DGP CV Anand | రోడ్డు ప్రమాదాల కట్టడికి 7 జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ.. డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు తెలంగాణలోని ఏడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అధిక ప్రమాదాలు నమోదవుతున్న 100 జిల్లాల్లో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలను ఎంపిక చేశారు.
DGP CV Anand | రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు తెలంగాణలోని ఏడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అధిక ప్రమాదాలు నమోదవుతున్న 100 జిల్లాల్లో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలను ఎంపిక చేశారు. ఈ అంశంపై డీజీపీ సీవీ ఆనంద్, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సేఫ్‌లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
48 ప్రమాద కారిడార్లు.. 230 బ్లాక్‌స్పాట్లు
2024, 2025 ఈ-డార్ గణాంకాల ఆధారంగా ఏడు జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదైన 230 ప్రాధాన్య-1 ప్రాంతాలు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కీలక కారిడార్లు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 98 ప్రాధాన్య ప్రమాద ప్రాంతాలు, 99 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 66 పాదచారుల ప్రమాద ప్రాంతాలు ఉన్నట్లు కార్యాచరణ ప్రణాళికలో వెల్లడైంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, సమయాలు, రహదారి నిర్మాణం, ఇంజినీరింగ్ లోపాలు, ప్రమాదాలకు దారితీస్తున్న ఇతర కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించి జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని డీజీపీ సూచించారు.
‘4ఈ’ విధానంతో కట్టడి..
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ (4ఈ) విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రమాదాలకు కారణమయ్యే రహదారి లోపాలను సరిదిద్దడంతోపాటు.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.75 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని, తెలంగాణలో ఏటా 7వేల మందికిపైగా మరణిస్తున్నారని డీజీపీ తెలిపారు. రోడ్డు ప్రమాద మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ బ్యూరో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, త్వరలో జీవో జారీ కానుందని వెల్లడించారు.
ప్రతి ప్రమాదానికీ ఈ-డార్ నమోదు
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఎలక్ట్రానిక్ డిజిటల్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈ-డార్) నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ప్రమాదాలు, క్షతగాత్రుల వివరాలతోపాటు ప్రమాద స్థలాల జియో ట్యాగ్ ఫొటోలను మార్గదర్శక్ పోర్టల్ డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని తెలిపారు. డేటా విశ్లేషణతో ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టవచ్చన్నారు. నవంబర్ 3న చెన్నైలో జరిగే సమావేశంలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు, రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాల సంఖ్య, ముఖ్యంగా మరణాలను గణనీయంగా తగ్గించాలని డీజీపీ ఆదేశించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు
- ●Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
- ●TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన
- ●Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
- ●Janhvi Kapoor | జాన్వీ కపూర్ హిడెన్ టాలెంట్..! సోషల్ మీడియాలో ట్రోల్స్..!
- ●YIIRS | ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

Harish Rao | హరీశ్‌రావు గారూ.. శ్రీశైలం నీటిని బీర్ల ఉత్పత్తికి వినియోగిస్తామని నేనేక్కడా చెప్పలేదు

Erravalli | ఎర్రవల్లిలో అమరుల కాలనీ.. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

TGSRTC Dasara Special Buses | దసరాకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త: 7 వేల స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్



