త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Valentines Day Sale 2026 | వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌.. యాపిల్ ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు, వాచ్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

Apple Valentines Day Sale 2026 | వాలెంటైన్స్ డే సమీపిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ భారత్‌లో ప‌లు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు ప్రస్తుతం యాపిల్ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా, ఐఫోన్ 17 సిరీస్ నుంచి మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్స్‌, యాపిల్ వాచ్‌ల వరకు అనేక డివైస్‌ల‌కు వీటిని అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 2, 2026, 1.02 pm IST

Apple Valentines Day Sale 2026 | వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌.. యాపిల్ ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు, వాచ్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..
Advertisement

Apple Valentines Day Sale 2026 | వాలెంటైన్స్ డే సమీపిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ భారత్‌లో ప‌లు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు ప్రస్తుతం యాపిల్ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా, ఐఫోన్ 17 సిరీస్ నుంచి మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్స్‌, యాపిల్ వాచ్‌ల వరకు అనేక డివైస్‌ల‌కు వీటిని అందిస్తున్నారు. ఎప్పటిలాగే నేరుగా ధర తగ్గింపులకంటే బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ ఆఫర్లను యాపిల్ అందిస్తోంది. ల్యాప్‌టాప్ విభాగంలో మాక్ బుక్ ఎయిర్ ఎం4 పై గరిష్టంగా రూ.10వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. రూ.99,900కు లాంచ్ అయిన 13-ఇంచుల‌ మోడల్‌ను ఇప్పుడు రూ.89,900కు కొనుగోలు చేయవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ చెక‌వుట్ సమయంలోనే ఆటోమేటిక్‌గా వర్తిస్తుందని యాపిల్ తెలిపింది. ఈ ఆఫర్ ను ఐసీఐసీఐ, యాక్సిస్‌, అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్ కార్డుల‌పై పొంద‌వ‌చ్చు.

మాక్‌బుక్ ల్యాప్ టాప్‌ల‌పై..

అదే విధంగా కొన్ని మాక్ బుక్ ప్రొ మోడళ్లపై కూడా రూ.10వేల క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నారు. 14 ఇంచుల మాక్ బుక్ ప్రొ ఎం4 ల్యాప్ టాప్ ధ‌ర ఈ సేల్‌లో రూ.1,69,900 నుంచి రూ.1,59,900కి త‌గ్గగా, 16 ఇంచుల మాక్ బుక్ ప్రొ ఎం4 ప్రొ ల్యాప్ టాప్ ధర రూ.2,49,900 నుంచి రూ.2,39,900కు త‌గ్గింది. అయితే యాపిల్ స్టోర్ క‌న్నా ప‌లు ఇత‌ర స్టోర్స్‌లో ఇంకా త‌క్కువ ధ‌ర‌ల‌కే ఈ ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. విజ‌య్ సేల్స్‌లో మాక్‌బుక్ ఎయిర్ ఎం4 (16జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.89,900కే లిస్ట్ అయింది. అంటే ఆ స్టోర్‌లో ఆఫ‌ర్‌ను ఇప్ప‌టికే అప్లై చేశార‌న్న‌మాట‌. ఇక బ్యాంకు కార్డుల‌తో కొంటే మ‌రో రూ.5వేల వ‌ర‌కు డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో యాపిల్ స్టోర్ క‌న్నా ఇంకాస్త త‌క్కువ ధ‌ర‌కే ఈ స్టోర్‌లో యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఐసీఐసీ, యాక్సిస్ కార్డుల‌తో ఈ అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది.

ఐఫోన్లు, యాపిల్ వాచ్‌ల‌పై..

ఇక స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల‌పై రూ.5వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ను ఇస్తున్నారు. రూ.82,900 ధ‌ర క‌లిగిన ఐఫోన్ 17 స్టాండ‌ర్డ్ బేస్ వేరియెంట్‌ను త‌గ్గింపు ధ‌ర అనంత‌రం రూ.77,900కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఐఫోన్ 16, 16 ప్ల‌స్ ఫోన్ల‌పై రూ.4వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు. ప‌లు ఈ-కామ‌ర్స్ సైట్లలో ఈ ఫోన్ల‌ను ఇంకా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. క‌నుక ఇంకా డిస్కౌంట్ కావాలంటే వినియోగ‌దారులు ఈ-కామ‌ర్స్ సైట్ల‌ను ఒక‌సారి సందర్శించాల్సి ఉంటుంది.

అలాగే ఈ సేల్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 11 వాచ్‌ల‌పై రూ.4వేల బ్యాంకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాపిల్ వాచ్ ఎస్ఈ3 ని రూ.2వేల డిస్కౌంట్‌కు కొన‌వ‌చ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రొ (3వ త‌రం), ఎయిర్ పాడ్స్ 4 పై రూ.1వేయి డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే యాపిల్ ఐప్యాడ్‌ను కొనుగోలు చేస్తే ఐప్యాడ్ ఎయిర్ (11, 13 ఇంచులు)ను తీసుకోవ‌డం మంచిది. ఈ మోడల్స్‌పై రూ.4వేల క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నారు. ఇలా వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా యాపిల్ ఆయా ప్రొడ‌క్ట్స్‌పై ప‌లు అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది.

Advertisement
Advertisement