Apple | నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ నిర్వహించనుంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో సర్‌ప్రైజ్ అండ్ షైన్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా యాపిల్ తన నూతన ఉత్పత్తులను రిలీజ్ చేయనుంది.
Technology | Published On Sep 9, 2026, 5.14 pm IST
Apple | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ రిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ నిర్వహించనుంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో సర్‌ప్రైజ్ అండ్ షైన్ పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా యాపిల్ తన నూతన ఉత్పత్తులను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 18 సిరీస్‌లోని ఐఫోన్ 18 ప్రొ, ప్రొ మ్యాక్స్ తోపాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాను సంస్థ లాంచ్ చేస్తుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 12 స్మార్ట్ వాచ్‌లను సైతం ఇందులో భాగంగా యాపిల్ లాంచ్ చేయనుంది. కాగా యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ అల్ట్రాకు సంబంధించిన ఫీచర్లు, ధర ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర భారత కరెన్సీలో రూ.2.50 లక్షలుగా ఉండనుందని సమాచారం. టాప్ ఎండ్ వేరియెంట్ ధర రూ.2.80 లక్షల వరకు ఉంటుందని తెలిసింది.
ఈసారి ఐఫోన్ల ధరలు భారీగానే..?
యాపిల్ ఈసారి విడుదల చేయనున్న ఐఫోన్ మోడల్స్ బేస్ వేరియెంట్లన్నీ కనీసం 256జీబీ స్టోరేజ్‌తోనే వస్తాయని సమాచారం. మెమొరీ చిప్‌ల కొరత కారణంగా ఈసారి ఐఫోన్ల ధరలు కూడా భారీగానే ఉండనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇతర కంపెనీలు ఫోన్ల ధరలను పెంచిన నేపథ్యంలో యాపిల్ కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఫోన్లకు గతంలో డిమాండ్ తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం అధునాతన ఫీచర్లు, పెరిగిన బ్యాటరీ బ్యాకప్ ఇస్తుండడంతో వినియోగదారుల అభిరుచి కూడా మారుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఫోల్డబుల్ ఫోన్లలో బిల్డ్ క్వాలిటీ చాలా నాణ్యంగా ఉండడంతోపాటు లార్జ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరాలు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని వెల్లడైంది. అలాగే ఏఐతో ఈ ఫోన్లను మరింత అడ్వాన్స్‌డ్‌గా అందిస్తుండడంతో వినియోగదారులు ఈ ఫోన్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
ఐఫోన్ అల్ట్రా ఫీచర్లు ఎలా ఉండనున్నాయి..?
కాగా శాంసంగ్ ఇప్పటికే జడ్ ఫోల్డ్ 8 పేరిట ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లను రిలీజ్ చేయగా, యాపిల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. వినియోగదారుల బేస్‌ను కాపాడుకునే ఉద్దేశంతో యాపిల్ ఈ చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. ఫోల్డబుల్ ఐఫోన్‌కు ఐఫోన్ అల్ట్రా లేదా ఐఫోన్ డ్యుయో పేరిట నామకరణం చేసినట్లు సమాచారం. మల్టీ టాస్కింగ్ కోసం మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండేలా ఈ ఫోన్‌ను అందించనున్నట్లు తెలిసింది. ఇందులో యాపిల్‌కు చెందిన సొంత ఎ20 ప్రొ ప్రాసెసర్, సి2 మోడెమ్, వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెమెరాలు రెండు, ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయని సమాచారం. అలాగే మాగ్నెటిక్ హింజ్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్‌ను కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైట్, డార్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. దీన్ని అక్టోబర్‌లో విక్రయిస్తారని తెలుస్తోంది.

ఐఫోన్ 18 సిరీస్‌లో..
ఐఫోన్ 18 సిరీస్‌లో యాపిల్ ఐఫోన్ 18 ప్రొ, 18 ప్రొ మ్యాక్స్ పేరిట రెండు మోడల్స్‌ను మాత్రమే రిలీజ్ చేయనుందని, సాధారణ మోడల్‌ను లాంచ్ చేయదని తెలుస్తోంది. క్యాండీ బార్ డిజైన్‌లోనే ఈ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారని సమాచారం. గత మోడల్స్‌తో పోలిస్తే వీటి డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవని తెలిసింది. ఇక గతేడాది ఇచ్చిన ఆరెంజ్‌కు బదులుగా బర్గండీ రెడ్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అందిస్తారని తెలుస్తోంది. ఈ ఫోన్లలోనూ యాపిల్ ఎ20 ప్రొ ప్రాసెసర్‌ను అందించనున్నారని సమాచారం. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉండేలా ప్రత్యేక వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్, డైనమిక్ ఐల్యాండ్‌లో మూడు లైవ్ యాక్టివిటీలకు అనుమతి వంటి ఫీచర్లను వీటిల్లో అందించనున్నారని తెలుస్తోంది. వీటి ప్రారంభ ధర గతేడాది మోడల్స్ కన్నా సుమారుగా 200 డాలర్లు అధికంగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
సీఈవోగా జాన్ టెర్నస్‌కు తొలి ఈవెంట్..
ఇక ఈసారి యాపిల్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యాపిల్‌కు దశాబ్దాలుగా సీఈవోగా సేవలు అందించిన టిమ్ కుక్ ఇప్పటికే ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన సీఈవో అయ్యాక తొలి యాపిల్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దీంతో ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈవెంట్‌లో ఆనఖ టెర్నస్ తమ సంస్థ కొత్త ఉత్పత్తులను ఎలా పరిచయం చేయబోతున్నారో వీక్షించేందుకు యాపిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో మాజీ సీఈవో టిమ్ కుక్ కూడా పాల్గొంటారని సమాచారం. అయితే ఆయన స్టేజ్‌పై కాకుండా ప్రేక్షకుల మధ్య కూర్చుంటారని తెలుస్తోంది. యాపిల్ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:30 గంటలకు నిర్వహించనుండగా, యాపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ నుంచి కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. యాపిల్ అధికారిక ఈవెంట్స్ వెబ్‌సైట్, యూట్యూబ్ చానల్, సఫారి బ్రౌజర్, యాపిల్ టీవీ యాప్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
- ●E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
- ●Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
- ●Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి
- ●Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
- ●Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్

Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి






