BSNL | బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. డేటా లేకుండానే అన్‌లిమిటెడ్ కాల్స్..
BSNL | ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.172, రూ.184, రూ.190 ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
BSNL | ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.172, రూ.184, రూ.190 ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
ఫీచర్ ఫోన్ యూజర్లకు మేలు..
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాలకు అనుగుణంగా డేటా సేవలను కలపకుండా కేవలం కాలింగ్, సందేశాల కోసం ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు కూడా ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, ఇంటర్నెట్ అవసరం లేని వారికి ఈ ప్లాన్లు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్లలో రూ.172 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అపరిమితంగా చేసుకోవడంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. రూ.184 ప్లాన్‌లో ఇదే ప్రయోజనాలతో 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ.190 ప్లాన్‌లో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది. ఈ మూడు ప్లాన్లలోనూ రోజువారీ ఖర్చు సుమారు రూ.6.13 నుంచి రూ.6.33 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్లలో మొబైల్ డేటా ప్రయోజనాలు ఉండవు.
బీఎస్ఎన్ఎల్‌కు 9.4 కోట్ల కనెక్షన్లు..
ట్రాయ్ విడుదల చేసిన చందాదారుల గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్‌కు 9.4 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్త ప్లాన్లతోపాటు ఇప్పటికే రూ.99, రూ.439 ధరలతో కూడిన వాయిస్ ఆధారిత ప్రత్యేక టారిఫ్ వోచర్లను కూడా సంస్థ అందిస్తోంది. వినియోగదారులు డేటా అవసరం లేని రీఛార్జ్ ప్యాక్‌లను సులభంగా గుర్తించి పోల్చుకునేందుకు టెలికాం సంస్థలు తమ వెబ్‌సైట్లు, స్వీయ సేవా మొబైల్ యాప్‌లలో ప్రత్యేకంగా ట్రాయ్ నిర్దేశించిన ప్యాక్‌ల విభాగాన్ని ఏర్పాటు చేశాయి. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్లాన్ల వివరాలను పరిశీలించవచ్చు.
సంబంధిత వార్తలు

BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్..
సెప్టెంబర్ 21, 2026

BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..
ఆగస్టు 14, 2026

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
జులై 9, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



