Claude AI | ఆంథ్రోపిక్ మరో అద్భుత ఆవిష్కరణ.. ఇకపై ల్యాప్ టాప్ అక్కర్లేదు, అందులో పనినంతా మనిషిలాగే ఏఐ చేస్తుంది..
Claude AI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ ఇప్పటికే ఏఐ రంగంలో అద్భుతాలను సృష్టిస్తూ ప్రత్యర్థి ఏఐ కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆంథ్రోపిక్ దెబ్బకు చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కోల్పోతారని కూడా ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఆంథ్రోపిక్ మరో అద్భుత ఆవిష్కరణకు తెరతీయబోతోంది.
Technology | Published On Mar 24, 2026, 11.57 am IST
Claude AI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఆంథ్రోపిక్ ఇప్పటికే ఏఐ రంగంలో అద్భుతాలను సృష్టిస్తూ ప్రత్యర్థి ఏఐ కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆంథ్రోపిక్ దెబ్బకు చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కోల్పోతారని కూడా ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఆంథ్రోపిక్ మరో అద్భుత ఆవిష్కరణకు తెరతీయబోతోంది. ఇకపై క్లాడ్‌ను ఉపయోగించే విధానం పూర్తిగా మారనుంది. క్లాడ్ ఇకపై పర్సనల్ ఏఐ చాట్ బాట్ లేదా జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా యూజర్‌కు చెందిన పీసీని కంట్రోల్ చేసే ఏఐ రిమోట్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంటే యూజర్ ఇకపై క్లాడ్‌కు సూచనలు ఇవ్వాల్సిన పనిలేకుండా, క్లాడ్‌కు నేరుగా పీసీని యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. అంటే యూజర్‌కు చెందిన పీసీకి కనెక్ట్ అయి ఉండే మౌస్, కీబోర్డు, పీసీ తెర మాత్రమే కాకుండా పీసీలో ఏ యాప్‌ను అయినా సరే ఉపయోగించే సామర్థ్యం క్లాడ్‌కు ఉంటుంది. యూజర్ పీసీని యాక్సెస్ ఇవ్వడంతోపాటు అందులో ఏయే యాప్‌లలో పనిచేయాలో ముందుగానే సూచనలు ఇవ్వవచ్చు. దీంతో యూజర్ పీసీ వద్ద లేకపోయినా రిమోట్‌గా ఉన్నా కూడా క్లాడ్ ఏఐ యూజర్‌కు చెందిన పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. ఇది ఏఐ ప్రపంచంలో ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని టెక్ నిపుణులు చెబుతుండగా, క్లాడ్ ఇకపై పీసీలను కూడా యాక్పెస్ చేసి యూజర్ చేయాల్సిన మొత్తం పనిని యూజర్ అందుబాటులో లేకపోయినా పూర్తి చేస్తుందని ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ మేరకు ఆంథ్రోపిక్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా ఈ ఫీచర్ వివరాలను వెల్లడించింది.
ల్యాప్ టాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు..
ఈ అప్‌డేట్‌తో అప్లికేషన్లు ఓపెన్ చేయడం, బ్రౌజర్‌లో నావిగేట్ చేయడం, స్ప్రెడ్ షీట్‌లను నింపడం వంటి సాధారణంగా డెస్క్ వద్ద చేసే పనులన్నింటినీ సులభంగా నిర్వహిస్తుంది. ఆంథ్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ ప్రకారం ఈ ఫీచర్ వల్ల ల్యాప్‌టాప్ ఓపెన్ చేయకుండానే పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. క్లాడ్‌లో స్లాక్ లేదా క్యాలెండర్ వంటి యాప్ లకు ముందుగా యాక్సెస్ ఇవ్వాలి. అవసరం అయితే ఇతర యాప్‌లకు కూడా అనుమతి కోరుతుంది. దీంతో ఏఐ ద్వారా యూజర్ పీసీని క్లాడ్ రిమోట్‌గా నియంత్రిస్తుంది. ఇలా క్లాడ్ పనిచేస్తుంది. కాగా ఆంథ్రోపిక్‌కు చెందిన ఫెలిక్స్ రీజెన్ బర్గ్ తెలిపిన ప్రకారం క్లాడ్‌లోని డిస్‌పాచ్ అనే ఫీచర్ ద్వారా యూజర్ తన పీసీ నియంత్రణను క్లాడ్‌కు అప్పగించే వీలు ఉంటుంది.

ఏఐ ఏజెంట్‌లా పీసీపై పనిచేస్తుంది..
పీసీ యాక్సెస్‌ను క్లాడ్‌కు ఇస్తే అది ఒక ఏఐ ఏజెంట్‌లా మారుతుంది. యూజర్ పనులను చక చకగా స్వయంగా పూర్తి చేస్తుంది. ఓపెన్ క్లా వంటి సిస్టమ్‌లకు సమానంగా పనిచేస్తుందని ఆంథ్రోపిక్ తెలిపింది. యూజర్ క్లాడ్‌కు రిమోట్‌గా సూచనలు ఇచ్చి వెళ్లిపోతే, తిరిగి వచ్చే లోపే పనులు పూర్తవుతాయని ఆంథ్రోపిక్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, దీన్ని పేమెంట్లు చేసి క్లాడ్‌ను వాడుతున్న క్లాడ్ కోవర్క్, క్లాడ్ కోడ్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచామని ఆంథ్రోపిక్ తెలిపింది. ఇక ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం మాక్ ఓఎస్‌పై మాత్రమే పనిచేస్తుందని, విండోస్‌కు కూడా త్వరలోనే సపోర్ట్‌ను ఇస్తామని ప్రకటించింది.
ఆంథ్రోపిక్‌దే పైచేయి..
ఈ ఫీచర్‌ను యూజర్లు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే క్లాడ్ డెస్క్‌టాప్, మొబైల్ యాప్ లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. రెండింటినీ పరస్పరం కనెక్ట్ చేయాలి. కాగా ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ఏఐ రంగంలో ఆటోమేషన్, రిమోట్ టాస్క్ మేనేజ్‌మెంట్‌కు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆయా రంగాల్లో విస్తృతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ ఫీచర్ ఆ రంగాలకు మరింత ఊతం ఇవ్వడమే కాకుండా, పనితీరు, ఉత్పాదకత మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఆంథ్రోపిక్ తన తోటి ఏఐ పోటీదారులపై ఆధిక్యం కొనసాగించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ కోవర్క్, క్లాడ్ కోడ్ ఏఐ టూల్స్ భారీ ఎత్తున ఆదరణ పొందాయి. ఇక ఓపెన్‌క్లా వంటి ఏఐ ఏజెంట్‌లు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఎన్‌వీడియా తన సొంత ఓపెన్ క్లా వెర్షన్ నెమోక్లాను విడుదల చేసింది. మరోవైపు మెటా, ఓపెన్ ఏఐ సంస్థలు కూడా ఏజెంటిక్ ఏఐ పై పనిచేస్తున్నాయి. అయితే ఆంథ్రోపిక్ అన్నింటికన్నా ముందుగానే ఈ ఫీచర్‌ను లాంచ్ చేయడం విశేషం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






