Apple Pay India | యాపిల్ పే వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తోనే చెల్లింపులు..
Apple Pay India | యాపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ యాపిల్ పేను భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న పలు ఊహాగానాలకు తెరదించుతూ, నేటి నుంచి భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు యాపిల్ పే సేవలను ఉపయోగించుకోవచ్చు.
Technology | Published On Sep 30, 2026, 12.56 pm IST
Apple Pay India | యాపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ యాపిల్ పేను భారత్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న పలు ఊహాగానాలకు తెరదించుతూ, నేటి నుంచి భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వినియోగదారులు యాపిల్ పే సేవలను ఉపయోగించుకోవచ్చు. మాక్ కంప్యూటర్లకు ఈ సేవను త్వరలో అందిచనున్నట్లు యాపిల్ వెల్లడించింది. ఈ సేవ ద్వారా యాపిల్ వినియోగదారులు షాప్‌లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయడంతోపాటు మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లలో కూడా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. చెల్లింపు సమయంలో వన్‌టైమ్ పాస్‌వర్డ్ లేదా భౌతిక పేమెంట్ పిన్‌ను ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
యాక్సిస్ బ్యాంక్ వీసా, మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులకు..
ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే యాపిల్ పే మద్దతు అందిస్తోంది. ఈ కార్డులను యాపిల్ పేలో యాడ్ చేసి భారత్‌లోని వేలాది వ్యాపార సంస్థల్లో, అలాగే ఎన్‌ఎఫ్‌సీ లావాదేవీలకు మద్దతు ఇచ్చే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద కూడా చెల్లింపులు చేయవచ్చు. దేశవ్యాప్తంగా లక్షలాది రిటైల్, డిజిటల్ వ్యాపార కేంద్రాల్లో యాపిల్ పేను అంగీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు యాపిల్ తెలిపింది. ప్రారంభ దశలో యాపిల్ స్టోర్ రిటైల్ కేంద్రాలు, బ్లింకిట్, చాయోస్, కోమెట్, క్రోమా, ఇంటర్‌ఫ్లోరా, ఇక్సిగో, ఎల్15 పటిసెరీ, రిలయన్స్ బ్రాండ్ ఔట్‌లెట్లు, టాటా 1ఎంజీ, జొమాటో వంటి సంస్థలు యాపిల్ పేను అంగీకరిస్తున్నాయి. భారత్‌లో పెద్ద స్థాయిలో చెల్లింపు మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి యాపిల్ క్యాష్‌ఫ్రీ, జస్‌పే, ఎంస్వైప్, పేటీఎం, పేయూ, పైన్ ల్యాబ్స్, రేజర్‌పే, వరల్డ్‌లైన్ వంటి ప్రధాన పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, అగ్రిగేటర్లతో కలిసి పనిచేసింది.
బెనిఫిట్స్ యథాతథం..
భవిష్యత్తులో మరిన్ని వ్యాపార నెట్‌వర్క్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను యాపిల్ పే పరిధిలోకి తీసుకురానున్నారు. యాపిల్ పే ద్వారా చెల్లించినప్పటికీ కార్డు జారీ చేసిన బ్యాంక్ అందించే సాధారణ రివార్డులు, లాయల్టీ పాయింట్లు, ఇతర కొనుగోలు ప్రయోజనాలు కొనసాగుతాయని యాపిల్ తెలిపింది. భద్రత విషయంలో యాపిల్ పే టోకనైజేషన్, హార్డ్‌వేర్ ఆధారిత భద్రతా వ్యవస్థను ఉపయోగిస్తుంది. వినియోగదారుల అసలు క్రెడిట్ కార్డు నంబర్లు పరికరంలోనూ, యాపిల్ సర్వర్లలోనూ నిల్వ కావు. అలాగే లావాదేవీ సమయంలో ఈ కార్డు వివరాలు వ్యాపార సంస్థలకు అందవు. ప్రతి కార్డును యాపిల్ పేలో నమోదు చేసినప్పుడు ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ డివైస్ అకౌంట్ నంబర్ రూపొందుతుంది. ఈ వివరాలు పరికరంలోని ప్రత్యేకమైన, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరించిన సెక్యూర్ ఎలిమెంట్ హార్డ్‌వేర్ చిప్‌లోనే స్టోర్ అవుతాయి.
వివరాలు నిల్వ కావు..
వినియోగదారుడికి నేరుగా అనుసంధానించగలిగే లావాదేవీ వివరాలను యాపిల్ నిల్వ చేయదని సంస్థ పేర్కొంది. చెల్లింపుల సెటిల్‌మెంట్ వివరాలు వినియోగదారు, వ్యాపారి, కార్డు జారీ చేసిన బ్యాంక్ మధ్య మాత్రమే ఉంటాయి. ఒకవేళ యాపిల్ పరికరం పోయినా లేదా భద్రతకు ముప్పు ఏర్పడినా, ఫైండ్ మై సేవ ద్వారా పరికరాన్ని రిమోట్‌గా గుర్తించడం, లాక్ చేయడం లేదా చెల్లింపు అనుమతులను నిలిపివేయడం చేయవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులు యాపిల్ పేను రెండు విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ తాజా వెర్షన్ ద్వారా నేరుగా కార్డును నమోదు చేసుకోవచ్చు. లేదా ఐఫోన్‌లోని యాపిల్ వాలెట్ అప్లికేషన్‌ను తెరిచి, ప్లస్ గుర్తుపై ట్యాప్ చేసి, తెరపై కనిపించే సూచనలను అనుసరించి అర్హత కలిగిన కార్డును జోడించవచ్చు. భౌతిక స్టోర్స్‌లో చెల్లింపు చేయాలంటే ఐఫోన్‌లో సైడ్ బటన్ లేదా హోమ్ బటన్‌ను రెండుసార్లు ట్యాప్ చేసి ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పరికరం పాస్‌కోడ్ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. అనంతరం ఎన్‌ఎఫ్‌సీకి మద్దతు ఇచ్చే చెల్లింపు టెర్మినల్ దగ్గర పరికరాన్ని ఉంచితే లావాదేవీ పూర్తవుతుంది.
మాన్యువల్ నమోదుతో పనిలేదు..
మద్దతు ఉన్న ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్ అప్లికేషన్లు, వెబ్ బ్రౌజర్లలో ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు కూడా కార్డు వివరాలు, షిప్పింగ్ చిరునామా లేదా సంప్రదింపు వివరాలను ప్రతిసారీ మాన్యువల్‌గా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లింపును నేరుగా పరికరంలోనే ధ్రువీకరించవచ్చు. ఈ తాజా విస్తరణతో యాపిల్ పే సేవలు అందుబాటులో ఉన్న దేశాలు, ప్రాంతాల సంఖ్య 90కి పైగా చేరింది. ప్రపంచవ్యాప్తంగా 11వేలకు పైగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు యాపిల్ పే నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు యాపిల్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ ఫోన్లకు భారీ డిమాండ్.. ధర పెరిగినా తగ్గని క్రేజ్..
సెప్టెంబర్ 19, 2026

Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..
సెప్టెంబర్ 19, 2026

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన
- ●CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..
- ●Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ
- ●Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Harish Rao | 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ పాత్రలో జీవించావు..
- ●Vemula Prashanth Reddy | ఆ మొత్తం వీడియో ఫుటేజీ ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌ను కోరిన మాజీ మంత్రి వేముల

Droupadi Murmu | మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలి.. ఆర్చరీ జట్టుకు రాష్ట్రపతి అభినందన

CAFE III | వాహనాలకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు.. 2027 నుంచి అమలు..

Manjeera | అక్టోబర్ 2న మంజీరా రచయితల సంఘం మహాసభ

Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం



