ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
ASUS VM240 AiO | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్ లో తన నూతన ప్రొడక్ట్స్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. అసుస్ వీఎం240 ఏఐవో పేరిట ఆలిన్ వన్ డెస్క్‌టాప్‌తోపాటు పలు కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది.
Technology | Published On Aug 21, 2026, 2.33 pm IST
ASUS VM240 AiO | కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ అసుస్ భారత్ లో తన నూతన ప్రొడక్ట్స్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. అసుస్ వీఎం240 ఏఐవో పేరిట ఆలిన్ వన్ డెస్క్‌టాప్‌తోపాటు పలు కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. అసుస్ జెల్లీ75 కీబోర్డు కేడీ201, అసుస్ వైర్‌లెస్ మౌస్ ఎండీ105, అసుస్ మార్ష్‌మలో కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో సీడబ్ల్యూ200, ఆర్‌వోజీ హెచ్‌డీఎంఐ కేబుల్ ఎల్‌హెచ్ఆర్60లను సంస్థ రిలీజ్ చేసింది. అసుస్ వీఎం240 ఏఐవోలో 24 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. దీన్ని అవసరానికి అనుగుణంగా ఫోల్డ్ చేయవచ్చు. 512జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో ఇచ్చారు. ఫుల్ హెచ్‌డీ వెబ్ క్యామ్ ఉంది. దీనికి ఫిజికల్ ప్రైవసీ షటర్‌ను ఇచ్చారు.
ధర ఎంతంటే..
అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీలో ఏఎండీ రైజెన్ 5 40 ప్రాసెసర్‌ను అందించారు. 2వాట్ స్పీకర్లు, డిరాక్ ఆడియో, ఏఐ ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లను ఇందులో ఇచ్చారు. అలాగే పని, చదువు, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ వంటి భిన్న అవసరాలకు అనుగుణంగా ఈ పీసీ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్‌టాప్ ప్రారంభ ధర రూ.66,990గా ఉంది. హై ఎండ్ వేరియెంట్లను సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ పీసీలు అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతోపాటు అసుస్ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
ఇతర ఉత్పత్తుల వివరాలు..
అసుస్ లాంచ్ చేసిన జెల్లీ75 కీబోర్డు కేడీ201 ధర రూ.8,999 ఉండగా, దీన్ని యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జ్ చేసుకుని ఉపయోగించవచ్చు. ఒకేసారి ఐదు డివైస్‌లకు ఇది కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్, వైర్ రెండింటితోనూ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక అసుస్ వైర్‌లెస్ మౌస్ ఎండీ105 కూడా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఒకేసారి 3 డివైస్‌లను కనెక్ట్ చేయవచ్చు. దీని ధర రూ.1799గా ఉంది. అలాగే అసుస్ మార్ష్‌మలో కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో సీడబ్ల్యూ200 డివైస్‌లు కూడా పలు భిన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్‌ను ఇస్తాయి. దీని కాంబో ధర రూ.4,199గా ఉంది. అలాగే ఆర్‌వోజీ హెచ్‌డీఎంఐ కేబుల్ ఎల్‌హెచ్ఆర్ గరిష్టంగా 48జీబీపీఎస్ బ్యాండ్ విడ్త్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. 8కె డిస్‌ప్లేలో 60 హెడ్జ్, 4కె డిస్‌ప్లే 144 హెడ్జ్ రిఫ్రెష్‌ను అందిస్తుంది. పీసీలు, పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ డివైస్‌లకు దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఈ కేబుల్ ధర రూ.999గా ఉంది.
సంబంధిత వార్తలు

ASUS Vivobook | అసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు.. ధరలు ఎంతంటే..?
సెప్టెంబర్ 17, 2026

ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్‌బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
ఆగస్టు 6, 2026

ASUS AiO VM441 | ఏఐ పవర్‌తో అసుస్ కొత్త ఏఐఓ పీసీ.. తొలి స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ ఆలిన్ వన్ డెస్క్‌టాప్..
మే 25, 2026
తాజావార్తలు
- ●CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్
- ●Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

CP Sumathi | నకిలీ డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్.. ముఠా అరెస్ట్

Rahul Gandhi Female Cop Scuffle Allegation | మహిళా పోలీస్‌ను అసభ్యంగా తాకిన రాహుల్ గాంధీ? : వీడియో వైరల్

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్



