KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే
KTR | తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే.. ఎన్ని యుగాలైనా కావచ్చు, సత్యం ఇదే.. తెలంగాణ కథలో కచ్చితంగా విలన్ కాంగ్రెస్ పార్టీయే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ కథలో విలన్ ముమ్మాటికీ కాంగ్రెస్సే.. ఎన్ని యుగాలైనా కావచ్చు, సత్యం ఇదే.. తెలంగాణ కథలో కచ్చితంగా విలన్ కాంగ్రెస్ పార్టీయే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేను చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు! "సోనియమ్మ బలిదేవత, వందల మందిని చంపిన దేవత" అని రేవంత్ రెడ్డే చెప్పిండు. మన బిడ్డలను బలి తీసుకున్న దయ్యం, ఇయ్యాల వేదికలెక్కి ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. చంపినోడే సంతాప సభలు పెట్టినట్టు, అమరుల ఆత్మలు క్షోభించే విధంగా ఇయ్యాల వాళ్ళ వ్యవహారం ఉన్నది. జలియన్ వాలాబాగ్‌లో చచ్చిపోయిన భారతీయుల గురించి బ్రిటిషోడు సంతాప సభ పెడితే ఎంత దౌర్భాగ్యం ఉంటదో, ఎంత దరిద్రంగా ఉంటదో. తెలంగాణ ఉద్యమ అమరవీరుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే కూడా అంతే దరిద్రంగా ఉంటది అని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎవడన్నా ఇంత ధైర్యం చేస్తుండెనా?
ఇప్పుడున్న పాలకులు తెలంగాణ సోయి లేని పాలకులు. కాళేశ్వరం మీద కక్ష కట్టి దాడికి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ సోయి ఉన్నోడు ఎవడన్నా ఈ విధంగా దాడికి దిగుతాడా? కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరానికి పగబడతావా? కేసీఆర్ మీద కోపంతో పాలమూరు మీద పగబడతావా? ఇదేనా తెలంగాణ సోయి? కేసీఆర్ మీద కోపంతో నీళ్లన్నీ కిందికి విడిచిపెట్టిండు. గోదావరి నీళ్లు ఆంధ్రాకు విడిచిపెట్టిండు. కృష్ణా నీళ్లు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం దాకా తీసుకుపోయిండు. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పోయినాయి గానీ, 70 కిలోమీటర్ల లోపల ఉండే పాలమూరుకు మాత్రం నీళ్లు రాలేదు. పోతిరెడ్డిపాడు శ్రీశైలం నుంచి నీళ్లు గుంజుకుపోతుంటే అప్పుడూ నోరు మూసుకున్నది కాంగ్రెస్. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఇయ్యాల కూడా నోరు మూసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చంద్రబాబుకు చెంచాల్లాగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎవడన్నా ఇంత ధైర్యం చేస్తుండెనా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ధైర్యం చేస్తుండెనా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆర్.డి.ఎస్. జోలికి వస్తే సహించేది లేదని గర్జించిన నాయకుడు. "ఎంత ధైర్యం రా నా కొడకా! నీ సుంకేసుల బ్యారేజీను వెయ్యి బాంబులు పెట్టి లేపుతా!" అని గర్జించిన నాయకుడు కేసీఆర్. "నీళ్లు ఎత్తవయ్యా, కన్నెపల్లి కాడ మోటార్లు ఆన్ చేయవయ్యా, మా కరీంనగర్‌కు నీళ్లు వస్తాయి" అని అడిగితే అడ్డమైన అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు అడిగితే "బెల్టు ట్రీట్‌మెంట్ ఇస్తా, చర్లపల్లి జైల్లో పెడతా" అంటూ రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ పేరు కూడా లేదు ఆమె ఆత్మకథల!
మొన్న సోనియమ్మ ఏదో పుస్తకం రాసిందని నేను పేపర్లలో చూసినా. సిక్కుల ఊచకోత, ఎమర్జెన్సీ మీద కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసినట్లే తెలంగాణ ఉద్యమంపై కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుందని ఆశించాం. తెలంగాణ ఉద్యమంలో తాను చంపిన వందల మంది పిల్లల గురించి సోనియమ్మ ఒక్క మాటైనా చెప్తదేమో అనుకున్నాం. "తప్పయింది, నేను చేసింది తప్పు" అని సోనియమ్మ చెప్తదేమో అనుకున్నాం. కానీ విచారం ప్రస్తావనే లేదు, తెలంగాణ పేరు కూడా లేదు ఆమె ఆత్మకథల! గట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. మన కథ మనం చెప్పుకోకపోతే, మన కథ మనం తెలుసుకోకపోతే మన చరిత్రను ఇతరులు వక్రీకరించే ప్రమాదం ఉన్నది. మన తెలంగాణ జాతి కథ, మన తెలంగాణ విముక్తి కథ మనమే చెప్పుకోవాలి. సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్టకథలే నిజమనుకునే భ్రమపడే ప్రమాదం ఉన్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | దేవాదుల మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్, జనగామ జిల్లాలను ఎండబెట్టారు
నవంబర్ 29, 2026

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం
నవంబర్ 29, 2026

Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మహేశ్‌కుమార్‌ను కలిసి తుమ్మలూరు రైతులు
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం
- ●Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మహేశ్‌కుమార్‌ను కలిసి తుమ్మలూరు రైతులు
- ●Bigg Boss Telugu | బిగ్‌బాస్‌లో వృషకర్మ టీమ్ - శోభితపై నాగార్జున ప్రశ్న ... నాగచైతన్య ఫన్నీ ఆన్సర్
- ●KTR | జై తెలంగాణ అని నినదిస్తే.. బానిసల గుండెలు అదరాలి
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌తో సోనియా, రాహుల్, మమత కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో సానియా మీర్జా భేటీ

KTR | ఎవడి భిక్ష కాదు తెలంగాణ.. దీక్షతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం

Thummaluru Land Grabbing Allegations | తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. మహేశ్‌కుమార్‌ను కలిసి తుమ్మలూరు రైతులు

Bigg Boss Telugu | బిగ్‌బాస్‌లో వృషకర్మ టీమ్ - శోభితపై నాగార్జున ప్రశ్న ... నాగచైతన్య ఫన్నీ ఆన్సర్

KTR | జై తెలంగాణ అని నినదిస్తే.. బానిసల గుండెలు అదరాలి



