త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Watch 11 Series | యాపిల్ వాచ్ 11పై భారీ డిస్కౌంట్‌.. రిప‌బ్లిక్ డే ఆఫ‌ర్‌.. ఎందులో అంటే..?

Apple Watch 11 Series | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న యాపిల్ వాచ్ సిరీస్ 11 వాచ్‌ల‌కు గాను భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచ‌గా, ఇందులో భాగంగా వినియోగ‌దారులు యాపిల్ వాచ్ 11 సిరీస్ స్మార్ట్ వాచ్‌ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

S

Technology | Published On Jan 12, 2026, 6.27 am IST

Apple Watch 11 Series | యాపిల్ వాచ్ 11పై భారీ డిస్కౌంట్‌.. రిప‌బ్లిక్ డే ఆఫ‌ర్‌.. ఎందులో అంటే..?
Advertisement

Apple Watch 11 Series | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న యాపిల్ వాచ్ సిరీస్ 11 వాచ్‌ల‌కు గాను భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫ‌ర్‌ను అందుబాటులో ఉంచ‌గా, ఇందులో భాగంగా వినియోగ‌దారులు యాపిల్ వాచ్ 11 సిరీస్ స్మార్ట్ వాచ్‌ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ వాచ్ ధ‌ర రూ.46,990 ఉండ‌గా దీనిపై ఏకంగా రూ.9వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ వాచ్‌ను రూ.37,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని యాపిల్ ప్ర‌క‌టించింది. ఇక రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే యాపిల్ వాచ్‌ను కొనాల‌ని చూస్తున్న వారికి ఇదే గొప్ప అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు.

ప‌రిమిత కాలం పాటు మాత్ర‌మే..

యాపిల్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు రెండూ క‌ల‌సి ఈ ఆఫ‌ర్‌ను అందిస్తుండ‌గా, దీన్ని ప‌రిమిత కాలం పాటు మాత్ర‌మే అందుబాటులో ఉంచారు. అందువ‌ల్ల స్టాక్ అయిపోయే వ‌ర‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. క‌నుక యాపిల్ వాచ్‌ను కొనాల‌ని అనుకుంటే వెంట‌నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక యాపిల్ 11 స్మార్ట్ వాచ్‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీన్ని క్లీన్ డిజైన్‌తో తీర్చిదిద్ద‌గా స్లిమ్ ప్రొఫైల్‌తో ఆక‌ట్టుకుంటోంది. అలాగే ప్రీమియం ఫినిషింగ్‌ను ఇచ్చారు. క‌నుక లుక్ చాలా బాగుంటుంది. ఈ వాచ్ చాలా స్మార్ట్‌గా ప‌నిచేయ‌డ‌మే కాకుండా వేగంగా కూడా ఉంటుంది. యూజ‌ర్ల‌కు కావ‌ల్సిన స‌దుపాయాల‌ను అందిస్తుంది.

లేటెస్ట్ చిప్‌..

యాపిల్ వాచ్ 11 సిరీస్ స్మార్ట్ వాచ్‌లో యాపిల్‌కు చెందిన లేటెస్ట్ చిప్‌ను ఇచ్చారు. దీని వ‌ల్ల వాచ్‌లో యాప్ లు చాలా స్మూత్‌గా ఓపెన్ అవుతాయి. నావిగేష‌న్ కూడా చాలా వేగంగా ఉంటుంది. రోజంతా చాలా వేగంగా ఈ వాచ్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని యాపిల్ చెబుతోంది. అలాగే ప‌లు ర‌కాల ఫిట్ నెస్ మోడ్స్‌ను కూడా ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఇక బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా ఎక్కువ‌గానే వ‌స్తుంది.

అడ్వాన్స్‌డ్ స్లీప్ ట్రాకింగ్‌..

యాపిల్ వాచ్ 11 సిరీస్ వాచ్‌ల‌లో అధునాత‌న స్లీప్ ట్రాకింగ్ ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. అలాగే బ్ల‌డ్ ఆక్సిజ‌న్ (ఎస్‌పీవో2) సెన్సార్ కూడా ఉంది. యూజ‌ర్లు ఈసీజీ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆరోగ్యం కోసం ఈ వాచ్ అద్బుతంగా ప‌నిచేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్‌కు త‌న ఆరోగ్యానికి సంబంధించిన ప‌లు వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది. అలాగే ఈ వాచ్ అనేక ర‌కాల యాక్టివిటీల‌ను సైతం ట్రాక్ చేస్తుంది. అనేక వ‌ర్క‌వుట్‌ల‌ను ఇది గుర్తించ‌గ‌ల‌దు. ఇలా ఈ వాచ్ లో అనేక ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. క‌నుక యూజ‌ర్ల‌కు ఈ వాచ్‌ను కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement