Apple | యాపిల్ కొత్త సీఈవో జాన్ టెర్నస్ ఆగమనం.. ఈ ఏడాది అద్భుతమైన ప్రొడక్ట్స్ లాంచ్..
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు సీఈవోగా టిమ్ కుక్ దాదాపు 15 సంవత్సరాల పాటు సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు టిమ్ కుక్ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు.
Technology | Published On Apr 27, 2026, 1.58 pm IST
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు సీఈవోగా టిమ్ కుక్ దాదాపు 15 సంవత్సరాల పాటు సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు టిమ్ కుక్ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం టెర్నస్‌కు కుక్ సీఈవో బాధ్యతలను అప్పగించే పనిలో ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రానున్న సెప్టెంబర్ నుంచి టెర్నస్ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపడతారు. అయితే ప్రతి ఏడాది అదే నెలలో యాపిల్ తన నూతన ఐఫోన్లు, ఇతర కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తుంది కనుక, ఈసారి టెర్నస్ ఆగమనంతో పలు అద్భుతమైన ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని యాపిల్ భావిస్తోంది. వాటిల్లో ఫోల్డబుల్ ఐఫోన్‌తోపాటు పలు ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఫోల్డబుల్ ఫోన్.. ఐఫోన్ అల్ట్రా..
బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ తన పవర్ ఆన్ న్యూస్‌లెటర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం టెర్నస్ బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే యాపిల్ తన తొలి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఐఫోన్ అల్ట్రా పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారని సమాచారం. ఇది ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్ 18 సిరీస్ లైనప్‌తోపాటు ఐఫోన్ అల్ట్రాను విడుదల చేస్తారని తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్‌లో నిర్వహించే యాపిల్ ఈవెంట్‌కు ముందుగానే టెర్నస్ సీఈవోగా బాధ్యతలు చేపడతారు కనుక ఆయన ఆధ్వర్యంలోనే ఈసారి యాపిల్ ఈవెంట్ జరగనుంది. దీంతో యాపిల్ కీనోట్‌లో ఆయన సీఈవోగా ఆయా ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్‌లో టెర్నస్ కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఆయనే స్వయంగా ఈ ప్రొడక్ట్‌ను లాంచ్ చేస్తారని సమాచారం.
స్మార్ట్ హోమ్ హబ్ డివైస్‌లు, ఏఐ ఎయిర్‌పాడ్స్..
టెర్నస్ నాయకత్వంలో యాపిల్ కొత్త కేటగిరీల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏఐ ఆధారిత స్మార్ట్ హోమ్ డివైస్‌లు ముఖ్యంగా నిలవనున్నాయి. స్క్రీన్‌తో కూడిన హోమ్‌పాడ్ (స్మార్ట్ హోమ్ హబ్), టేబుల్‌టాప్ రోబోట్, స్మార్ట్ రింగ్ (ఉంగరం), గూగుల్ నెస్ట్‌లకు పోటీగా కొత్త సెక్యూరిటీ డివైస్‌లను యాపిల్ లాంచ్ చేయనుందని తెలిసింది. ఇక వేరబుల్స్ విభాగంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కెమెరాలతో కూడిన స్మార్ట్ గ్లాసెస్, ఏఐ ఆధారిత ఎయిర్‌పాడ్స్, అలాగే కొత్త ఏఐ పెండెంట్ వంటి గ్యాడ్జెట్లను యాపిల్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా సెప్టెంబర్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారని తెలిసింది.
టచ్ స్క్రీన్ మ్యాక్‌బుక్, ఫోల్డబుల్ ఐప్యాడ్..
టెర్నస్ నాయకత్వంలో టచ్‌స్క్రీన్‌తో కూడిన తొలి మ్యాక్‌బుక్ ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నారని తెలిసింది. అలాగే 2028 నుంచి 2030 మధ్య అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్, 20 ఇంచ్ ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఐప్యాడ్ వంటి కొత్త ఉత్పత్తులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా ప్రొడక్ట్స్‌పై అభిమానుల్లో బజ్ నెలకొంది. అయితే ఈ ఏడాది ఫోల్డబుల్ ఐఫోన్ తోపాటు స్మార్ట్ హబ్ డివైస్ లను సెప్టెంబర్ ఈవెంట్‌లో లాంచ్ చేస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. కానీ దీనిపై యాపిల్ ఇంకా అధికారిక వివరాలను వెల్లడించలేదు. అయితే సెప్టెంబర్ ముందు నెలల వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

iPhone 17 | మదర్ప్ డే సందర్భంగా యాపిల్ సేల్.. ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు..
మే 6, 2026

Apple | యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
మే 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



