Electric Scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా..? టాప్ మోడల్స్ ఇవిగో..!
Electric Scooters | భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కంపెనీలతో పాటు సంప్రదాయ ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వినియోగదారులకు ఎన్నో మోడల్స్ అందుబాటులోకి రావడంతో సరైన వాహనం ఎంచుకోవడం కాస్త కష్టంగా మారింది.
Technology | Published On Apr 4, 2026, 10.02 am IST
Electric Scooters | భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కంపెనీలతో పాటు సంప్రదాయ ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వినియోగదారులకు ఎన్నో మోడల్స్ అందుబాటులోకి రావడంతో సరైన వాహనం ఎంచుకోవడం కాస్త కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ బ్రాండ్ల నుంచి అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా ఇలా ఉంది. ఈ మోడల్స్ ఈమధ్య కాలంలో ఎంతో పేరుగాంచాయి. వినియోగదారుల ఆదరణను చూరగొన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
TVS iQube..
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS iQube ఒకటి. TVS Motor Company బ్రాండ్ విశ్వసనీయత దీనికి బలంగా నిలుస్తోంది. iQube, iQube S, iQube ST అనే మూడు వేరియంట్లలో ఇది లభిస్తోంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 94,999 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 1.61 లక్షల వరకు ఉంది. బ్యాటరీ ఎంపికపై ఆధారపడి 94 కిమీ నుంచి 212 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. గరిష్ఠంగా 5.3 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది.
Ather Rizta..
కుటుంబ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ స్కూటర్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. సౌకర్యం, వినియోగ సౌలభ్యం, ఆధునిక ఫీచర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. గరిష్ఠంగా 123 కిమీ నుంచి 159 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు ఉంది.
Bajaj Chetak EV..
పూర్తిగా మెటల్ బాడీతో రూపొందించబడిన ఈ స్కూటర్ బలమైన నిర్మాణం, నాణ్యతతో ప్రత్యేకంగా నిలుస్తోంది. Bajaj Auto తయారీదారుల నుంచి వచ్చిన ఈ వాహనం మార్కెట్లో అత్యంత మెరుగైన ఫినిష్ కలిగిన స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. C2501, C3001, C35 సిరీస్‌లలో అందుబాటులో ఉంది. రేంజ్ 113 నుంచి 151 కిమీ మధ్య ఉంటుంది. ధర రూ. 89,500 నుంచి ప్రారంభమై రూ. 1.22 లక్షల వరకు ఉంది.
Hero Vida..
Hero MotoCorp నుంచి వచ్చిన Vida ఎలక్ట్రిక్ స్కూటర్లు V2, VX2 సిరీస్‌లలో అందుబాటులో ఉన్నాయి. ధర పరంగా కూడా అందుబాటులో ఉండటంతో పాటు మంచి ఫీచర్లు కలిగి ఉన్నాయి. పోర్టబుల్ చార్జింగ్ సదుపాయం వీటిలో ప్రత్యేకత. VX2 GO వేరియంట్ ధర రూ. 73,850 నుంచి ప్రారంభమై V2 Pro వేరియంట్ రూ. 1.40 లక్షల వరకు ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 92 నుంచి 165 కిమీ వరకు ప్రయాణించవచ్చు.
Suzuki e Access..
భారత మార్కెట్లోకి తాజాగా వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. 3.072 kWh బ్యాటరీతో ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 95 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు సమయంలో ధర, రేంజ్, బ్రాండ్ విశ్వసనీయత, ఫీచర్లు వంటి అంశాలను పరిశీలించడం అవసరం. వినియోగ అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకుంటే దీర్ఘకాలంలో మంచి ప్రయోజనం పొందవచ్చు.
సంబంధిత వార్తలు

AJA Consulting Services | ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సలిస్టింగ్ సర్వీసెస్
మే 20, 2026

PM Modi Convoy | రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
మే 14, 2026

PM Modi Convoy | తొలిసారి.. రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రధాని ప్రయాణం.. VIDEO
మే 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



