Apple Business Platform | వ్యాపారులు, సంస్థల కోసం యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్.. కార్యకలాపాలు మరింత సులువుగా..
Apple Business Platform | వ్యాపారులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర చిన్న కంపెనీలు సైతం సులభంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ కొత్తగా యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఆయా సంస్థలకు అవసరమైన ఆలిన్ వన్ టూల్స్ లభిస్తాయని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
Technology | Published On Mar 25, 2026, 11.58 am IST
Apple Business Platform | వ్యాపారులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర చిన్న కంపెనీలు సైతం సులభంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ కొత్తగా యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఆయా సంస్థలకు అవసరమైన ఆలిన్ వన్ టూల్స్ లభిస్తాయని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో డివైస్‌లను మేనేజ్ చేయడం, ఈ-మెయిల్, క్యాలెండర్ సేవలు, బ్రాండ్, లొకేషన్ మేనేజ్‌మెంట్, స్థానిక వినియోగదారులను రీచ్ అయ్యేందుకు నూతన మార్గాలు తదితర సేవలను అందిస్తున్నట్లు యాపిల్ తెలియజేసింది. దీని వల్ల సంస్థల టెక్నాలజీ వినియోగం సులభతరం అవుతుందని, ఉద్యోగుల ఉత్పాదకతను మరింతగా పెంచవచ్చని స్పష్టం చేసింది. సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన టూల్స్ అన్నింటినీ ఈ ప్లాట్‌ఫామ్‌లో ఒకే వేదికపై అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇంటిగ్రేటెడ్ మొబైల్ డివైస్ మేనేజ్‌మెంట్..
యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో ఇంటిగ్రేటెడ్ మొబైల్ డివైస్ మేనేజ్‌మెంట్ (ఎండీఎం) ఫీచర్ ఉంది. దీని సహాయంతో డివైస్‌లు, సెట్టింగ్స్, యాప్‌లను ఒకేసారి నియంత్రించవచ్చు. బ్లూ ప్రింట్స్ అనే ఫీచర్ ద్వారా ముందుగానే కాన్ఫిగర్ చేసిన సెట్టింగ్స్, యాప్‌లను జీరో టచ్ విధానంలో ఆపరేట్ చేయవచ్చు. మేనేజ్డ్ యాపిల్ అకౌంట్స్ ద్వారా సంస్థ డేటాను ఉద్యోగుల వ్యక్తిగత డేటా నుంచి వేరు చేసి స్టోర్ చేస్తుంది. అలాగే గూగుల్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడీ తదితర ప్లాట్‌ఫామ్‌లకు ఇందులో సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.
ఉద్యోగుల నిర్వహణ సులభం..
యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగుల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. యూజర్ గ్రూపులను క్రియేట్ చేయడం, యాప్‌లు, వాటిల్లో ఉద్యోగులకు వర్క్ రోల్ కేటాయించడం, ప్రత్యేక యాక్సెస్ ఇవ్వడం, వాటిని నిర్వహించడం సులభతరం అవుతుంది. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఉద్యోగులకు యాప్‌లను కొనుగోలు చేసి కేటాయించవచ్చు. అడ్మిన్ ఏపీఐ ద్వారా డివైస్, యూజర్, ఆడిట్, ఎండీఎం సేవలకు చెందిన డేటాను యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఐక్లౌడ్ స్టోరేజ్, యాపిల్ కేర్ ప్లస్ ఫర్ బిజినెస్ సేవలు అదనపు సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటాయి. యాపిల్ బిజినెస్ కంపానియన్ యాప్ ద్వారా ఉద్యోగులు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే సహ ఉద్యోగుల కాంటాక్ట్ వివరాలను పొందవచ్చు. అవసరం అయితే సపోర్ట్‌ను కోరవచ్చు.

కస్టమ్ డొమెయిన్‌తో ఈ-మెయిల్, క్యాలెండర్..
యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో పూర్తి స్థాయిలో సమగ్రంగా పనిచేసే ఈ-మెయిల్, క్యాలెండర్, డైరెక్టరీ సేవలను అందిస్తున్నారు. వీటిని కస్టమ్ డొమెయిన్‌తో లింక్ చేసి ఉపయోగించవచ్చు. దీని వల్ల వ్యాపారాలను పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ డొమెయిన్ సహాయంతో నిర్వహించవచ్చు. క్యాలెండర్ డెలిగేషన్ ద్వారా షెడ్యూలింగ్ సులభతరం అవుతుంది. కంపెనీ డైరెక్టరీతో పర్సనలైజ్డ్ కాంటాక్టు కార్డులతో టీమ్‌ల మధ్య అనుసంధానం మెరుగు పడుతుంది. ఈ టూల్స్ బిజినెస్‌లో రోజువారి కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తాయి. ఇక ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడేవారికి తమ వ్యాపారం లేదా సంస్థకు చెందిన లోగోలు, వ్యాపార పేర్లు, కీలక వివరాలను యాపిల్ మ్యాప్స్, వాలెట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలోనూ ఒకే విధంగా నిర్వహించవచ్చు. రిచ్ ప్లేస్ కార్డ్స్ ద్వారా ఫొటోలు, పనిగంటలు, లొకేషన్ వివరాలు తెలుస్తాయి. షోకేస్‌లు, కస్టమ్ యాక్షన్‌ల సహాయంతో ఆఫర్లు లేదా కొత్త ఉత్పత్తులను హైలైట్ చేయవచ్చు. లొకేషన్ ఇన్‌సైట్స్ తో సెర్చ్‌లు, వ్యూస్, వినియోగదారుల పరస్పర చర్యలను ట్రాక్ చేయవచ్చు. మెయిల్, ఐక్లౌడ్ మెయిల్, వాలెట్‌లో బ్రాండ్ ఐడెంటిటీ ప్రదర్శనకు అవకాశం కల్పించారు. ఐఫోన్‌లో ట్యాప్ టు పే సమయంలో కూడా బ్రాండ్ లోగో కనిపిస్తుంది.
సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ఏప్రిల్ 14 నుంచి 200కు పైగా దేశాల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అదనపు సేవల కోసం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐక్లౌడ్ స్టోరేజ్ 2టీబీకి యూజర్ నెలకు 0.99 డాలర్లు చెల్లించాలి. యాపిల్ కేర్ ప్లస్ ఫర్ బిజినెస్ సేవలు డివైస్‌కు నెలకు 6.99 డాలర్లు లేదా యూజర్‌కు 13.99 డాలర్ల చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న యాపిల్ బిజినెస్ ఎసెన్షియల్స్, బిజినెస్ మేనేజర్, బిజినెస్ కనెక్ట్ సేవలను రద్దు చేసి వాటి స్థానంలో ఈ ప్లాట్‌ఫామ్‌ను కొనసాగిస్తామని యాపిల్ స్పష్టం చేసింది. ఆయా సేవల్లోని డేటా ఈ ప్లాట్‌ఫామ్‌కు ఆటోమేటిక్‌గా మైగ్రేట్ అవుతుందని తెలిపింది. కాగా యాపిల్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో ఇచ్చిన అన్ని ఫీచర్లు అన్ని దేశాల యూజర్లకు అందుబాటులో ఉండకపోవచ్చని, సబ్ స్క్రిప్షన్ తీసుకునే ముందు ఒకసారి అందుబాటులో ఉన్న సేవలను చెక్ చేసుకోవాలని యాపిల్ సూచించింది. అలాగే యాపిల్ స్టోర్స్ లేదా యాపిల్ ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన డివైస్‌లకు మాత్రమే జీరో టచ్ డిప్లాయ్‌మెంట్ లభిస్తుందని తెలిపింది. అదనపు ఐక్లౌడ్ స్టోరేజ్, యాపిల్ కేర్ ప్లస్ సేవలకు వాడకాన్ని బట్టి చార్జిలను చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



