Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్‌సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
Preity Zinta | ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాపిస్తుండడంపై బాలీవుడ్ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పేరిట ప్రచారంలో ఉన్న ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
Entertainment | Published On Jul 3, 2026, 10.05 pm IST
Preity Zinta | ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాపిస్తుండడంపై బాలీవుడ్ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పేరిట ప్రచారంలో ఉన్న ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు అభ్యంతరకర కంటెంట్‌ను వేగంగా తొలగించేలా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది. సాధారణ వినియోగదారుల పోస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఫిర్యాదు వచ్చిన అభ్యంతరకర కంటెంట్‌పైనే చర్యలు తీసుకునే విధంగా ప్రోటోకాల్ సిద్ధం చేయాలని సూచించింది.
ఈ కేసులో గూగుల్, మెటా సంస్థలతో పాటు పలు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ప్రీతి జింతా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్.. ప్రస్తుతం ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నిజమైన చిత్రాలను గుర్తించడం కూడా కష్టంగా మారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కంటెంట్‌ను ఆలస్యం లేకుండా తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై గూగుల్, మెటా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు సూచించే అభ్యంతరకర లింకులను తొలగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే చట్టబద్ధమైన కంటెంట్‌పై ముందస్తు ఆంక్షలు విధించకుండా చూడాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై ఆచరణ సాధ్యమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!






