డేటా లీక్ పై సర్వత్రా ఆందోళన నెలకొనడంతో చాట్ జీపీటీ నుంచి యూజర్లకు చెందిన ఎలాంటి డేటా కూడా హ్యాకర్లకు లీక్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు ఓపెన్ఏఐ తెలియజేసింది. డేటా భద్రత, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్లు చాట్‌జీపీటీలో అనివార్యమని ఆ సంస్థ తెలిపింది. హ్యాకర్లు ప్రస్తుతం ప్రాంప్ట్ ఇంజెక్షన్ పేరిట యూజర్ల డేటాను చోరీ చేసేందుకు యత్నిస్తున్నారని, అందువల్ల సెక్యూరిటీ కోసం ఈ ఫీచర్లు పనిచేస్తాయని వివరించింది.
యూజర్ ఏదైనా ఒక వెబ్‌పేజ్ లేదా డాక్యుమెంట్‌ను రివ్యూ చేసి అందులో ఉన్న సారాంశం కావాలని చాట్‌జీపీటీని కోరితే అప్పటికే ఆ పేజీ లేదా ఫైల్‌లో ఉండే హ్యాకర్ కోడ్‌ను కూడా చాట్‌జీపీటీ అమలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో యూజర్ డేటా లీక్ అయి హ్యాకర్లకు చేరుతుంది. తరువాత ఆ డేటాతో వారు యూజర్లకు బ్లాక్ మెయిల్ చేసి సైబర్ మోసాలకు పాల్పడవచ్చు. లేదా ఆ డేటాను ఎవరికైనా విక్రయించుకోవచ్చు. కనుక ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఆయా సెక్యూరిటీ ఫీచర్లను ఇచ్చినట్లు ఓపెన్ఏఐ తెలిపింది.
ఆ ఫీచర్లు ఇలా పనిచేస్తాయి..
యూజర్లకు చెందిన ఫైల్స్ లేదా కొన్ని రకాల వెబ్ పేజీలలో హ్యాకర్లను కోడ్‌ను కనిపించకుండా దాచి పెట్టే అవకాశం ఉంటుంది. వాటిని యూజర్లు చాట్ జీపీటీ ద్వారా రివ్యూ చేస్తే అప్పుడు ఆ కోడ్‌ను కూడా ఏఐ ప్రాసెస్ చేస్తుంది. దీంతో యూజర్‌కు చెందిన సమాచారం లీక్ అవుతుంది. సాధారణంగా చాట్ జీపీటీని ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు లేదా టూల్స్‌తో కలిపి వాడితే ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని ఏఐ ముందుగానే యూజర్‌ను హెచ్చరిస్తుంది. దీన్ని ఎలివేటెడ్ రిస్క్‌గా ఓపెన్ఏఐ పేర్కొంది. అలాగే లాక్ డౌన్ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే చాట్ జీపీటీ థర్డ్ పార్టీ వెబ్ సైట్‌లు, ఇతర టూల్స్‌కు కనెక్ట్ అవదు. దీంతో డేటా లీక్ అవకుండా ఉంటుంది. ఇలా ఈ రెండు ఫీచర్లు పనిచేస్తాయి. అయితే ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించేటప్పుడు వైద్యం, బ్యాంకింగ్ వంటి సున్నితమైన అంశాలకు చెందిన వివరాలను యూజర్లు ఏఐకి షేర్ చేయకపోవడమే మంచిదని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






