Apple | 50 ఏళ్లు పూర్తి చేసుకున్న యాపిల్.. ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్లు..
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్స్‌లో పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మోడళ్లపై పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్‌లను ఇస్తున్నారు.
Technology | Published On Apr 3, 2026, 4.26 pm IST
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్స్‌లో పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మోడళ్లపై పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్‌లను ఇస్తున్నారు. అలాగే ప్రీమియం ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌ను భారీ డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు. ఇక ఇతర మోడళ్లపై సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రొ..
ఈ సేల్‌లో భాగంగా 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ను రూ. 1,49,900 కు బదులుగా భారీ డిస్కౌంట్‌తో రూ. 1,02,900కి అందిస్తున్నారు. రూ. 1వేయి ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 4వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 6వేలు ఎక్స్చేంజ్ బోనస్, అలాగే అర్హత ఉన్న పాత ఫోన్లపై రూ. 36వేల వరకు ఎక్స్చేంజ్ విలువ అన్నీ కలిపి ఆ డిస్కౌంట్ వర్తిస్తుంది. కాగా 256జీబీ ఐఫోన్ 17 ప్రొ కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్ అనంతరం రూ. 89,900 కు లభిస్తోంది. అయితే దీనిపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్రయోజనం లేదు, కానీ ఇతర క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్..
ఇక ఐఫోన్ 17 రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 256జీబీ మోడల్ అసలు ధర రూ. 82,900 కాగా, ఆఫర్ తరువాత ధర రూ. 37,900కి తగ్గింది. 512జీబీ వేరియంట్ ధర రూ. 1,02,900 నుంచి రూ. 57,900కు చేరింది. రూ. 1వేయి ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 3వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 6వేలు ఎక్స్చేంజ్ బోనస్, అలాగే రూ. 35వేల వరకు ఎక్స్చేంజ్ విలువ అన్నీ కలిపి ఈ డిస్కౌంట్ ఉంటుంది. ఇక ఐఫోన్ ఎయిర్ ను కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్ ధరకు ఇస్తున్నారు. 256జీబీ వేరియంట్ రూ. 56,900కి, 512జీబీ మోడల్ రూ. 76,900కి లభిస్తున్నాయి. అదనంగా వినియోగదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈఎంఐలు రూ. 3,413 నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్‌లపై..
టాబ్లెట్ విభాగంలో ఐప్యాడ్ (2025) వైఫై 128జీబీ మోడల్ ధర రూ. 34,900 నుంచి రూ. 31,900కి తగ్గింది. వైఫై + సెల్యులార్ వేరియంట్ రూ. 49,900 నుంచి రూ. 46,900కి తగ్గింది. అలాగే ఐప్యాడ్ ప్రొ (ఎం5) 11-ఇంచ్ (256జీబీ, వైఫై) మోడల్ రూ. 94,900కు, 13-ఇంచ్ మోడల్ రూ. 1,24,900కు అందుబాటులో ఉన్నాయి. వియరబుల్స్ విభాగంలో యాపిల్ వాచ్ అల్ట్రా 3 ధర రూ. 89,900 నుంచి రూ. 84,400కి తగ్గింది. రూ. 2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 3వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపి ఈ డిస్కౌంట్‌లో ఉన్నాయి. ఇతర మోడళ్లలో యాపిల్ వాచ్ సిరీస్ 11 రూ. 43,400కి, యాపిల్ వాచ్ ఎస్ఈ 3 రూ. 22,900కి లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఆఫర్లను యాపిల్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించామని, వినియోగదారులకు ప్రీమియం పరికరాలను తక్కువ ధరలో పొందేందుకు ఇది మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
జులై 22, 2026

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్.. ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా మళ్లీ సెటిల్..
జులై 18, 2026
తాజావార్తలు
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు
- ●Hardik Pandya | పాండ్యాపై కన్నేసిన చెన్నైకి.. ముంబయి ఇండియన్స్‌తో డీల్‌పై సీఎస్కే ఆసక్తి..!
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు



