Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. మ్యాక్‌బుక్‌ల ధరలు భారీగా పెంపు..
Apple | ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు యాపిల్ షాకిచ్చింది. తన మాక్‌బుక్ శ్రేణిలో అన్ని మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ సహా అనేక దేశాల్లో యాపిల్ మాక్‌బుక్‌ల ధరలు 43 శాతం మేర పెరిగాయి.
Technology | Published On Jun 26, 2026, 10.42 am IST
Apple | ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు యాపిల్ షాకిచ్చింది. తన మాక్‌బుక్ శ్రేణిలో అన్ని మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ సహా అనేక దేశాల్లో యాపిల్ మాక్‌బుక్‌ల ధరలు 43 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కారణంగా మెమొరీ చిప్‌లకు తీవ్రమైన సరఫరా అంతరాయం ఏర్పడుతుండడంతో అనేక కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్‌డీలు, ర్యామ్‌లు వంటి ఉత్పత్తుల ధరలు దాదాపుగా రెండింతలు పెరిగాయి. దీంతో టెక్ కంపెనీలకు సైతం తమ ఉత్పత్తులకు ధరలను పెంచక తప్పడం లేదు. ఇప్పుడు అదే బాటలో యాపిల్ కూడా తన మాక్‌బుక్ లైనప్‌కు గాను ధరలను పెంచినట్లు తెలిపింది. కాగా ధరల పెంపు అనంతరం మ్యాక్ మినీ ఎం4 (24జీబీ) వేరియెంట్ ధర ఏకంగా 43 శాతం పెరగడం గమనార్హం. మ్యాక్ స్టూడియో ఎం3 అల్ట్రా ధర ఏకంగా రూ.1.70 లక్షల మేర పెరిగింది.
బేసిక్ మోడల్స్ ఇలా..
ధరల పెంపు అనంతరం పలు యాపిల్ మాక్‌బుక్ ఉత్పత్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మ్యాక్‌బుక్ నియో 256జీబీ పాత ధర రూ.69,900 ఉండగా, కొత్త ధర రూ.79,900గా ఉంది. ఈ మోడల్‌పై రూ.10వేలు పెరిగింది. మొత్తం 14.30 శాతం పెంపు నమోదైంది. మ్యాక్‌బుక్ నియో 512జీబీ మోడల్ పాత ధర రూ.79,900 ఉండగా కొత్త ధర రూ.89,900గా ఉంది. ధర రూ.10వేలు పెరగ్గా, పెంపు 12.50 శాతంగా ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ 13 ఎం5 (8 కోర్ జీపీయూ) పాత ధర రూ.1,19,900 ఉండగా, కొత్త ధర రూ.1,49,900గా ఉంది. రూ.30వేలు పెరగ్గా, పెంపు 25 శాతంగా ఉంది. ఇదే ల్యాప్‌టాప్‌లో 10 కోర్ జీపీయూ మోడల్ పాత ధర రూ.1,29,900 ఉండగా, కొత్త ధర రూ.1,61,900గా ఉంది. మొత్తం రూ.32వేలు పెరగ్గా, పెంపు రూ.24.6 శాతంగా ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ 15 ఎం5 బేసిక్ మోడల్ ధర రూ.1,49,900 ఉండగా ఇప్పుడది రూ.1,79,900కు చేరింది. రూ.30వేలు పెరగ్గా, 20 శాతం పెంపు నమోదైంది.
ప్రొ సిరీస్ అయితే..
మ్యాక్ బుక్ ప్రొ 14 ఇంచుల బేసిక్ మోడల్ పాత ధర రూ.1,89,900 ఉండగా, కొత్త ధర రూ.2,39,900గా ఉంది. రూ.50వేలు పెరిగింది. మ్యాక్‌బుక్ ప్రొ 16 ఇంచుల బేసిక్ మోడల్ పాత ధర రూ.4,29,900 ఉండగా, కొత్త ధర రూ.5,39,900గా ఉంది. రూ.1.10 లక్షలు పెరిగింది. మ్యాక్ మినీ ఎం4 బేసిక్ మోడల్ పాత ధర రూ.79,900 ఉంగా, కొత్త ధర రూ.94,900గా ఉంది. రూ.15వేలు పెరిగింది. మ్యాక్ మినీ ఎం4 ప్రొ ధర రూ.1,49,900 ఉండగా, రూ.1,99,900కు చేరింది. రూ.50వేలు పెరిగింది. మ్యాక్ స్టూడియో ఎం4 మ్యాక్స్ ధర రూ.2,14,900 నుంచి రూ.2,79,900కి చేరింది. మ్యాక్ స్టూడియో ఎం3 రూ.4,29,900 నుంచి రూ.5,99,900కి చేరింది. రూ.1.70 లక్షలు పెరిగింది.
అధికారిక వేదికల్లోనే..
అయితే అమెరికా మార్కెట్‌లో గరిష్టంగా 18 శాతం పెరుగుదల నమోదు చోటు చేసుకుంది. భారత్‌లో విదేశీ కంపెనీల ఉత్పత్తులపై దిగుమతి, ఇతర పన్నులు ఉంటాయి కనుక ఇక్కడ ధరలు మరీ భారీగా పెరిగాయి. యాపిల్ ఒక ప్రామాణిక ఎంఆర్‌పీని నిర్ణయించినప్పటికీ దేశంలో పలు థర్డ్ పార్టీ రిటెయిలర్లు ఎల్లప్పుడూ డిస్కౌంట్ ధరలకే ఈ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తారు. కనుక యాపిల్ అధికారిక స్టోర్స్ లేదా ఆన్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేసే వారికే పైన తెలిపిన ధరలు వర్తిస్తాయి. అయితే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ తగ్గింపు ధరలకు పొందవచ్చు.
సంబంధిత వార్తలు

Mozilla | మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కొత్త ఏఐ ఫీచర్.. ఫోన్ షేక్ చేస్తే వెబ్‌పేజీ సారాంశం సిద్ధం..
జూన్ 25, 2026

Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..
జూన్ 23, 2026

TecSox Moon | కేవలం రూ.599కే వైర్లెస్ ఇయర్ బడ్స్.. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..
- ●Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు
- ●July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
- ●Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక
- ●Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ నమోదు
- ●Mother attack on Child | అమానుషం.. చిన్నారిని కాలితో తన్నిన తల్లి.. వీడియో

Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..

Venezuela Earthquake | వెనిజులా భూకంపం.. 235 మంది మృతి, 40 వేల మంది ఆచూకీ గల్లంతు

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..

Rain Alert | మరి కాసేపట్లో హైదరాబాద్‌లో వర్షం.. తెలంగాణ వెదర్‌మ్యాన్ హెచ్చరిక



