Anthropic | క్లాడ్ సోనెట్ 5.5 ఏఐ లాంచ్.. తక్కువ ఖర్చుతో పనిచేసుకోవచ్చు..
Anthropic | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ తన నూతన ఏఐ మోడల్ క్లాడ్ 5.5 సోనెట్‌ను లాంచ్ చేసింది. సంక్లిష్టమైన పనులకు జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది కనుక అలాంటి సందర్భాల్లో ఈ ఏఐ మోడల్ అద్భుతంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. ఇటీవలే ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ ఓపస్ 5.5ను ప్రవేశపెట్టగా దాని తరువాత వెర్షన్‌గా సోనెట్ 5.5 అందుబాటులోకి వచ్చింది.
Technology | Published On Sep 30, 2026, 3.43 pm IST
Anthropic | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ తన నూతన ఏఐ మోడల్ క్లాడ్ 5.5 సోనెట్‌ను లాంచ్ చేసింది. సంక్లిష్టమైన పనులకు జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది కనుక అలాంటి సందర్భాల్లో ఈ ఏఐ మోడల్ అద్భుతంగా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. ఇటీవలే ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ ఓపస్ 5.5ను ప్రవేశపెట్టగా దాని తరువాత వెర్షన్‌గా సోనెట్ 5.5 అందుబాటులోకి వచ్చింది. రోజువారీ పనుల కోసం కూడా ఈ కొత్త ఏఐ మోడల్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పని అందించడంలో ఈ మోడల్ గత మోడల్స్ కన్నా మెరుగ్గా పనిచేస్తుందని తెలియజేసింది. రోజువారీ అప్లికేషన్లను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపింది.
గత మోడల్స్ కన్నా మెరుగైన పనితీరు..
క్లాడ్ సోనెట్ 5.5, సోనెట్ 5తో పోలిస్తే పనితీరు, కోడింగ్, నాలెడ్జ్ వర్క్, దీర్ఘకాలిక పనులు, చిత్రాల అవగాహన, సహకారం, వేగం, సామర్థ్యం వంటి అనేక అంశాల్లో మెరుగుపడింది. టెర్మినల్ బెంచ్ 4.0లో సోనెట్ 5.5కు 70.6 శాతం స్కోర్ వచ్చింది. ఇదే పరీక్షలో సోనెట్ 5 కేవలం 10.3 శాతం స్కోర్ సాధించింది. జీడీపీ వాల్ ఏఏలో సోనెట్ 5.5 స్కోర్ ఓపస్ 5.5 కంటే రెండు పాయింట్లు మాత్రమే తక్కువగా ఉంది. దీర్ఘకాలిక నాలెడ్జ్ వర్క్‌లో సోనెట్ 5తో పాటు జీపీటీ-6 సోల్ కంటే సోనెట్ 5.5 మెరుగైన పనితీరు కనబరిచినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా మాత్రమే పనిచేస్తూ పోకీమాన్ రెడ్‌ను అధిగమించిన తొలి సోనెట్ మోడల్ కూడా ఇదేనని పేర్కొంది.
అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో..
ఓపస్ 5.5, సోనెట్ 5 మాదిరిగానే క్లాడ్ సోనెట్ 5.5 కూడా జీరో డేటా రిటెన్షన్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్, క్లాడ్ ప్లాట్‌ఫామ్ సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఈ మోడల్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. డెవలపర్లు క్లాడ్ ప్లాట్‌ఫామ్‌లో claude-sonnet-5-5 అనే మోడల్ ఐడెంటిఫయర్‌తో సోనెట్ 5.5ను ఉపయోగించవచ్చు. సోనెట్ 5 నుంచి మారే డెవలపర్లు థింకింగ్ ఆఫ్‌లో ఉంచినట్లయితే కొత్త between_tools సెట్టింగ్‌కు మారాలని ఆంథ్రోపిక్ సూచించింది. ఈ సెట్టింగ్ ప్రారంభ దశలో థింకింగ్‌ను నిలిపి ఉంచుతుంది. మార్పు కోసం ఆంథ్రోపిక్ ప్రత్యేక మైగ్రేషన్ గైడ్‌ను కూడా అందించింది. అధిక పరిమాణంలో, తక్కువ ఖర్చుతో ఉపయోగించాల్సిన అప్లికేషన్ల కోసం రూపొందిస్తున్న క్లాడ్ హైకూ 5.5ను రాబోయే వారాల్లో క్లాడ్ 5.5 కుటుంబంలోకి తీసుకురానున్నట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం






