Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
Harish Rao | రాష్ట్రంలో బీర్ల( Beers ) ఉత్పత్తిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం( Srisailam ) నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేను ఎక్కడా చెప్పలేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు( Dindi Project )లోకి ఏదుల( Yedula ) నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్( Srisailam Back Water ) నుంచి నీటిని తీసుకుంటే తెలంగాణకు ప్రయోజనం అని మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో బీర్ల( Beers ) ఉత్పత్తిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం( Srisailam ) నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేను ఎక్కడా చెప్పలేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు( Dindi Project )లోకి ఏదుల( Yedula ) నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్( Srisailam Back Water ) నుంచి నీటిని తీసుకుంటే తెలంగాణకు ప్రయోజనం అని మాత్రమే చెప్పాను అని వివరణ ఇచ్చారు.
బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు ఎల్‌నినోను, మద్యం అమ్మకాలను ముడిపెట్టి రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉంది అని జూపల్లి మండిపడ్డారు. హరీశ్‌రావు గారూ.. ట్వీట్ చేసే ముందు వాస్తవం తెలుసుకునే ఓపిక కూడా ఉండాలి. ఒక పత్రికలో పొరపాటుగా ప్రచురితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని మీరు చేసిన ట్వీట్ మీ తొందరపాటుకు నిదర్శనం అని చెప్పారు.
మీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2014-15లో తెలంగాణలో మద్యం అమ్మకాల విలువ రూ. 8,846 కోట్లు. 2022-23 నాటికి అది రూ. 35,145 కోట్లకు చేరింది. అంటే మీ ప్రభుత్వ హయాంలో 2014-15 నుంచి 2022-23 వరకు మద్యం అమ్మకాలు రూ. 26,299 కోట్లు పెరిగి.. ఏకంగా 297 శాతం వృద్ధి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24లో రూ. 36,493 కోట్లు ఉన్న అమ్మకాల విలువ 2025-26 నాటికి రూ. 40,209 కోట్లకు చేరింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పెరుగుదల సుమారు 10 శాతం మాత్రమే అని జూపల్లి తెలిపారు.
మద్యం అమ్మకాలపై మాట్లాడే ముందు మీ పదేళ్ల పాలనలో పెరిగిన మద్యం అమ్మకాలపై సమాధానం చెప్పండి. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను పెంచింది మీ ప్రభుత్వమే. మద్యం ఆదాయంపై మాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శించడం సరికాదు. మద్యం విక్రయాలతో ప్రజలను తాగుడుకు బానిసల్ని చేసి ఖజానా నింపుకుంది మీరా? మేమా? నేను లెక్కలతో సహా చెబుతున్నాను. దీనికి ఏం సమాధానం చెప్పుతారు హరీశ్ రావు గారు అని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన
- ●Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!
- ●YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్

Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్






