Apple Creator Studio Subscription Suite | క్రియేటర్ల కోసం యాపిల్ సరికొత్త ప్లాన్.. నెలకు రూ.400కే 8 సాఫ్ట్‌వేర్లు వాడుకోవచ్చు..
Apple Creator Studio Subscription Suite | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ క్రియేటర్ల కోసం ఓ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెలకు కేవలం రూ.400 చెల్లిస్తే చాలు, యాపిల్ అందిస్తున్న 8 సాఫ్ట్ వేర్లను వాడుకోవచ్చు. అడోబ్ కు చెందిన క్రియేటివ్ సూట్‌ను వాడుకోవాలంటే ప్రస్తుతం యూజర్లకు నెలకు రూ.2వేల వరకు ఖర్చవుతోంది.
Technology | Published On Jan 16, 2026, 10.23 am IST
Apple Creator Studio Subscription Suite | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ క్రియేటర్ల కోసం ఓ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నెలకు కేవలం రూ.400 చెల్లిస్తే చాలు, యాపిల్ అందిస్తున్న 8 సాఫ్ట్ వేర్లను వాడుకోవచ్చు. అడోబ్ కు చెందిన క్రియేటివ్ సూట్‌ను వాడుకోవాలంటే ప్రస్తుతం యూజర్లకు నెలకు రూ.2వేల వరకు ఖర్చవుతోంది. కానీ అలాంటి టూల్స్‌నే యాపిల్ చాలా తక్కువ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు అందిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే యాపిల్ కొత్తగా క్రియేటర్ స్టూడియో సబ్‌స్క్రిప్షన్ సూట్ పేరిట ఓ నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సూట్‌లో ఉన్న సాఫ్ట్ వేర్లను యూజర్లు తమకు చెందిన మాక్, ఐప్యాడ్, ఐఫోన్లలో వేటిలో అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ సూట్‌లో Final Cut Pro, Logic Pro, Pixelmator Pro వంటి ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్లతో పాటు, యాపిల్ ప్రొడక్టివిటీ సాఫ్ట్ వేర్లకు సంబంధించిన ప్రీమియం ఫీచర్లు, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ కూడా ఉన్నాయి.
జనవరి 28 నుంచి అందుబాటులోకి..
యాపిల్ తన క్రియేటర్ స్టూడియో సబ్‌స్క్రిప్షన్ సూట్ ప్లాన్‌ను జనవరి 28వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యూజర్లు వీడియో, ఆడియో, ఇమేజింగ్ వంటి అన్ని టూల్స్‌ను ఒకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో వాడుకోవచ్చు. దీని వల్ల యూజర్లకు ఎంతో వ్యయం తగ్గనుండడంతోపాటు అడోబ్ అందిస్తున్న క్రియేటివ్ సూట్ ప్లాన్‌కు ఈ యాపిల్ ప్లాన్ గట్టి పోటీనిస్తుందని అంటున్నారు. యాపిల్ క్రియేటర్ స్టూడియో సబ్‌స్క్రిప్షన్ సూట్ లో Final Cut Pro లభిస్తుంది. దీన్ని యూజర్లు మాక్ లేదా ఐప్యాడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. అలాగే Motion, Compressor అనే టూల్స్ కూడా మాక్ యూజర్లకు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్లాన్‌లో Logic Pro టూల్‌ను కూడా అందిస్తున్నారు. ఇది కూడా మాక్, ఐప్యాడ్‌లపై అందుబాటులో ఉంది. అలాగే మెయిన్ స్టేజ్ అనే మరో టూల్‌ను కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందిస్తున్నారు.

ఏఐతో ఇంటిగ్రేషన్..
ఇక ఇమేజింగ్ టూల్స్‌లో Pixelmator Pro ను ఈ ప్లాన్‌లో భాగం చేశారు. ఇది కూడా మాక్, ఐప్యాడ్‌లపై అందుబాటులో ఉంది. అలాగే ప్రొడక్టివిటీలో Keynote, Pages, Numbers, Freeform వంటి యాప్స్‌కు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అందించే Final Cut Pro ను యూజర్లు మరింత వేగంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందులో వర్క్‌ఫ్లో వేగం, ఆటోమేషన్‌ను మెరుగుపరిచే కొత్త ఫీచర్లను కూడా చేర్చారు. ఇక యాపిల్ అందిస్తున్న ఈ ప్లాన్‌లోని ప్రొడక్టివిటీ యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్లలో ఏఐ ని ఇంటిగ్రేట్ చేశారు. కనుక ఆయా టూల్స్‌ను ఉపయోగించేటప్పుడు యూజర్లు అవసరం అనుకుంటే ఏఐ సహాయం తీసుకోవచ్చు. దీని వల్ల పని మరింత సులభతరం అవుతుంది.
విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్..
కాగా యాపిల్ క్రియేటర్ స్టూడియో సబ్‌స్క్రిప్షన్ సూట్ జనవరి 28 నుంచి అందుబాటులోకి రానుండగా, దీన్ని మాక్ లేదా ఐప్యాడ్, ఐఫోన్‌లో ఉండే యాపిల్ యాప్ స్టోర్‌లో పొందవచ్చు. నెలకు రూ.399 సాధారణ ప్లాన్‌ను, ఏడాదికి రూ.3,999 కు వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తున్నారు. ఇక స్టూడెంట్లు, ఉపాధ్యాయులు నెలకు రూ.199 చెల్లిస్తే చాలు. అదే ఏడాదికి అయితే వార్షిక ప్లాన్ రూ.1,999 మాత్రమే అవుతుంది. ఈ క్రమంలో కొత్త యూజర్లు ఈ ప్లాన్లను ఒక నెల రోజుల పాటు ఉచితంగా ట్రయల్ కూడా చూడవచ్చు. నచ్చితే నెల రోజుల తరువాత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనసాగించవచ్చు.

వన్ టైమ్ పర్చేజ్ కూడా అందుబాటులో..
అయితే కేవలం నెలవారి లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూపంలోనే కాకుండా ఈ యాప్‌లు లేదా సాఫ్ట్ వేర్లు వన్ టైమ్ పర్చేజ్ కింద కూడా యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. నెలవారి లేదా వార్షిక ప్లాన్ వద్దనుకునేవారు, ఒకేసారి ఈ సాఫ్ట్ వేర్లను కొనుగోలు చేస్తామని అనుకునే వారు నిర్దిష్టమైన ధరలకు ఈ సాఫ్ట్‌వేర్లను తీసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయా సాఫ్ట్ వేర్ల ధరలు యాప్ స్టోర్‌లో ఇలా ఉన్నాయి. ఫైనల్ కట్ ప్రొను రూ.29,900కు కొనుగోలు చేయవచ్చు. లాజిక్ ప్రొ అయితే రూ.19,900గా ఉంది. పిక్సెల్‌మేటర్ ప్రొ ధర రూ.999 ఉండగా, మోషన్ టూల్‌ను రూ.4,900కు ఇస్తున్నారు. అలాగే కంప్రెసర్ టూల్ ధర రూ.4,999గా ఉంది. మెయిన్ స్టేజ్ టూల్‌ను రూ.2,999కు కొనవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‌లను వన్ టైమ్ పర్చేజ్ కింద కొనుగోలు చేస్తే లైసెన్స్ లైఫ్‌టైమ్ వరకు ఉంటుంది. కనుక మళ్లీ మళ్లీ వీటికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని ఉండదు. జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. లైసెన్స్ రెన్యువల్ కూడా ఉండదు. కానీ కొంత కాలం వరకు మాత్రమే వాడుతామని అనుకునే వారు నెలవారి లేదా వార్షిక ప్లాన్‌లను తీసుకుంటే సరిపోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..
జులై 25, 2026

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
జులై 22, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



