త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL | బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. అతి త్వ‌ర‌లో CNAP సేవ‌లు..

BSNL | స్మార్ట్ ఫోన్ల‌లో కాల్స్ వ‌చ్చిన‌ప్పుడు అవ‌త‌లి వ్య‌క్తుల పేర్లు తెలియ‌వు. కేవ‌లం ఫోన్ నంబ‌ర్ మాత్ర‌మే కాల‌ర్ ఐడీలో చూపిస్తుంది. అయితే మోసాలు, స్పామ్ నియంత్ర‌ణ‌కు ట్రాయ్ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న నేప‌థ్యంలో ప్రైవేటు టెలికాం సంస్థ‌లు ఇప్ప‌టికే కాల‌ర్ ఐడీ క‌నిపించేలా స‌దుపాయాన్ని అందిస్తున్నాయి.

S

Technology | Published On Mar 25, 2026, 4.46 pm IST

BSNL | బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. అతి త్వ‌ర‌లో CNAP సేవ‌లు..
Advertisement

BSNL | స్మార్ట్ ఫోన్ల‌లో కాల్స్ వ‌చ్చిన‌ప్పుడు అవ‌త‌లి వ్య‌క్తుల పేర్లు తెలియ‌వు. కేవ‌లం ఫోన్ నంబ‌ర్ మాత్ర‌మే కాల‌ర్ ఐడీలో చూపిస్తుంది. అయితే మోసాలు, స్పామ్ నియంత్ర‌ణ‌కు ట్రాయ్ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న నేప‌థ్యంలో ప్రైవేటు టెలికాం సంస్థ‌లు ఇప్ప‌టికే కాల‌ర్ ఐడీ క‌నిపించేలా స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. వీఐ (వొడాఫోన్ ఐడియా), ఎయిర్‌టెల్‌, జియో సంస్థ‌లు కాల‌ర్ ఐడీని తెర‌పై ప్ర‌ద‌ర్శించేలా స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ సేవ త్వ‌ర‌లోనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేర‌కు ఆ సంస్థ CNAP (కాలర్ నేమ్ ప్రెజెంటేషన్) అనే ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ట్రాయ్ ప్ర‌వేశపెట్టిన‌దే..

బీఎస్‌ఎన్‌ఎల్ అతి త్వ‌ర‌లోనే కాలర్ ఐడీ తెలిసేలా ఫీచ‌ర్‌ను త‌న వినియోగ‌దారుల‌కు అందించ‌నుంది. దేశ‌వ్యాప్తంగా CNAP సేవ‌ల‌ను ప్రారంభించాల‌ని బీఎస్‌ఎన్‌ఎల్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. వాస్త‌వానికి CNAP కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్ర‌వేశ‌పెట్టిన ఓ విధానమే. దీని వ‌ల్ల కూడా ఫోన్ కాల్ వ‌చ్చిన‌ప్పుడు తెర‌పై అవ‌త‌లి వ్య‌క్తి పేరు వినియోగ‌దారుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుంది. దీన్ని ప్రైవేటు టెలికాం సంస్థ‌లు వివిధ పేర్ల‌తో త‌మ వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఈటీ టెలికాం తెలిపిన ప్ర‌కారం బీఎస్‌ఎన్‌ఎల్ ప్ర‌స్తుతం CNAP సేవ‌ను ప్రైవేటు టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌ల‌తో అనుసంధానం చేసే ప‌నిలో ఉంద‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో టెలికాం ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ ప్ర‌తినిధి ఇదే విష‌యంపై మాట్లాడుతూ రిల‌య‌న్స్ జియో, భార‌తి ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్‌ను అమ‌లు చేశాయ‌ని, బీఎస్‌ఎన్‌ఎల్ కోసం ప‌రిష్కారం ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చింద‌ని, దీన్ని జోన్ల వారిగా అనుసంధానించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

3-4 నెల‌ల్లో పూర్తి స్థాయిలో అమ‌లు..

పూర్తి స్థాయిలో అనుసంధానం ముగిశాక 3 లేదా 4 నెల‌ల్లోనే బీఎస్‌ఎన్‌ఎల్ లో వినియోగ‌దారుల‌కు CNAP సేవ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆ ప్ర‌తినిధి తెలిపారు. కాగా CNAP కోసం బీఎస్‌ఎన్‌ఎల్ వాడుకుంటున్న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) అభివృద్ధి చేసింద‌ని తెలిపారు. ట్రాయ్ ప్ర‌వేశ‌పెట్టిన CNAP సేవ‌ను 2025 రెండో భాగంలో ద‌శ‌ల‌వారిగా ప్రారంభించారు. టెలికాం శాఖ (DoT) ఈ ఫీచ‌ర్‌ను 4జి, 5జి నెట్‌వ‌ర్క్‌ల‌పై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించింది. ఈ ఫీచ‌ర్ ప్ర‌ధానంగా స్పామ్‌, మోస‌పూరిత కాల్స్‌ను నియంత్ర‌డానికి అందుబాటులోకి వ‌చ్చింది. అయితే ఫీచ‌ర్ ఫోన్ల‌లో మాత్రం ఇది ప‌నిచేయ‌దు. CNAP సేవ‌లో భాగంగా తెలియ‌ని నంబ‌ర్ల నుంచి వ‌చ్చే కాల్స్‌కు కూడా కాల‌ర్ పేరు ద‌ర్శ‌న‌మిస్తుంది. దీనికి అద‌న‌పు రుసుము లేదా ఇంటర్నెట్ అవ‌స‌రం లేదు. ట్రూకాల‌ర్ యాప్ అవ‌స‌రం లేకుండానే ఈ స‌దుపాయం ప‌నిచేస్తుంది. వినియోగ‌దారులు ఫోన్ నంబ‌ర్ తీసుకున్న‌ప్పుడు స‌మ‌ర్పించిన కేవైసీ ప‌త్రాల ఆధారంగా కాల‌ర్ పేరును ఫోన్ తెర‌పై ప్ర‌ద‌ర్శిస్తారు.

వేర్వేరు నెట్ వ‌ర్క్‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు..

ప్ర‌స్తుతం CNAP సేవ‌ను అందించ‌డంలోనూ నెట్‌వ‌ర్క్‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇత‌ర నెట్‌వర్క్‌ల మ‌ధ్య స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదు. ఒకే నెట్‌వ‌ర్క్‌లో ఉన్న కాల‌ర్స్ మ‌ధ్య అయితే ఈ స‌దుపాయం స‌రిగ్గానే ప‌నిచేస్తుంద‌ని గుర్తించారు. అయితే వేర్వేరు నెట్‌వ‌ర్క్‌ల మ‌ధ్య ఈ ఫీచ‌ర్ పూర్తి స్థాయిలో ప‌నిచేసేందుకు గాను ఇంకా సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను టెలికాం సంస్థ‌లు గుర్తించి ప‌రిష్క‌రించే ప‌నిలో ఉన్నాయి. CNAP ఫీచ‌ర్ వ‌ల్ల ఫోన్ వినియోగ‌దారుల‌కు స్పామ్ కాల్స్ నుంచి ర‌క్ష‌ణ ల‌భించ‌డంతోపాటు మోస‌పూరిత కాల్స్ ను నివారించ‌వ‌చ్చు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌డ‌మే కాకుండా, వేర్వేరు నెట్‌వ‌ర్క్‌ల మ‌ధ్య కూడా ఎలాంటి స‌మ‌స్య లేకుండా ప‌నిచేయాల‌ని, అప్పుడే దేశవ్యాప్త ఫోన్ వినియోగ‌దారుల‌కు ఇంకా సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement