త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asus | గేమింగ్‌, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ ప‌నుల‌కు ప్ర‌త్యేకం..

S

Technology | Published On Jun 23, 2026, 4.53 pm IST

Asus | గేమింగ్‌, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ ప‌నుల‌కు ప్ర‌త్యేకం..
Advertisement

Asus | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ భారత్‌లో త‌న నూత‌న గేమింగ్‌, క్రియేట‌ర్ ట్యాప్‌టాప్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వోజీ జెఫైర‌స్ డ్యుయో, జెఫైర‌స్ జి14, జి16 సిరీస్‌, టీయూఎఫ్ గేమింగ్ ఎ14, ప్రో ఆర్ట్ పీజ‌డ్‌14ల‌తోపాటు స్ట్రిక్స్‌, స్కార్ మోడ‌ల్ ల్యాప్ టాప్‌ల‌ను ఇందులో భాగంగా సంస్థ రిలీజ్ చేసింది. ఈ ల్యాప్ టాప్‌లు ఇంటెల్ కోర్ అల్ట్రా, ఏఎండీ రైజెన్ ఏఐ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ సిరీస్ ప్రాసెస‌ర్ వేరియెంట్ల‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ప‌లు ఎంపిక చేసిన మోడ‌ల్స్‌లో ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 50 సిరీస్ గ్రాఫిక్ కార్డుల‌ను కూడా ఇచ్చారు. వినియోగ‌దారులు ఎంచుకున్న కాన్ఫిగ‌రేష‌న్‌లో ల్యాప్ టాప్‌ను అందిస్తారు. ఇవి ఏఐ ప‌నుల కోసం గ‌రిష్టంగా 80 టాప్స్ స్పీడ్ ను అందిస్తాయి. అందువ‌ల్ల ఏఐ సంబంధిత ప‌నుల‌ను వీటిల్లో వేగంగా పూర్తి చేయ‌వ‌చ్చు.

ఆర్‌వోజీ, టీయూఎఫ్‌, ప్రో ఆర్ట్ పీజ‌డ్ సిరీస్‌ల‌లో..

ఆర్‌వోజీ సిరీస్‌లో 16 ఇంచుల 3కె ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హై ఎండ్ వేరియెంట్‌గా ల‌భిస్తుంది. ఇందులో ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5090 జీపీయూ ల‌భిస్తుంది. అలాగే టీయూఎఫ్ గేమింగ్ ఎ14 సిరీస్‌లో ఏఎండీ రైజెన్ ఏఐ ప్రాసెస‌ర్‌ల‌ను ఇచ్చారు. ఏఐ ప‌నుల‌కు ఇవి సరిగ్గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మిలిట‌రీ గ్రేడ్ మ‌న్నిక‌తో వీటిని రూపొందించారు. వీటిల్లో ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్స్‌ను ఇచ్చారు. ప్రో ఆర్ట్ పీజ‌డ్‌14 మోడ‌ల్ ల్యాప్ టాప్‌ల‌ను 2 ఇన్ 1 గా ఉప‌యోగించ‌వ‌చ్చు. ల్యాప్ టాప్ లేదా ట్యాబ్‌గా ఇవి ప‌నిచేస్తాయి. వీటిల్లో స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్‌2 ఎలైట్ ప్రాసెస‌ర్ వ‌స్తుంది. 14 ఇంచుల 3కె ఓలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 80 టాప్స్ వ‌ర‌కు ఏఐ స్పీడ్‌ను అందిస్తాయి. ఇవి కేవ‌లం 0.79 కిలోల బ‌రువును మాత్రమే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల ప్ర‌యాణాల్లో వీటిని సుల‌భంగా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ధర వివ‌రాలు..

అసుస్ ఆర్‌వోజీ సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ ప్లాట్‌ఫామ్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు. ప్రో ఆర్ట్ పీజ‌డ్‌14 సిరీస్ ల్యాప్ టాప్ ల ప్రారంభ ధ‌ర రూ.2,69,990 ఉండ‌గా, టీయూఎఫ్ గేమింగ్ సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను రూ.1,99,990 ప్రారంభ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. జెఫైర‌స్ జి14 సిరీస్ మోడ‌ల్స్ ప్రారంభ ధ‌ర రూ.2,59,990గా ఉంది. జెఫైర‌స్ జి16 సిరీస్ మోడ‌ల్స్ ప్రారంభ ధ‌ర‌ను రూ.4,59,990గా నిర్ణ‌యించారు. జెఫైర‌స్ డ్యుయో సిరీస్ మోడ‌ల్స్ రూ.6,99,990 ప్రారంభ ధ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. ఆర్‌వోజీ స్టోర్స్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఇ-షాప్‌, అసుస్ డీల‌ర్ల వ‌ద్ద ఈ ల్యాప్‌టాప్‌లు ల‌భిస్తున్నాయి. వీటిపై ఈజీ ఫైనాన్సింగ్ స‌దుపాయం అందుబాటులో ఉంది. 18 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ ల‌భిస్తోంది. నెల‌కు రూ.11,111 ఈఎంఐకి ఈ ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement