ChatGPT | చాట్ జీపీటీని భారీ ఎత్తున బహిష్కరిస్తున్న అమెరికన్లు.. కారణం ఏంటంటే..
ChatGPT | అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఏఐ ప్లాట్‌ఫామ్ ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీని అమెరికన్లు పెద్ద ఎత్తున బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే 25 లక్షల మందికి పైగా చాట్ జీపీటీ వాడకాన్ని నిలిపివేశారని ఓ వెబ్ సైట్ పేర్కొంది. గత వారంలో అమెరికా రక్షణ శాఖ (United States Department of Defense)తో ఓపెన్ ఏఐ (OpenAI) ఒప్పందం కుదుర్చుకుంది.
Technology | Published On Mar 4, 2026, 11.39 am IST
ChatGPT | అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఏఐ ప్లాట్‌ఫామ్ ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీని అమెరికన్లు పెద్ద ఎత్తున బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే 25 లక్షల మందికి పైగా చాట్ జీపీటీ వాడకాన్ని నిలిపివేశారని ఓ వెబ్ సైట్ పేర్కొంది. గత వారంలో అమెరికా రక్షణ శాఖ (United States Department of Defense)తో ఓపెన్ ఏఐ (OpenAI) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పెంటగాన్‌కు చెందిన రహస్య నెట్‌వర్క్‌లలో చాట్ జీపీటీని పరిమితులు లేని విధంగా పూర్తి స్థాయి యాక్సెస్‌తో ప్రభుత్వం వినియోగించుకునేందుకు వీలుంటుంది. అయితే ఇదే ఒప్పందాన్ని ఆంథ్రోపిక్ రద్దు చేసుకుంది. ఆ తరువాత వెంటనే ఓపెన్ఏఐ లైన్‌లోకి వచ్చి అమెరికా రక్షణశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అమెరికన్లు ఓపెన్ఏఐపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సంస్థకు చెందిన జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ చాట్ జీపీటీని బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చాట్ జీపీటీపై తీవ్ర అసంతృప్తి..
ఓ వెబ్‌సైట్‌లో ఇప్పటికే భారీ ఎత్తున సంతకాలు, సోషల్ మీడియా షేర్లు చేయగా, ఇప్పటికే చాలా మంది అమెరికన్లు చాట్ జీపీటీ సేవల వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యాప్ వినియోగానికి చెందిన విశ్వసనీయ డేటా ఆధారంగా చాట్ జీపీటీ పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. మేం అమెరికన్లను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను చాట్ జీపీటీని విడిచిపెట్టేందుకు సమీకరిస్తున్నాం.. అని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. మనం కలసి పనిచేస్తే ఓపెన్ఏఐపై ఒత్తిడి తీసుకు రావచ్చు. చాట్ జీపీటీని ఉదాహరణగా చూపిస్తే ఐసీఈకి సహకరించే సంస్థలకు వారి చర్యలకు పరిణామాలు ఉంటాయని స్పష్టమైన సందేశాన్ని ఇవ్వగలం.. అని ఆ వెబ్‌సైట్ తెలిపింది.
పెరిగిన యాప్ అన్ఇన్‌స్టాలేషన్స్..
అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ తెలిపిన వివరాల ప్రకారం ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ టూల్ ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లతో మొదటి స్థానంలో నిలిచింది. చాట్ జీపీటీని కూడా క్లాడ్ ఏఐ అధిగమించింది. టెక్ క్రంచ్ రిపోర్టు ప్రకారం అమెరికాలో చాట్ జీపీటీ మొబైల్ యాప్ అన్ఇన్‌స్టాలేషన్స్ గత శనివారం ఒక్క రోజులోనే 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది. ఇప్పటికే పెంటగాన్‌కు ఏఐ సేవలను అందిస్తున్న ఆంథ్రోపిక్‌ను తప్పించిన వెంటనే ఓపెన్ఏఐ సదరు ఒప్పందం కుదుర్చుకోవడం విమర్శలకు దారి తీసింది. ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ తమ ఏఐ మోడల్స్‌ను అమెరికా దేశీయ సర్వైలెన్స్ కోసం ఉపయోగించాలనుకుంటుందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. తమ ఏఐ మోడల్స్‌ను అలాంటి పనులకు వాడలేమని చెప్పారు. అందువల్లే అమెరికా రక్షణశాఖ ఆంథ్రోపిక్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని దాన్ని ఓపెన్ఏఐకి అప్పగించింది. ఈ క్రమంలోనే ఓపెన్ఏఐకి ప్రస్తుతం అమెరికన్ల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి.
స్పందించిన శామ్ ఆల్ట్‌మన్..
కాగా అమెరికన్ల నుంచి వస్తున్న నిరసనలకు ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. అమెరికా రక్షణ శాఖతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని చాలా త్వరగా ప్రకటించామని, అది తాము చేసిన తప్పు అని అంగీకరించారు. ఇలాంటి అంశాలు చాలా సున్నితమైనవి, చాలా క్లిష్టమైనవి. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. మేం పరిస్థితిని ఇంకా తీవ్రంగా మారకుండా ఆపాలని ప్రయత్నించాం. కానీ అది అవకాశవాదం, అస్తవ్యస్తంగా కనిపించింది.. అని ఆయన అన్నారు. అయితే ది గార్డియన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఓపెన్ఏఐ అమెరికా రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సాంకేతికతను ప్రజలపై సర్వైలెన్స్ కోసం ఉపయోగించకూడదని, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి రక్షణశాఖ గూఢచారి సంస్థలు అలాంటి పనులు చేయకుండా స్పష్టంగా నిషేధిస్తామని ఓపెన్ఏఐ అమెరికా ప్రభుత్వానికి తెలపనున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
- ●Maharashtra Family Suicide | కన్నీళ్లు పెట్టిస్తున్న 'షేరూ' కథ: లోయలో పడి కుటుంబం చనిపోయినా.. 3 రోజులుగా వారి కోసమే ఎదురుచూపులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ





