BSNL Prepaid Plans | బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. చాలా తక్కువ ధరలకే ఎక్కువ వాలిడిటీతో మరో రెండు ప్లాన్లు అందుబాటులోకి..
Technology | Published On Dec 14, 2025, 1.18 pm IST
BSNL Prepaid Plans | ప్రస్తుతం టెలికాం రంగంలో కేవలం మూడు సంస్థలు మాత్రమే ఉండడంతో చార్జిలను తరచూ విపరీతంగా పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వీఐ సంస్థలు ఇటీవలే ప్రీపెయిడ్ చార్జిలను పెంచాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రైవేటు కంపెనీల కన్నా చాలా తక్కువ ధరలకే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తాజాగా ఓ రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. రూ.2399, రూ.347లకు రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది. ఈ రెండు ప్లాన్లు భిన్న వాలిడిటీలను కలిగి ఉన్నాయి.
రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అయితే ఇదే వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ కావాలంటే ఇతర టెలికాం సంస్థలు భారీ ఎత్తున వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు టెలికాం సంస్థలు ఈ తరహా ప్లాన్లను రూ.3500 నుంచి రూ.4వేల మధ్యన అందిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ ఎంతో మంది ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రయోజనం అందించనుంది. ఇక బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ.2399 ప్లాన్‌లో కస్టమర్లకు పలు ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. దీని వల్ల రోజుకు 2 జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అలాగే ఉచిత బిఐటీవీ సర్వీస్ లభిస్తుంది. దీని ద్వారా ఆ యాప్‌లో 350కు పైగా లైవ్ టీవీ చానల్స్ ను వీక్షించవచ్చు. అలాగే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సేవలను కూడా ఉచితంగా పొందవచ్చు.
ఇక బీఎస్ఎన్ఎల్ రూ.347కు మరో ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 50 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌కు రోమింగ్ చార్జిలు ఉంటాయని బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది. ఇక ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తున్నట్లు తెలిపారు. అలాగే పైన తెలిపిన ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ లాగే ఇందులోనూ ఉచిత బీఐటీవీ సర్వీస్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనూ లైట్ టీవీ చానల్స్, ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇక ఈ ప్లాన్లను కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్‌లో రీచార్జి చేసుకోవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

Prepaid Plans | సైలెంట్‌గా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్న టెలికాం కంపెనీలు..? కారణాలేంటి..?
ఏప్రిల్ 20, 2026

HMWSSB | పనిచేయని జలమండలి కస్టమర్ కేర్ నంబర్.. నీటి ట్యాంకర్ ఎలా బుక్ చేయాలంటే?
ఏప్రిల్ 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



