iPhone | ఐఫోన్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనున్న ఫోన్ల ధరలు..?
iPhone | ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లు, స్టోరేజ్ కంపోనెంట్ల కొరత పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ల నుంచి భారీ డిమాండ్ రావడంతో మెమరీ చిప్‌ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ధరల పెంపు తప్పనిసరి అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు.
Technology | Published On Jun 18, 2026, 10.26 am IST
iPhone | ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లు, స్టోరేజ్ కంపోనెంట్ల కొరత పెరుగుతున్న నేపథ్యంలో యాపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ల నుంచి భారీ డిమాండ్ రావడంతో మెమరీ చిప్‌ల ధరలు వేగంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ధరల పెంపు తప్పనిసరి అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిమ్ కుక్ మాట్లాడుతూ ఇప్పటివరకు పెరుగుతున్న కంపోనెంట్ ఖర్చులను వినియోగదారులపై మోపకుండా యాపిల్ భరించడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని, ఖర్చుల పెరుగుదలను పూర్తిగా కంపెనీ భరించడం సాధ్యం కావడం లేదని అంగీకరించారు. దురదృష్టవశాత్తు ధరల పెంపు తప్పనిసరి కావచ్చని, సరఫరాదారుల నుంచి తమకు బదిలీ అవుతున్న భారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, వినియోగదారులను ఈ ప్రభావం నుంచి కాపాడేందుకు కృషి చేశామని, కానీ పరిస్థితి దీర్ఘకాలికంగా నిలదొక్కుకునేలా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
తగ్గిన స్మార్ట్ ఫోన్ చిప్‌ల సరఫరా..
ఇటీవలి నెలల్లో మెమరీ తయారీ సంస్థలు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం ఉపయోగించే డీఆర్‌ఏఎం చిప్‌ల కంటే ఏఐ సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో డీఆర్‌ఏఎం, స్టోరేజ్ కంపోనెంట్ల సరఫరాపై ఒత్తిడి పెరిగి వాటి ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మెమరీ సరఫరాను పెంచేందుకు యాపిల్ తన ఆర్థిక వనరులను వినియోగించే మార్గాలను పరిశీలిస్తోందని టిమ్ కుక్ తెలిపారు. అయితే యాపిల్ స్వయంగా మెమరీ చిప్‌ల తయారీలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాగా డిజీటైమ్స్ ఆసియా నివేదిక ప్రకారం రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌లో 12జీబీ ర్యామ్ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడళ్లలో 8జీబీ ర్యామ్ మాత్రమే ఉంది. భవిష్యత్తులో ఐఓఎస్ 27తో వచ్చే అధునాతన సిరి అప్ డేట్స్, ఏఐ ఫీచర్లకు మద్దతుగా ఈ అప్‌గ్రేడ్‌ను తీసుకురావాలని యాపిల్ భావిస్తున్నట్లు సమాచారం.
ఐఫోన్ 18 ధర భారీగా పెంపు..?
అయితే పెరుగుతున్న మెమరీ ఖర్చులు ఆ వ్యూహంపై ప్రభావం చూపే అవకాశముందని టిమ్ కుక్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ టెక్‌ఇన్‌సైట్స్ అంచనాల ప్రకారం బేస్ ఐఫోన్ 18 ప్రొ మోడల్‌లో డీఆర్‌ఏఎం ఖర్చు ప్రస్తుతం సుమారు 39 డాలర్ల నుంచి 145 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్ ఖర్చు 13 నుంచి 51 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా. తయారీ వ్యయాలు, ఇతర కంపోనెంట్ ఖర్చులు కలిపి చూస్తే ఐఫోన్ 18 ప్రో తయారీ ఖర్చు, ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో తో పోలిస్తే దాదాపు 25 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో లాభాల మార్జిన్‌ను కాపాడుకునేందుకు యాపిల్ ఈ ఫోన్ ధరను 1,099 డాలర్ల నుంచి 1,299 డాలర్లకు పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా
- ●KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్
- ●Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ●KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్

Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?

Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా

KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్

Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్






