Apple Upgrade | అప్‌గ్రేడ్ లీజ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన యాపిల్.. ఇక ఐఫోన్ సహా అన్ని రకాల డివైస్‌లు అద్దెకు..
Apple Upgrade | యాపిల్ అమెరికాలో కొత్తగా యాపిల్ అప్‌గ్రేడ్ పేరుతో లీజ్ ఆధారిత ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలకు తెరదించుతూ ఈ కొత్త సేవను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు క్లార్నా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
Technology | Published On Jul 29, 2026, 11.46 am IST
Apple Upgrade | యాపిల్ అమెరికాలో కొత్తగా యాపిల్ అప్‌గ్రేడ్ పేరుతో లీజ్ ఆధారిత ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలకు తెరదించుతూ ఈ కొత్త సేవను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు క్లార్నా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్, ఐప్యాడ్ వంటి పరికరాలను నెలవారీ చెల్లింపులతో ఉపయోగించే అవకాశాన్ని ఇందులో కల్పించారు. ఈ సేవ ప్రస్తుతం అమెరికాలోని యాపిల్ స్టోర్ ఆన్‌లైన్, యాపిల్ స్టోర్ యాప్, అలాగే ఫిజికల్ యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త లీజ్ ప్రోగ్రామ్‌లో పరికరాల వారీగా వేర్వేరు గడువులను యాపిల్ అందిస్తోంది. ఐఫోన్, యాపిల్ వాచ్‌లకు 12 నెలలు, 24 నెలల లీజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. మ్యాక్, ఐప్యాడ్‌లకు 24 నెలలు, 36 నెలల లీజ్ వ్యవధిని ఎంచుకోవచ్చు.
నెలకు ఎంత చెల్లించాలి..
ప్రారంభ నెలవారీ చెల్లింపులు ఐఫోన్‌కు 17.99 డాలర్లుగా నిర్ణయించారు. అలాగే యాపిల్ వాచ్‌కు 11.99, మ్యాక్‌కు 24.99, ఐప్యాడ్‌కు 11.99 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే వినియోగదారుల వద్ద ఉన్న పాత యాపిల్ డివైస్‌లను యాపిల్ ట్రేడ్ ఇన్ ద్వారా ఇచ్చి, దాని విలువను నెలవారీ చెల్లింపులను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే యాపిల్ కార్డ్ ద్వారా లీజ్ చెల్లింపులు చేసే వినియోగదారులకు ప్రతి చెల్లింపుపై 3 శాతం డైలీ క్యాష్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. యాపిల్, క్లార్నా కలిసి రూపొందించిన ఈ నమోదు ప్రక్రియలో వినియోగదారులు సైన్ అప్ చేయడానికి ముందే అందుబాటులో ఉన్న లీజ్ ఆప్షన్ల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో లేదా స్టోర్‌లో కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అర్హతను క్లార్నా పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియలో సాఫ్ట్ క్రెడిట్ చెక్ మాత్రమే నిర్వహిస్తారు. దీనివల్ల వినియోగదారుడి క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.
లీజ్ గడువు ముగిస్తే..
దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత సాధారణ రిటైల్ విధానంలోనే కొనుగోలు పూర్తి చేయవచ్చు. వినియోగదారులు వెంటనే స్టోర్‌లో పరికరాన్ని తీసుకోవచ్చు లేదా ఇంటికే డెలివరీ, స్థానిక పికప్ వంటి ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. యాపిల్ అప్‌గ్రేడ్‌లో చేరిన వారికి యాపిల్ అందించే ఇతర సేవలు కూడా కొనసాగుతాయి. కొత్త పరికరాన్ని సెటప్ చేసేందుకు పర్సనల్ సెటప్ సహాయం అందుతుంది. అలాగే పరికరాల వినియోగంపై అవగాహన కల్పించే ఉచిత టుడే ఎట్ యాపిల్ శిక్షణ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. లీజ్ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులకు మూడు ఆప్షన్లు ఉంటాయి. కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. ప్రస్తుతం వాడుతున్న పరికరాన్ని ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవచ్చు. లేదా పరికరాన్ని తిరిగి ఇచ్చి ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించవచ్చు.
ఐచ్ఛికంగా కేర్ సభ్యత్వం..
లీజ్‌కు సంబంధించిన బిల్లింగ్ షెడ్యూల్, మిగిలిన చెల్లింపులు వంటి వివరాలను క్లార్నా యాప్‌లో సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. లీజ్ కాలంలో పరికర రక్షణ కోసం ఐచ్ఛికంగా యాపిల్ కేర్ సభ్యత్వాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభంతో అమెరికాలో ప్రస్తుతం అమలులో ఉన్న ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్, ఐఫోన్ పేమెంట్స్ సేవలను యాపిల్ నిలిపివేస్తోంది. ఇప్పటికే ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో ఉన్న వినియోగదారులు తదుపరి అప్‌గ్రేడ్‌కు అర్హత సాధించిన తర్వాత యాపిల్ అప్‌గ్రేడ్‌కు మారవచ్చు. లేదా యాపిల్ కార్డ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్, నేరుగా కొనుగోలు చేయడం లేదా టెలికాం క్యారియర్‌ల ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
జులై 22, 2026

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్.. ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా మళ్లీ సెటిల్..
జులై 18, 2026
తాజావార్తలు
- ●Russia-Ukraine War | బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకను తాకిన క్షిపణి.. చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
- ●Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
- ●Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..
- ●Bogatha Waterfalls | ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత
- ●Stock Markets | 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..

Russia-Ukraine War | బ్లాక్‌సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకను తాకిన క్షిపణి.. చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు

Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..

Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..



