త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | యాపిల్ యూజ‌ర్ల‌కు అదిరిపోయే ఫీచ‌ర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించ‌డం ఇక ఈజీ, వినికిడి ప‌రీక్ష‌ను స్వ‌యంగా చేసుకోవ‌చ్చు..

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఎట్ట‌కేల‌కు అత్యంత కీలకమైన రెండు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై భార‌త్‌లోని యాపిల్ వాచ్ యూజర్లు స్లీప్ అప్నియా నోటిఫికేషన్లు పొందవ‌చ్చు. అదే సమయంలో ఎయిర్‌పాడ్స్ ప్రో వినియోగదారులు ఇంట్లోనే తమ వినికిడి స్థాయిని పరీక్షించుకునే కొత్త హియరింగ్ టెస్ట్ టూల్‌ను ఉపయోగించవచ్చు.

S

Technology | Published On May 21, 2026, 3.43 pm IST

Apple | యాపిల్ యూజ‌ర్ల‌కు అదిరిపోయే ఫీచ‌ర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించ‌డం ఇక ఈజీ, వినికిడి ప‌రీక్ష‌ను స్వ‌యంగా చేసుకోవ‌చ్చు..
Advertisement

Apple | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఎట్ట‌కేల‌కు అత్యంత కీలకమైన రెండు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై భార‌త్‌లోని యాపిల్ వాచ్ యూజర్లు స్లీప్ అప్నియా నోటిఫికేషన్లు పొందవ‌చ్చు. అదే సమయంలో ఎయిర్‌పాడ్స్ ప్రో వినియోగదారులు ఇంట్లోనే తమ వినికిడి స్థాయిని పరీక్షించుకునే కొత్త హియరింగ్ టెస్ట్ టూల్‌ను ఉపయోగించవచ్చు. యాపిల్ వాచ్‌లో కొత్తగా వచ్చిన స్లీప్ అప్నియా డిటెక్షన్ నోటిఫికేషన్ ఫీచర్, యూజర్ నిద్రలో ఉన్నప్పుడు శ్వాసలో వచ్చే అంతరాయాలకు సంబంధించిన చేతి మణికట్టు కదలికలను యాక్సిలరోమీటర్ ద్వారా గుర్తిస్తుంది. స్లీప్ అప్నియా అంటే.. నిద్రలో శ్వాస పలుమార్లు ఆగిపోవడం, మళ్లీ ప్రారంభమవడం వంటి సమస్య. చాలా మందికి ఈ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు. యాపిల్ తెలిపిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నార‌ని తేలింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే హైపర్‌టెన్షన్, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది.

ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే నోటిఫికేష‌న్‌..

కొత్త ఫీచర్ ద్వారా యాపిల్ వాచ్ 30 రోజుల పాటు శ్వాస సంబంధిత డేటాను విశ్లేషించి, మోస్తరు లేదా తీవ్రమైన స్లీప్ అప్నియా లక్షణాలు కనిపిస్తే యూజర్‌కు నోటిఫికేషన్ పంపిస్తుంది. అలాగే గత మూడు నెలల శ్వాస అంతరాయాల ట్రెండ్స్‌తో కూడిన పీడీఎఫ్ రిపోర్ట్‌ను కూడా రూపొందించుకోవచ్చు. ఈ రిపోర్ట్‌ను వైద్యులకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ యాప్‌లో యూజర్లు ఒక నెల, ఆరు నెలలు, ఒక సంవత్సరం కాలానికి సంబంధించిన రాత్రి సమయంలో శ్వాస అంతరాయాల డేటాను కూడా చూడవచ్చు. అలాగే స్లీప్ అప్నియా గురించి అవగాహన కలిగించే ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్లీప్ అప్నియా అల్గోరిథమ్‌ను అడ్వాన్స్‌డ్ మెషిన్ లెర్నింగ్, క్లినికల్ గ్రేడ్ స్లీప్ అప్నియా టెస్టుల డేటాతో అభివృద్ధి చేసినట్లు యాపిల్ వెల్లడించింది. క్లినికల్ స్టడీలో అల్గోరిథమ్ గుర్తించిన ప్రతి యూజర్‌లో కనీసం మైల్డ్ స్లీప్ అప్నియా ఉన్నట్లు నిర్ధారణ అయింద‌ని కంపెనీ తెలిపింది.

స్వ‌యంగా వినికిడి ప‌రీక్ష చేసుకోవ‌చ్చు..

యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో కోసం కొత్త క్లినికల్ గ్రేడ్ హియరింగ్ టెస్ట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెస్ట్ ద్వారా యూజర్లు ఇంట్లోనే సుమారు 5 నిమిషాల్లో తమ వినికిడి స్థాయిని పరీక్షించుకోవచ్చు. ఈ టెస్ట్ ప్యూర్-టోన్ ఆడియోమెట్రీ అనే క్లినికల్ విధానంపై ఆధారపడి ఉంటుంది. యూజర్లు తమ ఎయిర్‌పాడ్స్ ప్రోతోపాటు కంపాటిబుల్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ ఉపయోగించి ఈ పరీక్ష చేసుకోవచ్చు. టెస్ట్ పూర్తయ్యాక ప్రతి చెవిలో వినికిడి లోపం స్థాయి, క్లాసిఫికేషన్, సూచనలు వంటి వివరాలతో కూడిన సమ్మ‌రీ అందుతుంది. అలాగే ఆడియోగ్రామ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ ఫలితాలు హెల్త్ యాప్‌లో సేవ్ అవుతాయి. అవసరమైతే వైద్యులతో షేర్ చేసుకోవచ్చు. యాపిల్ తెలిపిన వివరాల ప్రకారం హియరింగ్ టెస్ట్ ఫీచర్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2, ఆపై మోడళ్లలో మాత్రమే పనిచేస్తుంది. అలాగే పెయిర్ చేసిన ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఐఓఎస్ 18 లేదా ఐప్యాడ్‌ఓఎస్ 18 లేదా అంతకంటే పైన‌ వెర్షన్ ఉండాలి.

ఈ ఫీచర్ల ప్రారంభంపై యాపిల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ వైస్ ప్రెసిడెంట్ సుంబుల్ దేశాయ్ మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యంపై నియంత్రణ సాధించగలగాల‌ని యాపిల్ నమ్ముతుంద‌ని తెలిపారు. చాలా మందికి తెలియని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే సాధనాలను అందించడం త‌మ‌ లక్ష్యం అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement