త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple iPad Air M4 | యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్ ఎం4 ట్యాబ్‌.. ధ‌ర ఎంతంటే..?

Apple iPad Air M4 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్ (8వ జ‌న‌రేష‌న్‌) ను లాంచ్ చేసింది. గ‌తేడాది రిలీజ్ అయిన ఎం3 మోడ‌ల్‌కు కొన‌సాగింపుగా ఈ ట్యాబ్‌ను విడుద‌ల చేసింది. కొత్త ఐప్యాడ్ ఎయిర్ 11, 13 ఇంచుల మోడ‌ల్స్‌లో, వైఫై, సెల్యులార్ వేరియెంట్ల‌లో ల‌భిస్తోంది. రెండింటిలోనూ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే, టాప్ బ‌ట‌న్‌లో ఇంటిగ్రేడ్ ట‌చ్ ఐడీ ఉన్నాయి.

S

Technology | Published On Mar 3, 2026, 11.27 am IST

Apple iPad Air M4 | యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్ ఎం4 ట్యాబ్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Apple iPad Air M4 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్ (8వ జ‌న‌రేష‌న్‌) ను లాంచ్ చేసింది. గ‌తేడాది రిలీజ్ అయిన ఎం3 మోడ‌ల్‌కు కొన‌సాగింపుగా ఈ ట్యాబ్‌ను విడుద‌ల చేసింది. కొత్త ఐప్యాడ్ ఎయిర్ 11, 13 ఇంచుల మోడ‌ల్స్‌లో, వైఫై, సెల్యులార్ వేరియెంట్ల‌లో ల‌భిస్తోంది. రెండింటిలోనూ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే, టాప్ బ‌ట‌న్‌లో ఇంటిగ్రేడ్ ట‌చ్ ఐడీ ఉన్నాయి. ఇక గ‌త ఐప్యాడ్ మోడ‌ల్‌లో ఎం3 చిప్ ఉండ‌గా, ఇప్పుడు ఈ మోడల్‌లో ఎం4 చిప్‌ను ఏర్పాటు చేశారు. ఐప్యాడ్ ఎయిర్ ఎం3 మోడ‌ల్‌తో పోలిస్తే ఈ మోడ‌ల్ 30 శాతం వ‌ర‌కు వేగంగా ప‌నిచేస్తుంద‌ని, ఎం1 మోడ‌ల్‌తో పోలిస్తే 2.3 రెట్లు వేగంగా ఉంటాయ‌ని యాపిల్ తెలిపింది.

సుల‌భంగా ఏఐ టాస్క్‌లు..

ఐప్యాడ్ ఎయిర్ ఎం4 మోడ‌ల్‌లో ర్యామ్‌ను 12జీబీ ఇచ్చారు. దీని వ‌ల్ల ఏఐ మోడ‌ల్స్ ప్రాసెసింగ్ వేగాన్ని పెంచుకోవ‌డంతోపాటు యాప్ విండో మేనేజ్‌మెంట్ మెరుగుపడ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. 16-కోర్ న్యూర‌ల్ ఇంజిన్‌ను ఇచ్చినందున ఆన్‌-డివైస్ ఏఐ టాస్క్‌ల‌ను వేగంగా పూర్తి చేస్తుంది. ఎం1తో పోలిస్తే మూడింత‌లు వేగంగా ప‌నిచేస్తుంది. వైఫై7, బ్లూటూత్ 6, 5 గిగాహెడ్జ్ నెట్ వ‌ర్క్‌, ఎయిర్ డ్రాప్‌, ప‌ర్స‌న‌ల్ హాట్ స్పాట్ వంటి ఫీచ‌ర్ల‌ను మెరుగు ప‌రిచేందుకు ప్ర‌త్యేకంగా ఎన్‌1 వైర్‌లెస్ చిప్‌ను ఇచ్చారు. సెల్యుల‌ర్ మోడ‌ల్స్‌లో సి1ఎక్స్ మోడెమ్ ఉంది. ఇది 5జి క‌నెక్టివిటీని అందిస్తుంది. ఇ-సిమ్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీపీఎస్ కూడా ఉంది. ఐప్యాడ్ ఎయిర్ ఎం4 లో వెనుక‌, ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఇచ్చారు. ఐప్యాడ్ ఓఎస్ 26 ఇందులో డిఫాల్ట్‌గా వ‌స్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. యాపిల్ పెన్సిల్ ప్రొ, మ్యాజిక్ కీబోర్డుకు స‌పోర్ట్‌ను ఇచ్చారు.

ధ‌ర వివ‌రాలు..

ఐప్యాడ్ ఎయిర్ ఎం4 (8వ జ‌న‌రేష‌న్‌) 2026 ట్యాబ్ ను బ్లూ, ప‌ర్పుల్‌, స్టార్ లైట్‌, స్పేస్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 11, 13 ఇంచుల మోడ‌ల్స్ 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో వైఫై, సెల్యులార్ ఆప్ష‌న్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాబ్ 11 ఇంచుల బేస్ మోడ‌ల్ ధ‌ర రూ.64,900 ఉండ‌గా, హై ఎండ్ మోడ‌ల్ ధ‌ర రూ.1,29,900గా ఉంది. 13 ఇంచుల బేస్ మోడ‌ల్ ధ‌ర రూ.84,900 ఉండగా, టాప్ మోడ‌ల్ ధర రూ.1,49,900గా ఉంది. పూర్తి ధ‌ర‌ల వివ‌రాల‌కు యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇక ఐప్యాడ్ ఎయిర్ ఎం4ను మార్చి 11 నుంచి విక్ర‌యించ‌నున్నారు. యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లేదా యాపిల్ స్టోర్స్‌, యాపిల్ ఆథ‌రైజ్డ్ రీసెల్ల‌ర్ల వ‌ద్ద ఈ ట్యాబ్ ల‌భ్యం కానుంది.

Advertisement
Advertisement