త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మ‌రింత క‌ట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే ప‌సిగ‌డుతుంది..

iPhone | ఐఫోన్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి యాపిల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌పై పని చేస్తోంది. యూజర్ చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కెళ్లినట్లు గుర్తిస్తే, ఐఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే విధంగా ఈ ఫీచర్ పనిచేయనుంది. ఫోన్ అన్‌లాక్‌లో ఉన్న సమయంలో దొంగిలించబడితే, దొంగలు సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.

S

Technology | Published On May 27, 2026, 5.04 pm IST

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మ‌రింత క‌ట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే ప‌సిగ‌డుతుంది..
Advertisement

iPhone | ఐఫోన్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి యాపిల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌పై పని చేస్తోంది. యూజర్ చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కెళ్లినట్లు గుర్తిస్తే, ఐఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే విధంగా ఈ ఫీచర్ పనిచేయనుంది. ఫోన్ అన్‌లాక్‌లో ఉన్న సమయంలో దొంగిలించబడితే, దొంగలు సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ వివరాలను 9 టు 5 మాక్ వెల్ల‌డించింది. ప్రస్తుతం యాపిల్ వద్ద ఫైండ్ మై, యాక్టివేషన్ లాక్, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ వంటి భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఫోన్ యూజర్ చేతిలో ఉపయోగంలో ఉన్న సమయంలో దొంగిలించ‌బ‌డితే వాటి ప్రభావం కొంత పరిమితంగానే ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ ఐడీ సెట్టింగ్స్ మార్చడానికి టైమ్ డిలే ఉన్నప్పటికీ, ఆ చిన్న సమయంలోనే దుండ‌గులు కొంత‌ సెన్సిటివ్ సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.

స్నాచింగ్ డిటెక్షన్ ఎలా పనిచేస్తుంది..?

కొత్త ఫీచర్ ఐఫోన్‌లోని ఆన్-డివైస్ సెన్సర్ల సహాయంతో ఆకస్మికంగా జరిగే దొంగతనం తరహా కదలికలను గుర్తిస్తుంది. ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కొని పరుగెత్తే పరిస్థితులకు సంబంధించిన మోషన్ ప్యాటర్న్‌లను విశ్లేషించి వెంటనే డివైస్‌ను లాక్ చేస్తుంది. ఈ ఫీచర్‌ ప‌లు ప్రధాన సంకేతాల‌ను గుర్తిస్తుంది. ఐఫోన్ అన్‌లాక్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా బలమైన కదలిక రావ‌డం, ఫోన్ లాక్కెళ్లే చర్యలకు అనుగుణమైన మోషన్ ప్యాటర్న్స్ ఏర్ప‌డ‌డం, యూజర్ చేతి నుంచి డివైస్ వెంటనే దూరమవడం వంటి క‌ద‌లిక‌ల‌ను ఈ ఫీచ‌ర్ ప‌సిగ‌డుతుంది. ఈ సంకేతాలు గుర్తించిన వెంటనే ఐఫోన్ ఆటోమేటిక్‌గా లాక్ అయి, యాప్స్, డేటాకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది. తప్పుగా లాక్ అవకుండా ఉండేందుకు యాపిల్ అదనపు కాంటెక్స్ట్ చెక్స్ కూడా జోడిస్తోంది. ఇందుకోసం యాపిల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన డేటా, లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించనుంది.

పెయిర్ అయి ఉన్న యాపిల్ వాచ్ నుంచి క్ర‌మంగా దూరం పెర‌గ‌డం, ఇల్లు లేదా ఆఫీస్ వంటి పరిచయమైన వై-ఫై నెట్‌వర్క్ నుంచి డిస్కనెక్ట్ కావడం, హోమ్ లేదా వర్క్‌ప్లేస్ వంటి ఫ్యామిలియర్ లొకేషన్స్ నుంచి అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకోవ‌డం, ట్రస్టెడ్ ఎన్విరాన్‌మెంట్ స్టేటస్ వంటి సిగ్నల్స్ అన్నీ కలిసి దొంగతనం జరిగిందని నిర్ధారిస్తే, వెంటనే డివైస్‌ను లాక్ చేస్తుంది. ఈ కొత్త సిస్టమ్ ప్రస్తుతం ఉన్న స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను మరింత శక్తివంతం చేయనుంది. దొంగతనం జరిగిన వెంటనే స్పందించి సున్నితమైన చర్యలను కూడా నిరోధించ‌గ‌లుగుతుంది. అయితే ఇందుకు కొన్ని ప‌రిమితులు కూడా ఉన్నాయి. యాపిల్ ఐడీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్పులను బ్లాక్ చేయడం, సెన్సిటివ్ యాక్షన్స్‌కు అదనపు ఆథెంటికేషన్ డిలే జోడించడం, పాస్‌వర్డ్స్, పేమెంట్ సెట్టింగ్స్ యాక్సెస్‌ను పరిమితం చేయడం వంటి ప‌రిమితులు ఉన్నాయి.

ఎప్పుడు అందుబాటులోకి?

ఈ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై యాపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అంతర్గత సిస్టమ్ కోడ్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన సూచనలు కనిపించడంతో, అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఐఓఎస్ 27లో యాపిల్ త‌న యూజ‌ర్ల‌కు అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయ్యే కొత్త ఐఫోన్ మోడ‌ల్స్‌లో ఈ ఫీచ‌ర్ కోసం ప్ర‌త్యేక సెన్సార్ల‌ను కూడా ఐఫోన్ల‌లో యాపిల్ ఏర్పాటు చేయ‌నుంద‌ని స‌మాచారం.

Advertisement
Advertisement