Brave Ark | ఈ ట్యాబ్.. పీసీలా కూడా పనిచేస్తుంది.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
Brave Ark | భారత పర్సనల్ కంప్యూటింగ్ రంగంలోకి బ్రేవ్ అనే మరో నూతన స్వదేశీ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ రంగ ప్రవేశం చేసింది. ఈ క్రమంలోనే బ్రేవ్ కంపెనీ ఆర్క్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Feb 8, 2026, 7.20 am IST
Brave Ark | భారత పర్సనల్ కంప్యూటింగ్ రంగంలోకి బ్రేవ్ అనే మరో నూతన స్వదేశీ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ రంగ ప్రవేశం చేసింది. ఈ క్రమంలోనే బ్రేవ్ కంపెనీ ఆర్క్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. నేర్చుకోవడం, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్.. ఇలా ఏదైనా సరే, ఎవరికైనా సరే.. తమ ఆర్క్ ట్యాబ్ పీసీలా కూడా పనిచేస్తుందని బ్రేవ్ కంపెనీ చెబుతోంది. ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయగా, ఈ డివైస్‌ను పీసీలా కూడా వాడుకోవచ్చని తెలియజేసింది. ఈ ట్యాబ్ ఎంతో మంది యూజర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది.
భారీ బ్యాటరీ..
బ్రేవ్ కంపెనీ లాంచ్ చేసిన ఆర్క్ ట్యాబ్ 2 ఇన్ 1 ఆండ్రాయిడ్ డివైస్‌గా పనిచేస్తుంది. ఇందులో 12.95 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 2.8కె రిజల్యూషన్‌తోపాటు 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. కనుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ట్యాబ్‌లో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. అలాగే 14550 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని సైతం ఇందులో అందిస్తున్నారు. దీని వల్ల ఈ ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ట్యాబ్‌ను చార్జింగ్ చేసేందుకు బాక్స్‌తోపాటు చార్జర్‌ను సైతం అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అన్ని పనులకు ఒకే డివైస్..
ఈ ట్యాబ్ యూజర్ల వినియోగాన్ని అందిపుచ్చుకుని వారికి తగిన విధంగా ప్రవర్తిస్తుందని, దీంతో మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. రోజువారి కార్యకలాపాల కోసం ఈ ట్యాబ్ సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది. ఇది అద్భుతమైన కంప్యూటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను సైతం అందిస్తుందని వెల్లడించింది. ప్రొడక్టివిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్రియేటివ్ టాస్క్‌ల కోసం కూడా ఈ ట్యాబ్‌ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఇందులో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇక భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ట్యాబ్‌ను అత్యంత పలుచని డిజైన్‌తో రూపొందించారు. కేవలం 7.6 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది.
ధర ఎంతంటే..?
బ్రేవ్ కంపెనీ ఆర్క్ ట్యాబ్‌కు ఓ స్టైలస్ పెన్‌ను సైతం ఉచితంగా అందిస్తున్నారు. దీనికి 20 రకాలకు పైగా టూల్ బాక్స్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 4096 ప్రెషర్ పాయింట్లను ఇది గుర్తిస్తుంది. ట్యాబ్‌తో ఈ స్టైలస్ పెన్‌ను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్యాబ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే నిరంతరాయంగా 20 గంటల పాటు ఉపయోగించుకోవచ్చని, సాధారణ పనులకు అయితే 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్డీ కార్డును వేసుకుని స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డీటీఎస్ ఆడియో సదుపాయం ఉన్నందున ఆడియో క్వాలిటీగా ఉంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర సదుపాయాలు సైతం ఇందులో ఉన్నాయి. బ్రేవ్ ఆర్క్ ట్యాబ్‌ను గాలాక్టిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియెంట్ ధర రూ.34,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేసే మొదటి 200 మందికి బ్రేవ్ కీబోర్డును ఉచితంగా అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

Fire TV Stick HD | అమెజాన్ కొత్త ఫైర్ టీవీ స్టిక్ హెచ్డీ విడుదల.. అద్భుతమైన ఫీచర్లతో అప్ గ్రేడ్..
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



