Anthropic Claude Opus 4.6 | ఆంథ్రోపిక్ నుంచి కొత్త ఏఐ మోడల్.. ఎలాంటి పనినైనా అలవోకగా చేస్తుంది..
Anthropic Claude Opus 4.6 | కృత్రిమ మేథస్సు రంగంలో సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా తన అత్యాధునిక మోడల్ క్లాడ్ ఓపస్ 4.6 ను విడుదల చేసింది. గత వెర్షన్లతో పోలిస్తే ఇది మరింత తెలివైనది, స్థిరమైనదని ఆ కంపెనీ చెబుతోంది, దీర్ఘకాలిక పనులను సమర్థవంతంగా నిర్వహించగలదని సంస్థ ప్రకటించింది.
Technology | Published On Feb 16, 2026, 7.05 am IST
Anthropic Claude Opus 4.6 | కృత్రిమ మేథస్సు రంగంలో సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా తన అత్యాధునిక మోడల్ క్లాడ్ ఓపస్ 4.6 ను విడుదల చేసింది. గత వెర్షన్లతో పోలిస్తే ఇది మరింత తెలివైనది, స్థిరమైనదని ఆ కంపెనీ చెబుతోంది, దీర్ఘకాలిక పనులను సమర్థవంతంగా నిర్వహించగలదని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా భారీ పరిమాణంలో డేటా, దీర్ఘ సంభాషణలను పనితీరు తగ్గకుండా ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఈ మోడల్‌కు ప్రధాన ప్రత్యేకతగా చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, పరిశోధన, జ్ఞానాధారిత పనుల కోసం దీన్ని ప్రత్యేకంగా బలోపేతం చేసినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఏజెంటిక్ వర్క్‌ఫ్లోలు, కోడింగ్ పనుల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్లు సంస్థ పేర్కొంది.
భారీ ఎత్తున టెక్ట్స్ లేదా డేటా..
ఈ కొత్త వెర్షన్‌లో అత్యంత ప్రాధాన్యం పొందిన అప్‌గ్రేడ్ ఒక మిలియన్ టోకెన్ కాంటెక్స్ట్ విండో. గత ఓపస్ మోడళ్లలో ఇది సుమారు రెండు లక్షల టోకెన్లకు మాత్రమే పరిమితమై ఉండేది. పెద్ద ఫైళ్లు, విస్తృత డేటాబేస్‌లు లేదా దీర్ఘ సంభాషణల సందర్భంలో పనితీరు తగ్గే అవకాశం ఉండేది. అయితే తాజా బీటా వెర్షన్‌లో ఈ పరిమితిని ఐదింతలు పెంచారు. దీంతో ఒకేసారి మరింత విస్తృత టెక్ట్స్ లేదా డేటాను అర్థం చేసుకునే సామర్థ్యం ఈ మోడల్‌కు ఏర్పడింది. దీర్ఘకాలిక పరిశోధన ప్రాజెక్టులు, చట్టపరమైన పత్రాలు, సాంకేతిక రిపోజిటరీలు, బహుళ దశల విశ్లేషణల్లో ఇది మరింత స్థిరమైన ప్రతిస్పందనలు అందించగలదని కంపెనీ స్పష్టం చేసింది. దీర్ఘ హోరైజన్ పనుల కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు వెల్లడించింది.
మరింత మెరుగ్గా ఆటోమేషన్, పరిశోధన వర్క్ ఫ్లో..
క్లాడ్ ఓపస్ 4.6లో కాంటెక్స్ట్ కంపాక్షన్ వంటి నూతన సాంకేతికతలను చేర్చారు. దీర్ఘకాలిక పనుల సమయంలో పాత డేటాను సారాంశం చేసి సిస్టమ్‌ను తాజాగానే ఉంచే విధానం ఇది. అదనంగా అడాప్టివ్ థింకింగ్ సౌకర్యం కూడా కల్పించారు. ప్రశ్న క్లిష్టతను బట్టి మోడల్ తన తర్కశక్తి లోతును నిర్ణయించుకుంటుంది. వినియోగదారులు వేగం, తెలివితేటలు, ఖర్చు మధ్య సమతౌల్యం సాధించేందుకు వేర్వేరు ఎఫర్ట్ కంట్రోల్స్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఏజెంట్ ఆధారిత పనుల్లో ఈ మోడల్ స్వతంత్రంగా అనేక దశలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లగలదని సంస్థ చెబుతోంది. దీంతో ఆటోమేషన్, పరిశోధన వర్క్‌ఫ్లోలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి.
కోడింగ్, రీసెర్చ్‌లో మెరుగైన ప్రదర్శన..
కోడింగ్, పరిశోధన, వ్యాపార అవసరాల్లో కూడా ఈ మోడల్ బలమైన ప్రదర్శన చూపుతుందని ఆంథ్రోపిక్ పేర్కొంది. భారీ కోడ్ రిపోజిటరీలను స్వతంత్రంగా నిర్వహించడం, కోడ్ రివ్యూలు చేయడం, డీబగ్గింగ్‌లో మెరుగైన కచ్చితత్వం ప్రదర్శించడం వంటి సామర్థ్యాలు దీనిలో ఉన్నాయని వెల్లడించింది. క్లాడ్ కోడ్ రీసెర్చ్ ప్రివ్యూ ద్వారా సంయుక్త అభివృద్ధి కోసం ఏజెంట్ టీమ్‌లను సృష్టించే సదుపాయం కూడా కల్పించారు. అంతర్గత బెంచ్‌మార్క్ పరీక్షల్లో కమాండ్ లైన్, బహుళ శాస్త్ర విభాగాల తర్క పరీక్షల్లో ఇది అగ్రశ్రేణి మోడళ్లతో సమానంగా లేదా మించి ప్రదర్శన ఇచ్చిందని సంస్థ తెలిపింది. ఫైనాన్స్, లీగల్ వంటి రంగాల్లో ఏజెంటిక్ మూల్యాంకనాల్లో గత వెర్షన్ల కంటే మెరుగైన స్కోర్లు సాధించినట్లు పేర్కొంది. కంప్యూటేషనల్ బయాలజీ వంటి విభాగాల్లో పనితీరు దాదాపు రెట్టింపు అయిందని తెలిపింది. కాగా క్లాడ్ ఓపస్ 4.6 ప్రస్తుతం వెబ్‌సైట్, మొబైల్, డెస్క్‌టాప్ యాప్‌లు, ఏపీఐలు, ప్రముఖ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






