Android Devices | ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇక మరింత సెక్యూరిటీ.. చోరీకి గురైనా నో టెన్షన్..!
Android Devices | టెక్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను మరింత సెక్యూరిటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ డివైస్‌లకు ఇప్పటికే ఉన్న ప్రొటెక్షన్‌ను పెంచేలా పలు ఫీచర్లను ప్రవేశపెట్టడంతోపాటు అదనంగా మరిన్ని సెక్యూరిటీ టూల్స్ ను కూడా అందిస్తున్నట్లు తెలియజేసింది.
Technology | Published On Feb 8, 2026, 10.39 am IST
Android Devices | టెక్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను మరింత సెక్యూరిటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ డివైస్‌లకు ఇప్పటికే ఉన్న ప్రొటెక్షన్‌ను పెంచేలా పలు ఫీచర్లను ప్రవేశపెట్టడంతోపాటు అదనంగా మరిన్ని సెక్యూరిటీ టూల్స్ ను కూడా అందిస్తున్నట్లు తెలియజేసింది. వీటి వల్ల ఇకపై యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైస్‌లను కోల్పోయినట్లయితే ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని, డివైస్‌లోని డేటాను ఎవరూ తీసుకోలేరని స్పష్టం చేసింది. ఈ సెక్యూరిటీ ఫీచర్లు, టూల్స్‌ను ఆండ్రాయిడ్ 10 ఆపైన ఓఎస్ వెర్షన్ కలిగిన డివైస్ లకు ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చామని గూగుల్ వెల్లడించింది. ఈ క్రమంలోనే నూతన థెఫ్ట్ ప్రొటెక్షన్ అప్‌డేట్‌ను గూగుల్ విడుదల చేసింది. చోరీకి గురైన ఫోన్లను నేరగాళ్లకు పూర్తిగా ఉపయోగం లేకుండా చేయడమే ఈ ఫీచర్ల లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది.
ఫెయిల్డ్ ఆథెంటికేషన్ లాక్..
గూగుల్ విడుదల చేసిన నూతన థెఫ్ట్ ప్రొటెక్షన్ అప్‌డేట్ ప్రకారం ఇకపై ఆండ్రాయిడ్ డివైస్‌లకు గాను కొత్తగా ఫెయిల్డ్ ఆథెంటికేషన్ లాక్ అనే ఫీచర్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల యూజర్లు తమ డివైస్‌లకు మరింత ప్రొటెక్షన్ పొందవచ్చు. ఇతరులు ఎవరైనా సరే డివైస్ కు చెందిన పిన్, పాస్‌వర్డ్, ప్యాటర్న్ ను తప్పుగా ఎంటర్ చేస్తే డివైస్ అసాధారణ రీతిలో లాక్ అవుతుంది. ఆ తరువాత కేవలం యూజర్ మాత్రమే ఆ డివైస్‌ను అన్ లాక్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇతరులకు అసలు ఆ ఫోన్ ఇక ఏమాత్రం పనిచేయదు. వాస్తవానికి ఈ ఫీచర్ ఐఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నా, ప్రస్తుతం గూగుల్ కూడా దీన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లకు అందిస్తోంది.
ఐడెంటిటీ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు..
ఆండ్రాయిడ్ డివైస్‌ల సెక్యూరిటీ కోసం ఇప్పటికే ఐడెంటిటీ ఫీచర్‌ను అందిస్తుండగా గూగుల్ దీనికి మరిన్ని మెరుగులు దిద్దింది. దీని ప్రకారం ఇకపై యూజర్ తాను రోజూ ఉండే ప్రాంతాల్లో కాకుండా ఏదైనా కొత్త ప్రాంతంలో ఉంటే ఆటోమేటిగ్గా డివైస్ భద్రత పెరుగుతుంది. అంటే రోజూ ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉండే వారు బయట ఎక్కడికైనా వెళ్తే ఆ ప్రాంతాన్ని ఈ ఫీచర్ గుర్తించి యూజర్ పబ్లిక్ ప్రదేశంలో ఉన్నాడని గమనించి డివైస్ సెక్యూరిటీని మరింత పెంచుతుందన్నమాట. ఈ క్రమంలో డివైస్‌ను యాక్సెస్ చేయాలంటే తప్పనిసరిగా పిన్, పాస్‌వర్డ్ లేదా ఫేస్ అన్ లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్‌లను వాడాల్సి ఉంటుంది. దీంతో ఇతరులు ఎవరూ డివైస్‌ను యాక్సెస్ చేయకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పెరగనున్న లాక్ అవుట్ సమయం..
గూగుల్ ప్రవేశపెట్టిన నూతన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లలో భాగంగా ఇకపై పిన్ లేదా ప్యాటర్న్, పాస్‌వర్డ్‌లను తప్పుగా ఎంటర్ చేస్తే లాక్ అవుట్ సమయం మరింత పెరగనుంది. దీని వల్ల బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కష్టమవుతాయి. ఫోన్‌ను హ్యాకింగ్ కు గురికాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇతరులు ఎవరూ అంత సులభంగా డివైస్‌ను అన్‌లాక్ చేయలేరు. ఇక android.com/lock అనే ఫీచర్ ద్వారా యూజర్లు తమ డివైస్‌ను రిమోట్ గా లాక్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ దీనికి మరింత సెక్యూరిటీ కల్పించారు. ఈ ఫీచర్‌ను వాడుకునే సమయంలో యూజర్‌కు ముందుగా సెట్ చేసుకున్న ప్రశ్నలను సిస్టమ్ సంధిస్తుంది. వాటిని యూజర్ అయితేనే ఆన్సర్ చేయగలడు. కనుక ఈ ఫీచర్ ద్వారా సెక్యూరిటీ మరింత పెరుగుతుంది. డివైస్‌ను రిమోట్‌గా ఇతరులు అన్‌లాక్ చేస్తే వారికి ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి ఆ సందర్భంలో వారు ఫెయిల్ అవుతారు. దీంతో డివైస్ అన్‌లాక్ అవదు. ఫలితంగా హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉంటుంది. ఇలా ఆయా సెక్యూరిటీ టూల్స్, ఫీచర్లు పనిచేస్తాయని గూగుల్ వెల్లడించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






