త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukumar | కోటి రూపాయ‌ల‌ ఛాలెంజ్ – ఓడిపోయిన డైరెక్ట‌ర్ సుకుమార్‌

డైరెక్ట‌ర్ సుకుమార్‌కు కోటి రూపాయ‌ల ఛాలెంజ్ విసిరారు నిర్మాత అల్లు అర‌వింద్‌. ఈ ఛాలెంజ్‌లో సుకుమార్ ఓడిపోయారు. ఓడిపోయినందుకు అల్లు అర‌వింద్‌కు డ‌బ్బులు ఇచ్చారు. ఇంత‌కీ ఈ ఛాలెంజ్ దేనికోస‌మంటే?

N

Entertainment | Published On Nov 29, 2026, 7.09 pm IST

Sukumar | కోటి రూపాయ‌ల‌ ఛాలెంజ్ – ఓడిపోయిన డైరెక్ట‌ర్ సుకుమార్‌
Advertisement

Sukumar |  టాలీవుడ్ నిర్మాతతో చేసిన ఛాలెంజ్‌లో డైరెక్ట‌ర్ సుకుమార్ ఓడిపోయారు. ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయినందుకు ప్రొడ్యూస‌ర్‌కు డ‌బ్బులు కూడా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సుకుమార్ వెల్ల‌డించాడు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాత్విక వీర‌వ‌ల్లి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఆకాశంలో ఒక తార ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆస్ట్రోనాట్ కావాల‌నే త‌న భార్య క‌ల‌ను నిజం చేసిన భ‌ర్త క‌థ‌తో ఎమోష‌న‌ల్ డ్రామాగా ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాదినేని ఈ సినిమాను తెర‌కెక్కించారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.

క‌న్నీళ్లు పెట్టుకోకుండా...

ఆకాశంలో ఒక తార సినిమాకు సంబంధించి సుకుమార్‌కు అల్లు అర‌వింద్ ఓ స‌వాల్ విసిరారు. సినిమా చూసి క‌న్నీళ్లు పెట్టుకోకుండా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే నేను నీకు కోటి రూపాయ‌లు ఇస్తాను. ఒక‌వేళ క‌న్నీళ్లు పెట్టుకుంటే నువ్వు నాకు ల‌క్ష రూపాయ‌లు ఇవ్వాలి అని సుకుమార్‌తో పందెం కాశారు అల్లు అర‌వింద్‌.

ఓట‌మి....

ఈ ఛాలెంజ్‌లో సుకుమార్ ఓడిపోయారు. అల్లు అర‌వింద్‌కు ల‌క్ష రూపాయ‌లు ఇచ్చారు. నిర్మాత‌ పేరుతో ల‌క్ష రూపాయ‌ల చెక్ రాసిన ఫొటోను సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇంత‌ ఖ‌రీదైన సిఫార్సు ఏంటి సార్ అంటూ స‌ర‌దాగా కామెంట్ జోడించారు.

40 కోట్ల క‌లెక్ష‌న్లు...

ఆకాశంలో ఒక తార సినిమాలో శృతిహాస‌న్‌, రుహానీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాత్విక వీర‌వ‌ల్లి న‌ట‌న‌, కాన్సెప్ట్ బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌స్తున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌ది రోజుల్లో 40 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

 

Advertisement
Advertisement