త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Laptops | ఏఐ ల్యాప్‌టాప్‌ల హవా.. విద్యార్థుల కోసం టాప్ 10 బెస్ట్ మోడ‌ల్స్‌..

AI Laptops | ఈ ఏడాది ల్యాప్‌టాప్‌ల ప్రపంచంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇక బ్రౌజర్ ట్యాబ్‌లో మాత్రమే ఉండటం లేదు. ఇప్పుడు అది నేరుగా ల్యాప్‌టాప్‌లోనే పనిచేస్తోంది.

S

Technology | Published On Jul 14, 2026, 3.42 pm IST

AI Laptops | ఏఐ ల్యాప్‌టాప్‌ల హవా.. విద్యార్థుల కోసం టాప్ 10 బెస్ట్ మోడ‌ల్స్‌..
Advertisement

AI Laptops | ఈ ఏడాది ల్యాప్‌టాప్‌ల ప్రపంచంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇక బ్రౌజర్ ట్యాబ్‌లో మాత్రమే ఉండటం లేదు. ఇప్పుడు అది నేరుగా ల్యాప్‌టాప్‌లోనే పనిచేస్తోంది. లెక్చర్ నోట్స్‌ను క్షణాల్లో సమరీ చేయడం నుంచి ప్రాజెక్ట్ వీడియోలను వేగంగా ఎడిట్ చేయడం వరకు ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు ప్రతి వారం ఎన్నో గంటల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. అయితే మార్కెట్లో అనేక మోడళ్లు అందుబాటులో ఉండటంతో సరైన ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేయడం కాస్త కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ బూట్ అప్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా గేమింగ్, కంటెంట్ క్రియేషన్, చదువులు, ఉద్యోగ అవసరాలు వంటి ప్రతి విభాగానికి సరిపోయే టాప్-10 ఏఐ ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేసింది. వినియోగ‌దారులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆయా ల్యాప్‌టాప్‌ల‌లో కావ‌ల్సిన మోడ‌ల్‌ను ఎంచుకోవ‌చ్చు. దీంతో ఉత్త‌మ ప‌నితీరు కొన‌సాగించేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

అసుస్ ట‌ఫ్ గేమింగ్ ఎఫ్‌16..

గేమింగ్ కోసం ఉత్తమ ఎంపికగా అసుస్ టఫ్ గేమింగ్ ఎఫ్16 నిలిచింది. ఇందులో ఇంటెల్ కోర్ 5-210హెచ్ ప్రాసెసర్‌తోపాటు 4జీబీ ఎన్విడియా గ్రాఫిక్స్ ఉన్నాయి. 16జీబీ ర్యామ్ వల్ల గేమింగ్‌తోపాటు అసైన్‌మెంట్లు, మల్టీటాస్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. 16 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందిస్తుంది. ఏఐ ఫీచర్ల కోసం హెచ్‌పీ 15 ఎఫ్‌డీ2094టీయూ మంచి ఎంపికగా నిలిచింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5-225యూ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లో కోపైలట్ ఏఐ డివైస్‌లోనే పనిచేస్తుంది. చదువుల నోట్స్‌ను సమరీ చేయడం, డాక్యుమెంట్లను వేగంగా సిద్ధం చేయడం వంటి పనులను సులభతరం చేస్తుంది. 24జీబీ ర్యామ్, 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే దీనికి ప్రత్యేక ఆకర్షణ. కంటెంట్ క్రియేటర్ల కోసం యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 ను రిలయన్స్ డిజిటల్ సిఫార్సు చేసింది. 10-కోర్ యాపిల్ ఎం4 చిప్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఫైనల్ కట్ ప్రో, ఫోటోషాప్, లాజిక్ ప్రో వంటి హెవీ సాఫ్ట్‌వేర్‌లను సాఫీగా నిర్వ‌హిస్తుంది. 14.2 ఇంచుల లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే అద్భుతమైన కలర్ క్వాలిటీని అందిస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ.50వేల లోపు అయితే..

రూ.50 వేల లోపు మంచి ల్యాప్‌టాప్ కావాలనుకునే విద్యార్థులకు లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇంటెల్ కోర్ ఐ3-1305యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ జూమ్ క్లాసులు, వర్డ్ డాక్యుమెంట్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి రోజువారీ పనులను సులభంగా నిర్వహిస్తుంది. విండోస్ 11 హోమ్, ఎంఎస్ ఆఫీస్ హోమ్ 2024 ముందుగానే ఇన్‌స్టాల్ అయి వస్తాయి. అధిక ఉత్పాదకత కోసం యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 ప్రత్యేకంగా నిలుస్తోంది. కొత్త యాపిల్ ఎం5 చిప్, 16జీబీ ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 15.3 ఇంచుల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే దీని మరో ప్రధాన ఆకర్షణ. పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రిలయన్స్ డిజిటల్‌లో కనీసం రూ.5వేల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

ఉద్యోగుల‌కు..

ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు డెల్ డీసీ15255 అనువైన ఎంపిక. ఇందులో ఏఎండీ రైజెన్ 5-7520యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ ఉన్నాయి. స్లాక్, ఎక్సెల్, వీడియో మీటింగ్‌లు వంటి పనులను ఒకేసారి నిర్వహించవచ్చు. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2024 ముందుగానే అందుబాటులో ఉంటాయి. రూ.1 లక్షలోపు ప్రీమియం పనితీరు కోరుకునే వారికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5-225హెచ్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ, ఇంటెల్ ఆర్క్ 130టి గ్రాఫిక్స్‌తో ఇది ఇంజినీరింగ్, డిజైన్, ఫైనాన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.15వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. రోజువారీ క్లాసుల కోసం ఏసర్ ఏఎల్15-52హెచ్ ను ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇంటెల్ కోర్ 5-210హెచ్ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ జూమ్, వర్డ్, ఎక్సెల్, కోడింగ్ టూల్స్ వంటి అనేక అప్లికేషన్‌లను ఒకేసారి సులభంగా నిర్వహిస్తుంది. 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత.

స్లిమ్ డిజైన్ కావాలంటే..

స్లిమ్ డిజైన్ కోరుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ బుక్5 మంచి ఎంపిక. ఇంటెల్ కోర్ అల్ట్రా 5-225యూ ప్రాసెసర్‌తో ఏఐ ఫీచర్లు నేరుగా డివైస్‌లోనే పనిచేస్తాయి. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎకోసిస్టమ్ ద్వారా ఫోన్, ల్యాప్‌టాప్ మధ్య డేటా సులభంగా సింక్ అవుతుంది. టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ కోరుకునే వారికి డెల్ డీసీ15250 ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇంటెల్ కోర్ ఐ5-1334యూ ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీతో వచ్చే ఈ మోడల్‌లో డ‌యాగ్రామ్‌లు గీయడం, పీడీఎఫ్‌లపై నోట్స్ రాయడం, అసైన్‌మెంట్లు సిద్ధం చేయడం మరింత సులభంగా ఉంటుంది. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ హెచ్‌ఎస్ 2021తోపాటు 15 నెలల మెకాఫీ సెక్యూరిటీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement