త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ‌.. దీక్ష‌తో స్వ‌రాష్ట్రాన్ని సాధించుకున్నాం

KTR | ఎవ‌డి భిక్ష కాదు తెలంగాణ‌.. దీక్ష‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యాచించి కాదు శాసించి తెలంగాణ‌ను తెచ్చాడు కేసీఆర్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 29, 2026, 6.28 pm IST

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ‌.. దీక్ష‌తో స్వ‌రాష్ట్రాన్ని సాధించుకున్నాం
Advertisement

యాచించి కాదు.. శాసించి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్
ఢిల్లీ మెడ‌లు వంచితే స్వ‌రాష్ట్రం వ‌చ్చింది
దీక్షా దివ‌స్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : ఎవ‌డి భిక్ష కాదు తెలంగాణ‌.. దీక్ష‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యాచించి కాదు శాసించి తెలంగాణ‌ను తెచ్చాడు కేసీఆర్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీక్షా దివ‌స్ సంద‌ర్భంగా అలుగునూరు చౌర‌స్తాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక్క మాట అడుగుతున్నా.. మీ కోసం మీరు క‌ల‌గ‌ని ఆ క‌ల‌ను నిజం చేసుకుంటే విజేత అంటారు.. నీ మ‌ట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, నిన్ను న‌మ్ముకున్న వారి కోసం.. క‌ల‌గ‌ని ఆ క‌ల సాకారం కావ‌డానికి చావుకు కూడా సిద్ధ‌ప‌డితే.. మ‌హాత్ముడు, మార్టిన్ లూథ‌ర్ కింగ్, నెల్స‌న్ మండేలా అంటారు.. తెలంగాణ‌లో అయితే కేసీఆర్ అంటారు.. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్లు ఎగ‌రేట‌ట్లు డైలాగులు కొట్టొచ్చు. ఎటు ప‌డితే అటు ఎగ‌రొచ్చు.. డ్రామాలాడొచ్చు. కేసీఆర్ తెలంగాణ జాతిని ఒక్క‌టి చేశాడు. యాచించి కాదు శాసించి తెలంగాణ‌ను తెచ్చాడు కేసీఆర్. ఎవ‌డి భిక్ష కాదు తెలంగాణ‌.. దీక్ష‌తో తెలంగాణ‌ను సాధించుకున్నాం. ఢిల్లీ మెడ‌లు వంచితే స్వ‌రాష్ట్రం వ‌చ్చింది. డిసెంబ‌ర్ 9 ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత 12 రోజుల్లోనే స‌మైక్యాంధ్రులు ఒక్క‌ట‌య్యారు. కాంగ్రెస్‌ను బెదిరిస్తే వాప‌స్ తీసుకున్నారు ప్ర‌క‌ట‌న‌. ఆ త‌ర్వాత జేఏసీలు, రాజీనామాలు, స‌క‌ల‌జ‌నుల స‌మ్మె కొన‌సాగాయి. ప్ర‌తి ఊరు ఉద్య‌మ కేంద్రంగా మారింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ కురుక్షేత్రంలో ర‌థం న‌డిపించింది.. ర‌ణం చేసింది కేసీఆర్

మ‌రి తెలంగాణ మ‌ట్టిలో పోరాటం ఉంది.. నేల‌లోనే ధిక్కారం ఉంది.. తెగించి కొట్లాడే తెగువ ఉంది క‌దా మ‌రి 60 ఏండ్లు ఎందుకు ప‌రాయి పాల‌న‌లో మ‌గ్గినం. ఎందుకంటే నాయ‌కులే బానిస‌లు. స‌మైక్యాంధ్ర సంచులు మోసే స‌న్నాసుల వ‌ల్లే తెలంగాణ ఆల‌స్య‌మైంది. క‌లిసొచ్చే కాలానికి న‌డిసొచ్చే కొడుకు వస్త‌డు అన్న‌ట్టు.. కేసీఆర్ ఎప్పుడైతే గులాబీ జెండా ఎగ‌రేసిండో.. ద‌మ్మున్నోడు ద‌ళ‌ప‌తి అయిత‌డో.. ప‌ద్నాలుగేళ్ల‌లో తెలంగాణ సాధించి చూపించిండు. మొండి ధైర్యంతో పార్టీ పెట్టిన‌ప్పుడు ఎవ‌రూ లేరు. ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, అవ‌మానాలు జ‌రిగినా.. ప‌ద్మ‌వ్యూహాల్లో అభిమాన్యుడిలా వీగిపోకుండా.. కృష్ణుడిలా ఊహ‌కు అంద‌ని వ్యూహాలు రూపొందించారు కేసీఆర్. అర్జునుడిలా ప‌ద్మ‌వ్యూహం చేధించాడు. తెలంగాణ కురుక్షేత్రంలో ర‌థం న‌డిపించింది.. ర‌ణం చేసింది కేసీఆర్. దేశంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌ను ఒప్పించి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాడు. గులాబీ జెండా ఎగ‌ర‌క‌పోతే తెలంగాణ లేదు.. తెల‌గాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ లేదు. 60 ఏండ్లు కాంగ్రెస్ పెట్టిన చిత్ర‌హింస‌లా కొలిమిలో తెలంగాణ త‌ల్ల‌డిల్లింది అని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement