త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Burger King | సిబ్బంది ఎలా ప‌నిచేస్తున్నారో ఏఐ ద్వారా ట్రాక్ చేస్తున్న బ‌ర్గర్ కింగ్‌

Burger King | ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు ఏఐని వాడుతూ చాలా వ‌ర‌కు ఉద్యోగుల‌ను తొల‌గించాయి. అనేక రంగాల్లో ఏఐ చేస్తున్న అద్భుతాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

S

Technology | Published On Feb 27, 2026, 11.28 am IST

Burger King | సిబ్బంది ఎలా ప‌నిచేస్తున్నారో ఏఐ ద్వారా ట్రాక్ చేస్తున్న బ‌ర్గర్ కింగ్‌
Advertisement

Burger King | ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు ఏఐని వాడుతూ చాలా వ‌ర‌కు ఉద్యోగుల‌ను తొల‌గించాయి. అనేక రంగాల్లో ఏఐ చేస్తున్న అద్భుతాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రానున్నదంతా ఏఐ యుగ‌మే అని ఇప్ప‌టికే ఎంతో మంది టెక్ నిపుణులు, పారిశ్రామిక దిగ్గ‌జాలు అభివ‌ర్ణించారు. అయితే ఏఐ వాడ‌కం ప్ర‌తి చోటా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సంస్థ బ‌ర్గ‌ర్ కింగ్ త‌మ రెస్టారెంట్ల‌లోనూ ఏఐ వాడ‌కాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా క‌స్ట‌మ‌ర్ల‌తో త‌మ సిబ్బంది ఏమేర స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు, వారి ప‌ని సామ‌ర్థ్యం ఎలా ఉంది అన్న వివ‌రాల‌ను తెలుసుకునేందుకు బ‌ర్గర్ కింగ్ ఏఐని వాడుతోంది. ఇందుకు గాను ఓపెన్ఏఐతో ఆ సంస్థ భాగ‌స్వామ్యం అయింది.

ప్ర‌త్యేక‌మైన ఏఐ-ప‌వ‌ర్డ్ హెడ్ సెట్‌..

బ‌ర్గ‌ర్ కింగ్ ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న దాదాపు 500కు పైగా త‌మ రెస్టారెంట్ల‌లో ఏఐని ఉప‌యోగిస్తోంది. ఇందులో భాగంగా త‌మ సిబ్బందికి ఓ ప్ర‌త్యేక‌మైన ఏఐ-ప‌వ‌ర్డ్ హెడ్ సెట్‌ను అమ‌రుస్తారు. ఇందులో ప్యాటీ అనే చాట్ బాట్ నిక్షిప్త‌మై ఉంటుంది. ఇది సిబ్బంది వాయిస్‌ను గుర్తిస్తుంది. సిబ్బంది క‌స్ట‌మ‌ర్ల‌తో మాట్లాడే స‌మ‌యంలో ఉప‌యోగించే వెల్కం టు బ‌ర్గ‌ర్ కింగ్‌, ప్లీజ్‌, థాంక్ యూ వంటి చిన్న చిన్న ప‌దాల‌ను గుర్తుంచుకుంటుంది. ఆ త‌రువాత ఆ సంభాష‌ణ‌ల‌ను విశ్లేషించి సిబ్బందికి ఫ్రెండ్లినెస్ స్కోర్ ఇస్తుంది. దాన్ని బ‌ట్టి రెస్టారెంట్ యాజ‌మాన్యం సిబ్బంది ప‌నితీరును స‌మీక్షించ‌వ‌చ్చు. సిబ్బంది మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేసేందుకు ఆ స్కోరు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని బ‌ర్గ‌ర్ కింగ్ తెలిపింది.

ప్రైవ‌సీ మాటేమిటి..?

అయితే హెడ్‌సెట్ ధ‌రించిన‌ప్ప‌టికీ అందులో ఉండే ఏఐ సిబ్బంది మాట్లాడుకునే వేరే మాట‌ల‌ను విన‌ద‌ని, కేవలం క‌స్ట‌మ‌ర్ల‌తో మాట్లాడే సాధార‌ణ సంభాషణ ప‌దాల‌ను మాత్ర‌మే విని రికార్డు చేస్తుంద‌ని, అందువ‌ల్ల సిబ్బంది గోప్య‌త‌కు వ‌చ్చే ముప్పు ఏమీ ఉండ‌ద‌ని బ‌ర్గ‌ర్ కింగ్ తెలియ‌జేసింది. ఇక ఏఐ స‌హాయంతో రెస్టారెంట్ లో స‌రుకులు ఏ మేర నిల్వ ఉన్నాయి, ఏవి అయిపోయాయి వంటి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం కూడా సుల‌భ‌త‌రం అయింద‌ని, ఏవైనా స‌రుకులు అయిపోతే ఏఐ వెంట‌నే అల‌ర్ట్ చేస్తుంద‌ని బ‌ర్గ‌ర్ కింగ్ తెలియ‌జేసింది. కాగా ఈ ప్ర‌యోగం సక్సెస్ అవ‌డంతో అమెరికాలో ఇలాగే ప‌లు ఇత‌ర కంపెనీలు కూడా త‌మ‌ రెస్టారెంట్ల‌లోనూ ఏఐని వాడాల‌ని ఆలోచిస్తున్నాయి. టాకో బెల్‌, పిజ్జా హ‌ట్‌లు ఆ ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నాయి.

Advertisement
Advertisement