Apple Car Key | ఇకపై యాపిల్ ఐఫోన్ లేదా వాచ్ ఉంటే చాలు.. కారును అన్ లాక్ చేసి స్టార్ట్ చేయవచ్చు..
Apple Car Key | ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక కార్ మోడల్స్‌లో అద్భుతమైన ఫీచర్లను తయారీ కంపెనీలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో ఫీచర్ల సంఖ్య మరింత పెరిగింది. అయితే టాటా ఎలక్ట్రిక్ కార్లను వాడేవారికి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ శుభవార్త చెప్పనుందని సమాచారం.
Technology | Published On Apr 21, 2026, 5.11 pm IST
Apple Car Key | ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక కార్ మోడల్స్‌లో అద్భుతమైన ఫీచర్లను తయారీ కంపెనీలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో ఫీచర్ల సంఖ్య మరింత పెరిగింది. అయితే టాటా ఎలక్ట్రిక్ కార్లను వాడేవారికి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ శుభవార్త చెప్పనుందని సమాచారం. ఇకపై ఆ కార్లను యాపిల్ ఐఫోన్ లేదా వాచ్ తో అన్‌లాక్ చేయవచ్చు. దీని వల్ల భౌతిక కీ అవసరం ఉండదు. అలాగే ఆ కీ ని ఇతర ఐఫోన్ వినియోగదారులతో వాహనదారులు పంచుకోవచ్చు. దీని వల్ల కార్ తాళం లేనివారు కూడా యజమాని షేర్ చేస్తే దాంతో కారును అన్‌లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కార్ల వినియోగదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు మాక్ రూమర్స్ ఓ నివేదికను విడుదల చేసింది.
మొత్తం 13 కంపెనీల కార్లకు..
యాపిల్‌కు చెందిన బ్యాకెండ్ డేటాను పేర్కొంటూ మాక్ రూమర్స్ ఆ వివరాలను తెలియజేసింది. వాటి ప్రకారం ఇకపై టాటా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్)లకు భౌతిక కీ అవసరం ఉండదు. యాపిల్ వాచ్ లేదా ఐఫోన్ ఉంటే చాలు, కారు అన్‌లాక్ అవుతుంది. ఈ మేరకు యాపిల్ ఈ ఫీచర్‌ను ప్రస్తుతం అంతర్గంతగా పరీక్షిస్తోంది. అయితే యాపిల్ అందుబాటులోకి తేనున్న ఈ కార్ కీ ఇంటిగ్రేషన్ ఫీచర్‌ను పలు ఇతర కార్లకు కూడా ఆయా తయారీదార్లు అందించనున్నారు. వాటిల్లో టాటా మాత్రమే కాకుండా BMW, జెనెసిస్, కియా, హ్యుందాయ్, లోటస్, మెర్సిడెస్, వోల్వో వంటి మొత్తం 13 కంపెనీల కార్లు కూడా ఉన్నాయి. అయితే ఆయా కంపెనీలకు చెందిన ఏయే వాహనాలకు కార్ కీ ఫీచర్‌ను అందించనున్నారనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. కానీ అతి త్వరలోనే దీన్ని వాహనదారులకు అందించనున్నారు.
ముందుగా రిజిస్టర్ చేయాలి..
యాపిల్ అందించనున్న కార్ కీ ఫీచర్ సహాయంతో వాహనదారులు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను కార్ డోర్ హ్యాండిల్ దగ్గర ఉంచితే చాలు, వెంటనే కారు అన్‌లాక్ అవుతుంది. అయితే ముందుగా కార్ కీ ఫీచర్‌ను వాహనదారులు తమ ఐఫోన్‌లో సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ ఐఫోన్‌లో ఉండే యాపిల్ వాలెట్ యాప్‌లోకి వెళ్లి కారును లాక్, అన్ లాక్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి కార్ కీ ని ముందుగా రిజస్టర్ చేయాలి. తరువాత భౌతిక కీ అవసరం లేకుండానే కేవలం ఐఫోన్ లేదా యాపిల్ వాచ్ ద్వారా కారును అన్‌లాక్ చేసి ప్రయాణించవచ్చు. కార్లలో ఎన్ఎఫ్‌సీ రీడర్ అనే కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఈ సదుపాయం పనిచేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను యాపిల్ తొలుత 2022లో ప్రవేశపెట్టినా విస్తృత కార్ మోడల్స్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ దీనికి మరిన్ని మెరుగులు దిద్ది ఒకేసారి అధిక మొత్తంలో కార్ మోడల్స్ కు ఈ ఫీచర్‌ను అందించేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది.

ఇలా అన్‌లాక్ అవుతుంది..
కార్ కీని రిజిస్టర్ చేసిన తరువాత వాహనదారులు కారును అన్ లాక్ చేసేందుకు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌ను కారు డోర్ హ్యాండిల్ దగ్గర ఉంచి పట్టుకోవాలి. దీంతో కారు అన్‌లాక్ అవుతుంది. కార్లలో అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ ద్వారా ఈ ఫీచర్‌ను అందించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఫోన్‌ను జేబులో నుంచి బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. కారు దగ్గరకు చేరగానే ఆటోమేటిక్‌గా అది అన్ లాక్ అవుతుంది. అలాగే కారు లోపల కూర్చోగానే స్టార్ట్ కూడా అవుతుంది. అయితే ఈ ఫీచర్లు కార్ మోడల్‌ను బట్టి స్వల్ప మార్పులతో లభిస్తాయి. ఈ వివరాలను యాపిల్ సంస్థ ఇప్పటికే తన సపోర్ట్ పేజీలో వెల్లడించింది.
ఇతరులకు షేర్ చేయవచ్చు..
యాపిల్ కార్ కీ ఫీచర్‌ను ఉపయోగించి కారు కీని యాపిల్ వాలెట్‌లో యాడ్ చేసినప్పుడు ఎక్స్‌ప్రెస్ మోడ్ అనే సదుపాయం కూడా లభిస్తుంది. దీంతో వాహనదారులు ఎమర్జెన్సీ సమయాల్లో ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే కారును అన్‌లాక్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫీచర్ ను కాస్త ఆలస్యంగా అందివ్వనున్నారు. ఇక యాపిల్ వాలెట్‌లో సేవ్ అయి ఉండే కార్ కీలను ఐఓఎస్ ఎకో సిస్టమ్ ఎయిర్ డ్రాప్ ఫీచర్ ద్వారా ఇతర ఐఫోన్ వినియోగదారులకు షేర్ చేయవచ్చు. దీంతో ఆ కీని పొందిన మరో వాహనదారుడు దాన్ని తన యాపిల్ వాలెట్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ వాహనదారుడు కూడా ఆ కారును యాక్సెస్ చేయవచ్చు. ఇలా ఫిజికల్ కీస్ అవసరం లేకండా కీస్ ను డిజిటల్ రూపంలో షేర్ చేసుకుని ప్రయోజనం పొందవచ్చు. కాగా కార్ కీ ఫీచర్‌ను ఐఫోన్ 11 లేదా ఆ తరువాత వచ్చిన ఐఫోన్ మోడల్స్‌లో, యాపిల్ వాచ్ సిరీస్ 6 లేదా ఆ తరువాత వచ్చిన యాపిల్ వాచ్ మోడల్స్‌లో మాత్రమే అందించనున్నారు.
సంబంధిత వార్తలు

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
జులై 28, 2026

iPad Vs Laptop | ఐప్యాడ్, ల్యాప్‌టాప్.. రెండింటిలో ఏది ఉత్తమ ప్రదర్శన ఇస్తుంది.. దేన్ని కొనాలి..?
జులై 23, 2026

Apple Upgrade | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఐఫోన్లను కావల్సినన్ని రోజులు అద్దెకు తీసుకోవచ్చు..
జులై 22, 2026
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్



