త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మ‌హేశ్‌కుమార్‌ను క‌లిసి తుమ్మ‌లూరు రైతులు

Thummaluru Land Grabbing Allegations | ఫ్యూచర్ సిటీ (Future City) పరిధిలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (MLA Manohar Reddy) రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూకబ్జా (Land Grabbing) కు పాల్ప‌డుతున్నారని ఆరోపిస్తూ తుమ్మ‌లూరు (Thummaluru) బాధిత రైతులు ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్‌కుమార్‌(Mahesh Kumar)ను క‌లిశారు.

S

Telangana | Published On Nov 29, 2026, 6.17 pm IST

Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మ‌హేశ్‌కుమార్‌ను క‌లిసి తుమ్మ‌లూరు రైతులు
Advertisement

Thummaluru Land Grabbing Allegations |  త్రినేత్ర న్యూస్‌: ఫ్యూచర్ సిటీ (Future City) పరిధిలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (MLA Manohar Reddy) రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూకబ్జా (Land Grabbing) కు పాల్ప‌డుతున్నారని ఆరోపిస్తూ తుమ్మ‌లూరు (Thummaluru) బాధిత రైతులు ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్‌కుమార్‌(Mahesh Kumar)ను క‌లిశారు. బాధిత రైతులు త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించి విన‌తిప‌త్రం అంద‌జేశారు. త‌మ‌కు వార‌సత్వంగా వ‌చ్చిన భూమిని కాజేసే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని వాపోయారు. తుమ్మలూరు రెవెన్యూ ప‌రిధిలో సర్వే నంబర్లు 371, 372, 377లో ఉన్న‌ 51.02 ఎకరాల PT భూముల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మహేష్ కుమార్ హామీ ఇచ్చిన‌ట్లు రైతులు తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన 51.02 ఎకరాల భూములను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, రెవెన్యూ అధికారులపై ప్రభావం చూపుతూ, తప్పుడు నివేదికలు తయారు చేయించి కాజేయాలని ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.

తమ తాత గద్దగూటి ఎల్లయ్య పేరు PT రిజిస్టర్‌తో పాటు పాత రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ, కొందరు రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేస్తూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వల్ల తమ పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో, పేద రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరగడం ఆందోళనకరమన్నారు. ఈ భూ వివాదంపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయి సంస్థలకు ఫిర్యాదులు చేసినట్లు రైతులు వివరించారు. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు స్వయంగా మహేశ్వరం MRO కార్యాలయాన్ని, వివాదాస్పద భూములను సందర్శించి విచారణ చేపట్టిన విషయాన్ని తెలియజేశారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), ప్రధానమంత్రి కార్యాలయం (PMO), రాష్ట్రపతి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)లకు సమర్పించిన ఫిర్యాదులపై స్పందన వచ్చిందని వివరించారు. సంబంధిత అధికారులకు లేఖలు పంపించి, ఈ భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడికి తెలియజేశారు.

ప్లాట్లు కొని మోస‌పోవ‌ద్దు

తుమ్మలూరు గ్రామంలోని సర్వే నంబర్లు 371, 372, 377లో ఉన్న వివాదాస్పద PT భూములకు సంబంధించి JB INFRA, BHUVAN INFRA పేర్లతో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని బాధిత రైతులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు, రెవెన్యూ రికార్డులపై వివాదం కొనసాగుతున్నందున, పూర్తిస్థాయి విచారణ జరిగి సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్లాట్ల కొనుగోలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాధిత రైతులు గద్దగూటి శ్రీరాములు, మహేందర్, హరికృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement