Apple Watch Sleep Score | యాపిల్ వాచ్‌లో స్లీప్ స్కోర్ ఫీచర్.. మీ నిద్ర క్వాలిటీ ఎలా ఉందో చెప్పేస్తుంది..
Apple Watch Sleep Score | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన యాపిల్ వాచ్‌కు గాను ఎప్పటికప్పుడు నూతన ఫీచర్‌లను అందిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే తాజాగా స్లీప్ స్కోర్ పేరిట మరో నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఇది వరకే అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు.
Technology | Published On Dec 28, 2025, 7.04 pm IST
Apple Watch Sleep Score | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన యాపిల్ వాచ్‌కు గాను ఎప్పటికప్పుడు నూతన ఫీచర్‌లను అందిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే తాజాగా స్లీప్ స్కోర్ పేరిట మరో నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఇది వరకే అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ దీనికి తాజాగా మెరుగులు దిద్ది మరింత అధునాతనంగా రూపొందించారు. ఈ క్రమంలో గతంలోకన్నా ఈ ఫీచర్ మరింత మెరుగ్గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే స్లీప్ స్కోర్ ఫీచర్ ద్వారా యాపిల్ వాజ్ యూజర్లు తమ నిద్ర క్వాలిటీ ఎలా ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి వారు ఎలా నిద్రిస్తున్నారు, నిద్ర ఇంకా మెరుగు పడేందుకు ఏం చేయాలి.. ఎన్ని గంటలు నిద్రించాలి.. అన్న వివరాలను సులభంగా అంచనా వేయవచ్చు.
0 నుంచి 100 మధ్యలో స్కోర్..
యాపిల్ వాచ్‌లో ప్రస్తుతం స్లీప్ స్కోర్ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది అందిస్తున్నారు. దీని ప్రకారం యూజర్ రోజూ రాత్రి నిద్రిస్తున్నప్పుడు యాపిల్ వాచ్‌ను చేతికి ధరిస్తే మరుసటి రోజు వాచ్‌లో స్లీప్ స్కోర్ అని 0 నుంచి 100 మధ్యలో ఒక సంఖ్యను చూపిస్తుంది. దీనికి సంఖ్యను బట్టి రేటింగ్ ఉంటుంది. వెరీ లో, లో, ఓకే, హై, వెరీ హై పేరిట స్లీప్ స్కోర్‌ను విభజించారు. ఈ క్రమంలో స్లీప్ స్కోర్ ఓకే అని వస్తే అంతకు ముందు రాత్రి యూజర్ సాధారణంగా నిద్రించాడని అర్థం. అదే వెరీ హై అని స్లీప్ స్కోరును చూపిస్తే యూజర్ అంతకు ముందు రోజు రాత్రి అవసరం అయిన దాని కన్నా ఎక్కువగా నిద్రించాడని అర్థం. ఇలా స్లీప్ స్కోర్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓకే కన్నా తక్కువగా.. అంటే లో.. లేదా వెరీ లో.. అని స్లీప్ స్కోరు చూపిస్తే యూజర్లకు నిద్ర సరిగ్గా సరిపోవడం లేదని, రాత్రి పూట మరిన్ని గంటలపాటు నిద్రించాలని అర్థం. ఇలా యాపిల్ వాచ్‌లో స్లీప్ స్కోర్ ఫీచర్ పనిచేస్తుంది.
ఈ వెర్షన్ ఓఎస్ ఉండాలి..
యాపిల్ వాచ్‌లో అందుబాటులో ఉన్న స్లీప్ స్కోర్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ నిద్ర క్వాలిటీని మెరుగుపరుచుకోవచ్చు. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రపోయేలా చేసేందుకు ఈ ఫీచర్ ఎంతగానో పనిచేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు స్లీప్ స్కోరు చెబుతుంది కనుక ఆ తరువాత రోజు నిద్ర సరిగ్గా పోయేలా ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది. మరిన్ని ఎక్కువ గంటల పాటు నిద్రించి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా స్లీప్ స్కోర్ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ను పొందాలంటే యాపిల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను లేటెస్ట్ వెర్షన్ 26.2కు అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. యాపిల్ వాచ్ ఓఎస్ 26.2 ను పొందాలంటే యూజర్లు వాడే ఐఫోన్‌లో ఐఓఎస్ వెర్షన్ కూడా 26.2 ఉండాలి. కనుక ముందుగా ఐఫోన్ ఓఎస్ అప్‌డేటెడ్‌గా ఉందో లేదో చెక్ చేయాలి. అప్‌డేట్ లేకపోతే 26.2 వెర్షన్‌కు అప్ డేట్ చేయాలి. ఆ తరువాత వాచ్ ఓఎస్‌ను కూడా 26.2 వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. దీంతో యాపిల్ వాచ్‌లో స్లీప్ స్కోర్ ఫీచర్ పనిచేస్తుంది.
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

NoiseFit Halo 3 | క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసే సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫోన్‌ను బయటకు తీయాల్సిన పనిలేదు.. ధర చాలా తక్కువ..
మే 9, 2026

CMF Watch 3 Pro | నథింగ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. అదిరిపోయింది.. ధర తక్కువే..
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



