త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asus PCs | అసుస్ నుంచి చ‌వ‌క ధ‌ర‌ల‌కే డెస్క్ టాప్‌, ఆలిన్ వ‌న్ పీసీలు

Asus PCs | టెక్‌ సంస్థ అసుస్ భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం కొత్త‌ డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ (ఏఐవో) పీసీలను లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో వి501 డెస్క్‌టాప్ లైనప్‌తో పాటు ఏఐవో వి400 సిరీస్ కూడా ఉన్నాయి. ఈ పరిధిలో వి501ఎంవీ మినీ టవర్, వి501ఎస్‌వీ స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ డెస్క్‌టాప్ మోడళ్లతో పాటు ఏఐవో వి400 సిరీస్‌లో వి440, వి470 మోడళ్లు ఉన్నాయి.

S

Technology | Published On Mar 7, 2026, 2.58 pm IST

Asus PCs | అసుస్ నుంచి చ‌వ‌క ధ‌ర‌ల‌కే డెస్క్ టాప్‌, ఆలిన్ వ‌న్ పీసీలు
Advertisement

Asus PCs | టెక్‌ సంస్థ అసుస్ భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం కొత్త‌ డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆల్ ఇన్ వన్ (ఏఐవో) పీసీలను లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో వి501 డెస్క్‌టాప్ లైనప్‌తో పాటు ఏఐవో వి400 సిరీస్ కూడా ఉన్నాయి. ఈ పరిధిలో వి501ఎంవీ మినీ టవర్, వి501ఎస్‌వీ స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ డెస్క్‌టాప్ మోడళ్లతో పాటు ఏఐవో వి400 సిరీస్‌లో వి440, వి470 మోడళ్లు ఉన్నాయి. అసుస్ వి501 డెస్క్‌టాప్ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉన్నాయి. వాటిలో వి501ఎంవీ మినీ టవర్ 15 లీటర్ల చాసిస్‌తో వస్తుంది. అలాగే వి501ఎస్‌వీ స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ మోడల్ 9 లీటర్ల చాసిస్‌తో రూపొందించబడింది. ఈ రెండు డెస్క్‌టాప్‌లు ఇంటెల్ కోర్ 7 240హెచ్‌ ప్రాసెసర్లతో పనిచేస్తాయి. 64జీబీ వరకు పెంచుకునేలా డీడీఆర్‌5 ర్యామ్‌కి స‌పోర్ట్‌ను ఇస్తాయి. ఈ సిస్టమ్‌లలో ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్టోరేజ్‌ని భవిష్యత్తులో పెంచుకునే అవకాశం కూడా కల్పించారు.

త‌క్కువ శ‌బ్దం, ప్ర‌త్యేక థ‌ర్మ‌ల్ డిజైన్‌..

వి501 సిరీస్‌లో కాపర్ హీట్ పైప్స్‌తో కూడిన ప్రత్యేక థర్మల్ డిజైన్ ఉంది. పూర్తి లోడ్‌లో పనిచేసేటప్పుడు కూడా ఈ సిస్టమ్‌లు కేవలం 38 డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్దం ఉత్పత్తి చేస్తాయి. అదనంగా దీర్ఘకాల వినియోగంలో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 80+ బ్రాంజ్ సర్టిఫైడ్ పవర్ సప్లైని ఇందులో ఉపయోగించారు. అసుస్ ఏఐవో వి400 సిరీస్‌లో వి440, వి470 మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లు ఆల్ ఇన్ వన్ డిజైన్‌తో వస్తాయి. అంటే కంప్యూటింగ్ హార్డ్‌వేర్ మొత్తం డిస్‌ప్లేలోనే ఉంటుంది. ఈ సిస్టమ్‌లు ఇంటెల్ కోర్‌ 3 ప్రాసెసర్లతో పనిచేస్తాయి. 8జీబీ వరకు డీడీఆర్‌5 ర్యామ్‌తో పాటు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌ను అందిస్తున్నాయి. అలాగే హెచ్‌డీఎంఐ ఇన్‌, హెచ్‌డీఎంఐ అవుట్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి. దీంతో ఇవి డెస్క్‌టాప్ పీసీగా పనిచేయడమే కాకుండా ఇతర పరికరాలను కనెక్ట్ చేసి బాహ్య మానిటర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

ధ‌ర వివ‌రాలు..

ధరలు, అందుబాటు విషయానికి వస్తే ఈ అన్ని మోడళ్లు అసుస్ ఇ-షాప్‌, అసుస్‌ ప్రత్యేక స్టోర్లు, క్రోమా (ఏఐవో మోడళ్లు), అధికారిక రిటైల్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ల‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అసుస్ వి501 డెస్క్‌టాప్ (వి501ఎంవి) ధర రూ.42,990గా ఉంది. ఇది మార్చి 16 నుంచి అసుస్ ఇ-షాప్‌లో అందుబాటులోకి రానుంది. ఇతర స్టోర్‌ల‌లో మార్చి 25 నుంచి లభ్యం అవుతుంది. అసుస్ వి501 డెస్క్‌టాప్ (వి501ఎస్‌వి) ధర రూ.42,990గా ఉంది. ఇది ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. అసుస్ ఏఐవో వి470 ధర రూ.71,990గా ఉంది. ఇది ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, కోర్ 5, కోర్‌ 7 వేరియంట్లు ఏప్రిల్ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి. అసుస్ ఏఐవో వి440 ధర రూ.67,990గా ఉంది. ఇది ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఇక వినియోగదారుల కోసం ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. వి501 డెస్క్‌టాప్‌లకు నెలకు రూ.3,583 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. అలాగే వి470 ఏఐవో కోసం ఈఎంఐ నెలకు రూ.4,799 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా అసుస్‌ అధికారిక రిటైల్ స్టోర్లలో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ కొనుగోళ్లపై రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్ ను కూడా అందిస్తున్నారు.

Advertisement
Advertisement