త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL | బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.1కే నెలవారీ ప్లాన్‌..

BSNL | కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 80వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు ఫ్రీడం ప్లాన్‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా రూ.1కే ఉచిత సిమ్‌ను అందించ‌డంతోపాటు మొద‌టి రీచార్జి ప్లాన్ ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1జీబీ ఉచిత డేటా ల‌భిస్తాయి.

S

Technology | Published On Aug 14, 2026, 10.52 am IST

BSNL | బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.1కే నెలవారీ ప్లాన్‌..
Advertisement

BSNL | కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 80వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు ఫ్రీడం ప్లాన్‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా రూ.1కే ఉచిత సిమ్‌ను అందించ‌డంతోపాటు మొద‌టి రీచార్జి ప్లాన్ ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1జీబీ ఉచిత డేటా ల‌భిస్తాయి. సెప్టెంబ‌ర్ 12 వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది. ఈ మేర‌కు ఆ సంస్థ తన ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టులో తెలియ‌జేసింది.

గ‌తేడాది కూడా ఇలాగే..

గ‌తేడాది కూడా స్వాతంత్ర్య దినోత్స‌వం నేప‌థ్యంలో బీఎస్ఎన్ఎల్  ఆజాదీ కా ప్లాన్ పేరుతో రూ.1 ప్లాన్‌ను తెచ్చింది. ఈ ప్లాన్ లో భాగంగా 30 రోజుల వాలిడిటీని ఇచ్చింది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భించాయి. ఫ్రీడం 2.0 ప్లాన్‌లో భాగంగా ప్ర‌స్తుతం ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజుల‌కు త‌గ్గించింది. రోజుకు 1జీబీ డేటాను మాత్ర‌మే ఉచితంగా ఇస్తోంది. ఈ ప్లాన్ కొత్త వినియోగ‌దారుల‌కే వ‌ర్తిస్తుంద‌ని, పాత యూజ‌ర్ల‌కు అందుబాటులో లేద‌ని తెలిపింది.

రూ.2399 ప్లాన్‌కు మార్పులు

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా త‌మ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తున్న రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌కు సంస్థ మార్పులు చేసింది. 365 రోజుల వాలిడిటీతో ల‌భించే ఈ ప్లాన్‌కు మ‌రో 47 రోజుల‌ను అద‌నంగా ఇస్తోంది. అంటే మొత్తం 412 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంద‌న్న‌మాట‌. ఈ వార్షిక ప్లాన్‌ను రీచార్జ్ చేసుకున్న వినియోగ‌దారుల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ హైస్పీడ్ ఉచిత డేటా  ల‌భిస్తాయి. ఈ ప్లాన్‌ను ఇప్ప‌టికే ప్ర‌వేశ‌పెట్ట‌గా మ‌రో నెల రోజుల పాటు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని బీఎస్ఎన్ఎల్ వెల్ల‌డించింది.

Advertisement
Advertisement