త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియ‌నున్న దరఖాస్తు గడువు!

BOB Recruitment | ప్ర‌భుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (BOB) వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (WMS) విభాగంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 837 ఖాళీల నియామ‌క ప్ర‌క్రియ (BOB Recruitment) చేప‌ట్టింది. ఈ నెల 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

G

National | Published On Nov 22, 2026, 7.29 am IST

BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియ‌నున్న దరఖాస్తు గడువు!
Advertisement

BOB Recruitment | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌భుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (BOB) వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (WMS) విభాగంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 837 ఖాళీల నియామ‌క ప్ర‌క్రియ (BOB Recruitment) చేప‌ట్టింది. ఈ నెల 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అంటే మ‌రో రెండు రోజుల్లో గ‌డువు ముగియ‌నుంది. బ్యాంకింగ్ రంగంలో కొన‌సాగాల‌నే ఆస‌క్తి ఉన్న‌ వారు ఇంకా ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఆన్‌లైన్‌లో (https://bankappsweb.bankofbaroda.bank.in/BobRecruitment/) ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఇందులో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, టెరిటరీ హెడ్, గ్రూప్ హెడ్ తదితర పోస్టులు ఉన్నాయి. సంబంధిత విద్యార్హతలతో పాటు 3 నుంచి 12 ఏండ్ల‌ పని అనుభవం ఉన్నవారు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. అయితే ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తున్న‌ది.

మొత్తం ఖాళీలు: 837
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్)- 791
టెరిటరీ హెడ్- 35
గ్రూప్ హెడ్- 8
ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్ మేనేజర్- 2
హెడ్ ఇన్వెస్ట్‌మెంట్- 1

అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి మేనేజ్‌మెంట్‌లో పీజీ, డిప్లొమా, ఎంబీఏ, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ (CFP), చార్ట‌ర్డ్ ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్ (CFA) పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని పోస్టుల‌కు ఎన్ఐఎస్ఎం (NISM), ఐఆర్‌డీఏఐ (IRDAI) ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి. సంబంధిత రంగంలో 3 నుంచి 12 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలి. 2026 న‌వంబ‌ర్ 1 నాటికి 50 ఏండ్ల‌కు మించ‌కూడదు.

ఎంపిక ప్రక్రియ
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా. అవసరాన్ని బట్టి ఆన్‌లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌లు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు రూ.175.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 24,
వెబ్‌సైట్‌: https://bankofbaroda.bank.in/career/current-opportunities

Advertisement
Advertisement