OpenAI | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజెస్ యాప్‌లో ఇక చాట్ జీపీటీ..
OpenAI | యాపిల్ యూజర్లకు ఏఐ ప్లాట్ ఫామ్ ఓపెన్ ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ కు చెందిన ఐఓఎస్, మాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉండే మెసేజెస్ యాప్‌కు గాను చాట్ జీపీటీ ప్లగిన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీని వల్ల ఆయా ప్లాట్‌ఫామ్‌లలోని యూజర్లు ఇకపై మెసేజెస్‌లోనూ చాట్ జీపీటీని ఉపయోగించవచ్చు.
Technology | Published On Aug 21, 2026, 6.00 pm IST
OpenAI | యాపిల్ యూజర్లకు ఏఐ ప్లాట్ ఫామ్ ఓపెన్ ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ కు చెందిన ఐఓఎస్, మాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉండే మెసేజెస్ యాప్‌కు గాను చాట్ జీపీటీ ప్లగిన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీని వల్ల ఆయా ప్లాట్‌ఫామ్‌లలోని యూజర్లు ఇకపై మెసేజెస్‌లోనూ చాట్ జీపీటీని ఉపయోగించవచ్చు. దీని ద్వారా సంభాషణలను కొనసాగించవచ్చు. ముఖ్యంగా మెసేజ్‌లను చదవడం, వెదకడం, మెసేజ్‌లను సిద్ధం చేయడం, పంపించడం వంటి పనులు చేస్తుంది. ఐమెసేజ్, ఎస్ఎంఎస్, ఆర్‌సీఎస్ చాట్‌లలో చాట్ జీపీటీ ప్రస్తుతం అందుబాటులో ఉందని ఓపెన్ ఏఐ వెల్లడించింది.
ఎలా వాడాలి..
యూజర్లు ప్లగిన్స్‌లోని పబ్లిక్ విభాగం నుంచి ఈ ప్లగిన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఓఎస్‌లో అవసరమైన అనుమతులు ఇవ్వాలి. అనుమతులు పూర్తయిన తర్వాత చాట్‌జీపీటీ మెసేజెస్‌లోని సమాచారాన్ని వెదకడం, సంక్షిప్తంగా వివరించడం, మెసేజ్‌లను రూపొందించడం లేదా నేరుగా పంపించడం వంటి పనులు చేస్తుంది. ఉదాహరణకు.. క్యాలెండర్‌ను పరిశీలించి డిన్నర్ కోసం అందుబాటులో ఉన్న సమయాలను ఒక కాంటాక్ట్‌కు రిప్లైగా పంపమని చాట్‌జీపీటీని అడగవచ్చు. అలాగే అంతకుముందు రోజు మెసేజెస్‌లో జరిగిన సంభాషణలను పరిశీలించి ఫాలోఅప్ చేయాల్సిన విషయాలను సూచించవచ్చు. మెసేజెస్‌లో ప్రస్తావించిన పుట్టినరోజులను గుర్తించి క్యాలెండర్‌లో చేర్చడం, డిలీట్ చేయగలిగే అనుమానాస్పద స్పామ్ మెసేజ్‌లను గుర్తించడం కూడా సాధ్యమవుతుంది.
యూజర్ అనుమతి తప్పనిసరి..
డిఫాల్ట్‌గా చాట్‌జీపీటీ ఒక మెసేజ్‌ను పంపే ముందు ఆ మెసేజ్‌తోపాటు దాని గ్రహీతను కూడా యూజర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఒక్కసారి మాత్రమే అనుమతి ఇవ్వడానికి అలో వన్స్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. లేదా నిర్దిష్ట మెసేజెస్ చాట్‌కు భవిష్యత్తులో పంపే మెసేజ్‌లకు ప్రతిసారీ అనుమతి అవసరం లేకుండా ఆల్వేస్ అలో సెండింగ్ టు దిస్ చాట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే నిరంతర అనుమతిని ఇస్తే చాట్‌జీపీటీ పంపించే ముందు చివరిసారిగా మెసేజ్‌ను స్వయంగా పరిశీలించే అవకాశం యూజర్‌కు ఉండదని ఓపెన్‌ఏఐ హెచ్చరిస్తోంది. మళ్లీ ప్రతి మెసేజ్‌కు అనుమతి కోరే విధానాన్ని తీసుకురావాలంటే సెట్టింగ్స్‌లోని కంప్యూటర్ యూజ్ విభాగానికి వెళ్లి, మెసేజెస్ పక్కన ఉండే మేనేజ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఆల్వేస్ అలోడ్ జాబితా నుంచి సంబంధిత చాట్‌ను తొలగించాలి. మెసేజెస్‌కు ఫుల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు లేదా ఆమోదం కోరే ప్రాంప్ట్‌లను డిసేబుల్ చేసినప్పుడు, అవసరమైన సెండ్ కన్ఫర్మేషన్‌ను యాపిల్ మెసేజెస్ చూపించదని ఓపెన్‌ఏఐ తెలిపింది. అలాంటి సమస్య ఎదురైతే ఆస్క్ ఫర్ అప్రూవల్ లేదా అప్రూవ్ ఫర్ మీ ఆప్షన్‌కు మారి మరోసారి ప్రయత్నించాలని సూచించింది.
ఏయే ప్లాట్‌ఫామ్‌లపై..
యాపిల్ మెసేజెస్ ప్లగిన్ మాక్ కోసం అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ డెస్క్‌టాప్ యాప్‌లో అన్ని ప్లాన్‌ల యూజర్లకు అందుబాటులో ఉంది. ఇది చాట్‌జీపీటీ వర్క్, కోడెక్స్‌తో కూడా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ యాపిల్ సిలికాన్ ఆర్మ్64 బిల్డ్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఇంటెల్ ప్రాసెసర్ ఉన్న మాక్ కంప్యూటర్లలో ఈ ప్లగిన్‌కు ప్రస్తుతం మద్దతు లేదు. త్వరలోనే దీన్ని ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పైనా అందించనున్నారు. ఇక ఈ ప్లగిన్ మాక్‌లోని మెసేజెస్ యాప్ ద్వారా పనిచేస్తుంది. చాట్‌జీపీటీ వెబ్ వెర్షన్ లేదా మొబైల్ యాప్‌లో ఇది అందుబాటులో లేదు. అలాగే కోడెక్స్ కమాండ్ లైన్ ఇంటర్‌ఫేస్, ఐడీఈ ఎక్స్‌టెన్షన్‌లో కూడా పనిచేయదు. ముఖ్యంగా మెసేజెస్ ద్వారా దూరం నుంచి చాట్‌జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఈ ప్లగిన్ ఇవ్వదు. సాధారణ చాట్‌జీపీటీ చాట్‌లలో కూడా ఇది పనిచేయదు. మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌లలో అడ్మినిస్ట్రేటర్లు ఇప్పటికే ఉన్న కంప్యూటర్ యూజ్ కంట్రోల్ ద్వారా యాపిల్ మెసేజెస్ యాక్సెస్‌ను డిసేబుల్ చేయవచ్చు.
తాజావార్తలు
- ●Atomberg IPO | ఆటంబర్గ్ ఐపీవో వచ్చేస్తోంది.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి..
- ●Sowcar Janaki | దేవదాస్‌లో ఛాన్స్ మిస్...కన్నడ స్టార్‌కు తల్లిగా...హీరోయిన్గా...షావుకారు జానకి
- ●Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
- ●Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..

Atomberg IPO | ఆటంబర్గ్ ఐపీవో వచ్చేస్తోంది.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి..

Sowcar Janaki | దేవదాస్‌లో ఛాన్స్ మిస్...కన్నడ స్టార్‌కు తల్లిగా...హీరోయిన్గా...షావుకారు జానకి

Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు






