BSNL Prepaid Plans | రిపబ్లిక్ డే సందర్భంగా BSNL సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఫీచర్లు ఇవే..
BSNL Prepaid Plans | భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. BSNL భారత్ కనెక్ట్ 26 పేరిట ఆ సంస్థ ప్రవేశపెట్టిన ప్లాన్ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది.
Technology | Published On Jan 26, 2026, 12.56 pm IST
BSNL Prepaid Plans | భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. BSNL భారత్ కనెక్ట్ 26 పేరిట ఆ సంస్థ ప్రవేశపెట్టిన ప్లాన్ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అయితే కేవలం పరిమిత కాల ఆఫర్ కింద మాత్రమే ఈ ప్లాన్‌ను అందిస్తున్నారు. కనుక ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందాలంటే కస్టమర్లు వీలైనంత త్వరగా దీన్ని రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్లాన్ అందుబాటులో ఉండదు.
ప్లాన్ ధర రూ.2626..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక ప్లాన్‌ను తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అందిస్తున్నట్లు BSNL తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్టులో వెల్లడించింది. ఈ క్రమంలో BSNL భారత్ కనెక్ట్ 26 ప్లాన్‌లో కస్టమర్లకు పలు అద్భుతమైన ప్రయోజనాలు లభ్యం కానున్నాయి. ఈ ప్లాన్ ధరను రూ.2626గా నిర్ణయించారు. జనవరి 26కు సూచికగా ఈ ప్లాన్‌ను నిర్దేశించారు. ఇక ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 2.6జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఇతర టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్‌లలో రోజుకు 2.5జీబీ డేటాను అందిస్తుండగా, BSNL మాత్రం కాస్త ఎక్కువ డేటాను అందిస్తుండడం విశేషం.
పరిమిత కాలం పాటు మాత్రమే..
ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. కనుక ఈ ప్లాన్ ను పొందాలంటే ఈ తేదీలోగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెల రోజుల సమయం ఉంది కనుక ఎలాగే నెలవారి ప్లాన్లను వాడేవారికి ఈ లోపు రీచార్జి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక అదే రీచార్జిని ఈ ప్లాన్‌తో చేసుకోవచ్చు. దీంతో ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీని అందిస్తుందని BSNL తెలియజేసింది.
ఇతర ప్లాన్లు..
అయితే BSNLలో పలు ఇతర సాధారణ వార్షిక ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కూడా లభిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. రోజుకు 2.5జీబీ డేటాను, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఇస్తారు. ఇక రూ.2799కు మరో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ కూడా లభిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. కానీ ఈ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. ఇక ఇతర ప్రయోజనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇలా BSNL అందిస్తున్న ఆయా ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్‌లను వినియోగదారులు పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

Jio | యూత్ కోసం జియో ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్.. ఎన్నో బండిల్డ్ బెనిఫిట్స్..
ఏప్రిల్ 25, 2026

Prepaid Plans | సైలెంట్‌గా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్న టెలికాం కంపెనీలు..? కారణాలేంటి..?
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



