Himalayan 750 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?
Himalayan 750 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో మరో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు కంపెనీ రూపొందించిన భారీ మోటార్‌సైకిల్‌గా నిలిచిన ‘హిమాలయన్ 750’ని భారత్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించింది.
Technology | Published On Nov 29, 2026, 9.45 am IST
Himalayan 750 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో మరో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు కంపెనీ రూపొందించిన భారీ మోటార్‌సైకిల్‌గా నిలిచిన ‘హిమాలయన్ 750’ని భారత్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.89 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్‌ను గోవాలోని వాగటర్‌లో జరుగుతున్న మోటోవర్స్‌లో ఆవిష్కరించింది. సాధారణ వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి.
రెండు విడతల్లో బుకింగ్స్..
హిమాలయన్ 750 బుకింగ్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండు దశల్లో ప్రారంభించనుంది. గోవాలో జరుగుతున్న మోటోవర్స్‌కు హాజరైన సందర్శకులకు నవంబర్ 28 నుంచే ముందస్తు బుకింగ్ సదుపాయం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి బుకింగ్స్ మొదలవుతాయి. ఈ బైక్ మూడు వేరియంట్లు, ఐదు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ప్రకటించిన ధరలు ప్రారంభ ఆఫర్‌లో భాగంగా నిర్ణయించినవని కంపెనీ వెల్లడించింది. డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఫీచర్స్ ఇవే..
హిమాలయన్ 750లో సరికొత్త 743 సీసీ, ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. కంపెనీ ఇప్పటికే ఉపయోగిస్తున్న 648 సీసీ ఇంజిన్‌ను మరింత అభివృద్ధి చేసి, సామర్థ్యాన్ని పెంచి ఈ కొత్త ఇంజిన్‌ను రూపొందించింది. ఇది 7,000 ఆర్పీఎం వద్ద 55 హెచ్‌పీ పవర్‌ను, 5,000 ఆర్పీఎం వద్ద 63 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా 3,500 ఆర్పీఎం నుంచే గరిష్ట టార్క్‌లో 90 శాతం అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇంజిన్ ఐడిల్ వేగం 1,300 ఆర్పీఎంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
మూడు వేరియంట్లు.. ఐదు రంగులు
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హిమాలయన్ 750ను మూడు వేరియంట్లలో కంపెనీ బైక్‌ను అందిస్తోంది. బేస్ వేరియంట్‌లో అజ్‌టెక్ గ్రీన్, టెక్టోనిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అల్లాయ్ వీల్స్‌తో పాటు సియట్ క్రాస్‌రాడ్ ఏటీ టైర్లను అమర్చారు. మిడ్ వేరియంట్‌లో వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్, వ్రెడెస్టీన్ సెంటారో ఎక్స్‌ఆర్ టైర్లు ఉంటాయి. టాప్ వేరియంట్‌లో యాంటార్కిటిక్ సిల్వర్ రంగులో మాత్రమే లభిస్తుంది. ఇందులో జీఐవీఐ టాప్ బాక్స్, ప్యానియర్లు, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్‌గార్డ్స్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్ వంటి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో లభించే ఈ అదనపు యాక్సెసరీలను మిగిలిన నాలుగు రంగుల వేరియంట్లకు కూడా విడిగా అమర్చుకునే అవకాశం ఉంది. మూడు వేరియంట్లలోనూ ముందు 19, వెనుక 17 అంగుళాల వీల్స్‌ను ఇస్తోంది.
ఫీచర్ల విషయంలోనూ ప్రత్యేకత
హిమాలయన్ 750ను ఇప్పటివరకు తమ సంస్థ నుంచి వచ్చిన అత్యంత ఫీచర్ రిచ్ మోటార్‌సైకిల్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివర్ణిస్తోంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్‌కు అనుగుణంగా పనిచేసే ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే మరింత మెరుగైన వెలుతురును అందించే కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అమర్చారు. డ్యూయల్ డిస్క్ బ్రేకులు, అడ్జస్టబుల్ షోవా ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఈ బైక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు, కంపెనీ అభివృద్ధి చేస్తున్న 750 సీసీ విభాగానికి చెందిన కాంటినెంటల్ జీటీ 750 గురించి మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్ వివరాలను వెల్లడించలేదు. హిమాలయన్ 750 బుకింగ్స్ ప్రారంభం కావడంతో ఈ కొత్త మోడల్‌పై బైక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
నవంబర్ 29, 2026

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్
నవంబర్ 29, 2026

Bill Gates Warns | ఏఐతో ప్రపంచానికి సైబర్ ముప్పు.. ఆస్పత్రులు, బ్యాంకులపై హ్యాకర్ల గురి! బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే
- ●Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్
- ●Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు
- ●KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం
- ●Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మహేశ్‌కుమార్‌ను కలిసి తుమ్మలూరు రైతులు
- ●Bigg Boss Telugu | బిగ్‌బాస్‌లో వృషకర్మ టీమ్ - శోభితపై నాగార్జున ప్రశ్న ... నాగచైతన్య ఫన్నీ ఆన్సర్

KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే

Sukumar | కోటి రూపాయల ఛాలెంజ్ - ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్

Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం



